అన్వేషించండి

Konaseema News : అమలాపురం అల్లర్ల కేసులో మరో 20 మంది అరెస్ట్ - పరారీలో మరో 150 మంది !

కోనసీమ అల్లర్ల కేసులో మరో 20 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంకా 150 మంది పరారీలో ఉన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు.

Konaseema News :   కోనసీమ జిల్లా పేరుకు మద్దతుగా చేపట్టిన నిరసనలో చెలరేగిన అల్లర్లలో కారణమైన నిందుతులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. సంఘటన జరిగిన నాటినుంచి సీసీ కెమెరాలు,  మీడియా విజువల్స్, ఇతర సాంకేతిక ఆధారాల ద్వారా నిందితులను గుర్తించే పనిలో పడ్డ ప్రత్యేక బృందాలు తాజాగా మరో 20 మందిని గుర్తించి వారిపై పలు సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. వీరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు జిల్లా పోలీసు కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ఈ అల్లర్ల కేసులో అరెస్ట్ అయిన వారి సంఖ్య 199 కు చేరుకుంది.

అల్లర్ల కేసుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కొత్త ఎస్పీ సుధీర్ ! 
 
నూతన ఎస్పీగా కర్నూల్ ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని ప్రభుత్వం నియమిచింది. ఇంకా అయన బాద్యతలు స్వీకరించలేకపోయినా ఆయన పర్యవేక్షణలోనే ప్రస్తుత విచారణ వేగవంతంగా జరుగుతోంది. అమలాపురం డీఎస్పీ మాధవరెడ్డితోపాటు పలువురు సీఐలు, ఎస్సైలు, క్రైం బ్రాంచ్ బృందం అనుమానితులను అదుపులోకి తీసుకుని వారి సెల్ ఫోన్ నెట్వర్క్, కాల్ డేటా, వాట్సాప్ చాటింగ్, లోకేషన్ ట్రేసింగ్ తదితర సాంకేతికత ఆధారంగా విచారణ చేస్తున్నారు. ముందు ఆరోజు అల్లర్ల సమయంలో రికార్డయిన సీసీ టీవీ పుటేజీలు, పలు వీడియోలు, ఫోటోలు ఆధారంగా అనుమానితులను ట్రేస్అవుట్ చేసి వారిని అదుపులోకి తీసుకుని ఆ తరువాత సాంకేతిక పరిజ్ఞానంలో నిర్ధారించి ఆపై కేసులు నమోదు చేస్తున్నారు.

సాంకేతిక ఆధారాలతో నిందితుల అరెస్ట్ 

మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ల ఇళ్లు దహనం, పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరడం, రెండు ఆర్టీసీ, ఒక ప్రయివేటు కాలేజ్ బస్సుల దహనం విషయంలో పలువురు అనుమానితులను గుర్తించిన ప్రత్యేక బృందాలు అసలు ఈ అల్లర్ల వెనుక ఎవరున్నారన్న విషయంపైనా దృష్టిసారించి ఆపై కూడా పలువురు అనుమానితులను గుర్తించారు. వీరిలో వాట్సాప్ గ్రూపుల ద్వారా అల్లర్లను ప్రేరేపించినట్లు గుర్తించారు పోలీసులు. 

మరో 150 మంది నిందితుల కోసం గాలింపు 

అల్లర్లలో నిందితులుగా ఉన్న వారిలో చాలా మంది ఇతర ప్రాంతాలకు వెళ్లి తలదాచుకుంటున్నారు.  హైదరాబాద్, బెంగుళూరు, కండ్లా, అండమాన్ తదితర ప్రాంతాలకు వెళ్లినట్లుగా వివిధ మార్గాల ద్వారా పోలీసులు తెలుసుకున్నారు.  వారి కోసం  ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సుమారు 150 మంది వరకు ఇలా తప్పించుకు తిరుగుతున్నవారున్నారని వీరందరినీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Vizag Crime News: విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
విశాఖ ప్రైవేట్‌ బడిలో హోంవర్క్ చేయలేదని చిన్నారిని కొట్టిన టీచర్‌! ప్రణయ్ తేజ్‌ మృతి కేసులో అసలేం జరిగింది?
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget