Crime News: అతడిది సాప్ట్ వేర్ ఉద్యోగం.. నన్ను నమ్మండి చాలా డబ్బులొస్తాయని చెబుతాడు.. ఆపై
టెక్నాలజీ పెరిగేకొద్ది ఆన్లైన్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి. అమాయకులను టార్గెట్ గా చేసుకుని కొందరు సైబర్ మోసగాళ్ళు రెచ్చి పోతున్నారు.
సోషల్ మీడియాలో పోస్టులతో డబ్బులు వస్తాయని ఆశ కల్పిస్తున్నారు కొంతమంది. దీనికోసం.. కొత్త కొత్త దారులను వెతుక్కుంటున్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఎంతో మంచి అమాయకులు తమ జీవితాలను రోడ్డు పాలు చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల పోలీసులు పదే పదే ప్రజలను అప్రమత్తం చేస్తున్నా డబ్బులు వస్తాయని.. ఆశ పడి తరచూ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. చిత్తూరు జిల్లాలో ఇదే తరహాలో అమాయకపు ప్రజలను ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ లక్షల్లో మోసం చేశాడు.
చిత్తూరు నగరానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. నితీష్ రెడ్డి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి అధిక సంపాదన కోసం బెట్టింగ్ మార్గాన్ని ఎంచుకున్నాడు. సోషల్ మీడియాను అదునుగా తీసుకుని అమాయకపు ప్రజలను ట్రాప్ చేసి ఆన్లైన్ బెట్టింగ్ లకు పాల్పడే వాడు. ప్రజలను ట్రాప్ చేసేందుకు ఆన్లైన్ లో యాప్ ను సైతం రూపొందించాడు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేసేవాడు. మహదేవ ఆన్లైన్ బుకింగ్ యాప్ ద్వారా ట్విట్టర్ ఫేస్బుక్ లను వేదికగా చేసుకుని నమ్మకం కల్పించాడు. ఆన్లైన్ బెట్టింగ్ ల్లో పెట్టుబడి పెడితే రెండింతల ఆదాయం వస్తుందని నమ్మించేవాడు. టెలీగ్రామ్, వాట్సప్ గ్రూపు ద్వారా జనాలను సంప్రదించిన వారి వివరాలను సేకరించేవాడు. నెమ్మదిగా వారిని మాయ మాటలు చెప్పి వారిని బెట్టింగ్ లోకి దింపేవాడు.
అయితే తాము తాము పెట్టిన పెట్టుబడిని అదనపు ఆదాయం రాక పోగా పెట్టిన సొమ్ము కూడా రాక పోవడంతో భాధితులు నితీష్ రెడ్డిని సంప్రదిస్తే వారి నెంబర్ లను బ్లాక్ లిస్టులో పెట్టేవాడు. దీంతో తాము మోస పోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయచడంతో ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం బట్టబయలైంది. భాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాదాపు నెల రోజుల పాటు శ్రమించి నీతిశ్ రెడ్డితోపాటు అతడి ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుండి వివిధ బ్యాంక్ ఖాతాల్లోని 33 లక్షల రూపాయలను సీజ్ చేశారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ వ్యవహారం వెనక ఉన్న మరికొందరి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చిత్తూరు డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు.
Also Read: Nellore Crime: ఈ చోరుడు మహా ముదురు... పోలీసు స్టేషన్ లోనే దొంగతనం... పోలీసుల కన్నుగప్పి బైకులు చోరీ