![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
MLA Vanama Son : పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...
ల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు ఎమ్మెల్యే వనమా కుమారుడు కారణం అని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.
![MLA Vanama Son : పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు... Police have registered a case that the son of MLA Vanama was responsible for the family suicide in Palwancha. MLA Vanama Son : పాల్వంచలో కుటుంబం ఆత్మహత్యకు కారణం ఆ ఎమ్మెల్యే కొడుకు ! వెదుకుతున్నపోలీసులు...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/01/03/b3fc3500b50ccf59c2ce051bd2a77e2c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచలో గ్యాస్ లీక్ చేసుకుని మరీ ఆత్మహత్య చేసుకున్న కుటుంబం విషాదం వెనుక ఓ ప్రజాప్రతినిధి కుమారుడి దౌర్జన్యం ఉన్నట్లుగా బయటపడింది. పాత పాల్వంచ తూర్పు బజారులో నివాసం ఉండే రామకృష్ణ, ఆయన భార్య శ్రీలక్ష్మి దంపతులతో పాటు కవలలు సాహిత్య, సాహితిలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో రామకృష్ణ , శ్రీలక్ష్మి, సాహిత్య మరణించారు. సాహితి చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారని అందరూ అనుకున్నారు. అది నిజమే కానీ ... ఆ ఇబ్బందులన్నీ కొత్త గూడెం ఎమ్మెల్యే కొడుకు వనమా రాఘవేంద్రే వల్లే వచ్చాయని సూసైడ్‌నోట్‌తో బయట పడింది.
రామకృష్ణ దంపతులు రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభించింది. అందులో వివరాల ఆధారంగా రామకృష్ణ తల్లి, సోదరితో పాటు ఎమ్మెల్యే కుమారుడు వనమా రాఘవేంద్రపై కేసు నమోదు చేశారు. . ఎమ్మెల్యే తనయుడు రాఘవేంద్ర వేధింపుల కారణంగానే చనిపోతున్నట్టుగా రామకృష్ణ ఆ లేఖలో పేర్కొనడంతో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓ కేసులో ముందస్తు బెయిల్ తో రాఘవేంద్ర బయటుకు వచ్చాడు. ఇప్పుడు రాఘవేంద్ర పరారీలో ఉన్నట్లుగా భావిస్తున్నారు.
పాల్వంచలో గతంలో రామకృష్ణ మీ సేవా కేంద్రం నిర్వహించేవారు. ఆర్థిక సమస్యలు ఎక్కువ కావడంతో మీ సేవా కేంద్రాన్ని రామకృష్ణ అమ్మేశాడు. ఆ తర్వాత ఆయన రాజమండ్రికి నివాసాన్ని మార్చాడు. అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. అయితే అప్పులు తీర్చుకునేందుకు తనకు వారసత్వపు ఆస్తిగా వచ్చిన ఇంటిని అమ్ముకునేందుకు ప్రయత్నించారు. కానీ తల్లి, సోదరి అడ్డు చెప్పారు . పెద్ద మనుషుల పంచాయతీ పేరుతో వనమా కొడుకు దగ్గరపంచాయతీ పెట్టడంతో ఆయన తీవ్రంగా అవమానించినట్లుగా తెలుస్తోంది.
Also Read: కూకట్‌పల్లిలో అగ్ని ప్రమాదం.. శివపార్వతి థియేటర్ పూర్తిగా దగ్ధం.. భారీ ఆస్తి నష్టం
ఈ కారణంగానే రామకృష్ణ కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారని భావిస్తున్నారు. వనమా రాఘవేంద్ర దొరికితే ఈ కేసులో మరికొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. సివిల్ కేసులో పంచాయతీలు చేస్తూ... ఇలా కుటుంబాలు బలైపోవడానికి రాజకీయ నేతలు.. వారి వారసులు.., అనుచరులు కారణం అవుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అయినా అధికారంబలంతో వారు తమ పంచాయతీలు కొనసాగిస్తూనే ఉన్నారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)