అన్వేషించండి

Ketan Agarwal Murder: పెళ్లికి ముందే కాబోయే భర్తను లోయలోకి తోసి చంపిన పెళ్లికుమార్తె - ప్రియుడితో కలిసి ఘాతుకం - వీళ్లనేం చేయాలి?

Pune Crime 2026: పెళ్లికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ కాబోయే భార్య పిలిచిందని ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. కానీ లోయలోపడి శవమయ్యాడు. తేలిందేమిటంటే ఆ కాబోయే పెళ్లామే ప్రియుడితో కలిసి కాటికి పంపేసింది.

Pune real estate builder son killed before grand wedding:  మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం లోనావాలా సమీపంలో ఉన్న లోహగడ్ కోట వద్ద కొద్దిరోజుల క్రితం జరిగిన యువ పారిశ్రామికవేత్త మరణం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. మొదట ప్రమాదవశాత్తూ లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన.. పోలీసుల లోతైన దర్యాప్తులో పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన ఘోర హత్యగా తేలింది. పింప్రి చించ్వాడ్‌కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి విశాల్ అగర్వాల్ కుమారుడు కేతన్ అగర్వాల్  ను, అతడి కాబోయే భార్య సియా గోయల్  తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కుట్రపూరితంగా లోయలోకి తోసి చంపేసిందని పూణే రూరల్ పోలీసులు వెల్లడించారు.

 రూ. 17 కోట్లతో రాయల్ వెడ్డింగ్ ప్లాన్.. ఇంతలోనే దారుణం 

ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లి, ఇటీవలె తిరిగివచ్చిన కేతన్ అగర్వాల్.. తండ్రి వ్యాపార బాధ్యతలను చూసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కేతన్‌కు సియా గోయల్‌తో నిశ్చితార్థం కాగా, ఈ ఏడాది నవంబర్ 25న వివాహం జరిపించేందుకు ఇరు కుటుంబాలు నిర్ణయించాయి. రాజస్థాన్‌లోని జైపూర్‌లో ఉన్న ఒక ప్రసిద్ధ ప్యాలెస్‌ను ఏకంగా రూ. 17 కోట్ల భారీ వ్యయంతో పెళ్లి కోసం బుక్ చేశారు. అంతేకాదు, వీఐపీ అతిథుల ప్రయాణం కోసం రెండు ప్రైవేట్ విమానాలను కూడా సిద్ధం చేశారు. ఇరు కుటుంబాల్లో పెళ్లి సందడి మొదలైన తరుణంలోనే ఈ ఘోరం జరగడం అందరినీ షాక్‌కు గురిచేసింది.  

 పుట్టినరోజు వేడుకల నెపంతో కోటకు పిలిపించి.. 

సియా గోయల్‌కు జూన్ 19న పుట్టినరోజు కావడంతో, దానికి ఒకరోజు ముందు  సెలబ్రేషన్స్ కోసమంటూ కేతన్‌ను బలవంతంగా లోహగడ్ కోట ట్రెకింగ్‌కు పిలిపించింది. నిజానికి జూన్ 14న కూడా ఆమె కేతన్‌ను అక్కడికి తీసుకెళ్లి లోయలోకి తోసేయాలని ప్రయత్నించగా, ఒక చెట్టు అడ్డుపడటంతో కేతన్ ప్రాణాలతో బయటపడ్డాడు. అప్పుడు పాము చూసి భయపడి నెట్టేసానంటూ సియా కట్టుకథ అల్లింది. ఎలాగైనా కేతన్‌ను వదిలించుకోవాలని డిసైడ్ అయిన సియా.. జూన్ 18న మరోసారి అతడిని అక్కడికి తీసుకెళ్లి, ఫోటోలు దిగుతున్న సమయంలో తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి 400 అడుగుల లోతైన లోయలోకి నెట్టేసింది. కేతన్ బ్యాలెన్స్ తప్పి పడిపోయాడంటూ అప్పుడు కూడా అందరినీ నమ్మించింది.

 ఎండలో హుడీ వేసుకున్న ప్రియుడు.. పోలీసుల చేతికి చిక్కిన క్లూ 

కేతన్ అనుభవజ్ఞుడైన ట్రెక్కర్ కావడంతో అతడు అంత తేలిగ్గా జారిపడే అవకాశం లేదని కుటుంబ సభ్యులు లోనావాలా రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కోట పరిసరాల్లోని సీసీటీవీ   ఫుటేజీలను పరిశీలించారు. జూన్ లోనావాలాలో విపరీతమైన ఎండ, ఉక్కపోత ఉన్నప్పటికీ.. ఒక యువకుడు ఒళ్లంతా కప్పేసేలా పెద్ద హుడీ టీషర్ట్ వేసుకుని, హెడ్‌ఫోన్స్ పెట్టుకుని అనుమానాస్పదంగా తిరగడం పోలీసుల కంటపడింది. ఆ సాంకేతిక ఆధారాలు, మొబైల్ కాల్ డేటా రికార్డులను ట్రాక్ చేయగా.. ఆ హుడీ ధరించిన వ్యక్తి సియా రహస్య ప్రియుడు చేతన్ చౌదరిగా తేలింది.

 కఠిన శిక్షకు డిమాండ్ 

పోలీసులు సియా గోయల్, చేతన్ చౌదరిలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. సియాకు కేతన్‌తో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని, చేతన్‌తో ఉన్న ప్రేమబంధం వల్లే కేతన్‌ను వదిలించుకోవడానికి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తేలింది. పెళ్లి జరిగితే తమ ప్రేమకు అడ్డు వస్తాడని భావించి ఈ కిరాతక ప్లాన్ అమలు చేశారు. నిందితులిద్దరిపై లోనావాలా పోలీసులు హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అన్యాయంగా తమ బిడ్డను బలితీసుకున్న నిందితులకు ఉరిశిక్ష పడేలా చూడాలని కేతన్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.   

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trainee IPS Uday Krishna Reddy Remand: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్‌కృష్ణారెడ్డికి 14 రోజుల రిమాండ్ - ఉప్పరపల్లి కోర్టు తీర్పు, చంచల్‌గూడ జైలుకు తరలింపు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
TDP SC Cell Leader Wife Assault Complaint:ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
ఎన్టీఆర్ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడి అరాచకం - భార్యపై హత్యాయత్నం - కేసు నమోదు!
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Supreme Court Big Relief Telangana: తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో ఊరట - పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్‌కు గ్రీన్ సిగ్నల్!
Pallaburusu Teaser Review : టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
టూత్ బ్రష్ కోసం తండ్రీ కొడుకుల వార్ - లెనిన్ తర్వాత చిన్న సినిమా టీజర్ వచ్చేసింది
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
రామాయణ ట్రైలర్ - శ్రీరాముడి శాంత స్వరూపం... రావణుడి ఉగ్ర రూపం... సిల్వర్ స్క్రీన్‌పై విజువల్ వండర్
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Adilabad Rains News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వానలు- ఉప్పొంగుతున్న వాగులు, వంకలు! చూడముచ్చటగా జలపాతాలు!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Commonwealth Games 2026: CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
CWG 2026లో భారత్‌కు మూడో స్వర్ణ, బాక్సింగ్‌లో 10 పతకాలు ఖాయం!
Embed widget