అన్వేషించండి

Planadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం - దైవ దర్శనానికి వెళ్లొస్తూ మృత్యుఒడికి

Planadu Road Accident: దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని ఢీకొన్ని ఘటనలో ఆరుగురు మృతి చెందడంతో విషాదం చోటుచేసుకుంది.

Planadu Road Accident: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడంతో మొదట ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఆపై ఆసుపత్రికి తరలించగా మరో వ్యక్తి చనిపోయినట్లు సమాచారం. శ్రీశైలం వెళ్లి శివయ్య దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురై ఆరుగురు ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 

శివ శివ.. ఏంటయ్యా ఈ ఘోరం.. 
శ్రీశైలం వెళ్లి మల్లికార్జునస్వామిని దర్శనం చేసుకుని వస్తున్న కుటుంబం, బంధువులు మరికాసేపట్లో ఇంటికి చేరుకుంటాం అనుకున్న సమయంలో ఒక్కసారిగా రోడ్డు ప్రమాదం జరిగింది.  రెంటచింతల పొలిమేరలోకి రాగానే విద్యుత్తు సబ్ స్టేషన్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. టాటా ఏస్ వాహనం పల్టీలు కొట్టడంతో నిద్రమత్తులో ఉన్న వారికి అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఆదివారం అర్ధరాత్రి వీరి వాహాకారాలు రెంటచింత రహదారిలో ప్రతిధ్వనించినా సహాయం చేసేందుకు అక్కడ ఎవరూ లేరు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో దాదాపు 35 మంది వరకు ఉన్నట్లు సమాచారం. 

పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. పల్నాడు జిల్లా రెంటచింతల బీసీ కాలనీకి చెందిన దాదాపు 35 మంది దైవ దర్శనం చేసుకుందామని టాటా ఏస్ వాహనంలో శ్రీశైలం వెళ్లి శివయ్యను దర్శించుకున్నారు. శ్రీశైలం నుంచి తిరుగు ప్రయాణమైన వీరు మరికొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుటామనుకున్న సమయంలో వీరు ప్రయాణిస్తున్న టాటా ఏస్ వాహనం, ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో 15 మంది వరకు గాయపడ్డారు. చెల్లాచెదురుగా పడివున్న మృతదేహాలను అంబులెన్స్ లో గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ సమీర్ భాష తెలిపారు. 

అసలే చీకటి.. డ్రైవర్ అతివేగం ?
మాచర్ల నుంచి రెంటచింతలకు ప్రవేశించే మొదట్లో గోలివాగు కాలువ వద్ద స్నానాలు చేసేందుకు వాహనాలు ఆపుతుంటారు. ఇక్కడ వాహనాలు ఆపితే రాత్రివేళ కనిపించవు. రెంటచింతల బీసీ కాలనీ వాసులు ప్రయాణిస్తున్న వాహనాన్ని నడుపుతున్న డ్రైవర్ అతివేగంగా నడపడంతో టాటా ఏస్ వాహనం లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. అక్కడికక్కడే నలుగురు దుర్మరణం చెందగా.. గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మరో ఇద్దరు చనిపోయారని ఎస్సై సమీర్ భాష తెలిపారు. మొత్తం ఆరుగురు చనిపోగా, అందులో నలుగురు మహిళలున్నారు. మృతులను కోటమ్మ(70), రోశమ్మ(65), రమాదేవి(50), రమణ(50), కోటేశ్వరి(45), లక్ష్మీనారాయణ(35)గా గుర్తించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని గుంటూరు సర్వజనాసుపత్రికి తరలించారు. ఇందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.



టాప్ హెడ్ లైన్స్

Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
MLA Pocharam Srinivas Reddy: కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
కొందరు దౌర్భాగ్యుల వల్ల పార్టీ మారా.. మళ్లీ బీఆర్ఎస్‌ గూటికే: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
ఢిల్లీ-విజయవాడ ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. ఫ్లైట్ లో మంత్రి కందుల, ఎమ్మెల్యేలు 
KTR: రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెద్ద కంపెనీలకు చైర్మన్లు.. 200 కోట్ల భూమి 7 కోట్లకే కొట్టేశారు: కేటీఆర్
Chandrababu Review: ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఎల్‌నినో ఉన్నా ప్రజలపై భారం పడొద్దు.. 15 శాతం వృద్ధిరేటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
Ravindra Jadeja Test: జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
జడేజా టెస్ట్ రిటైర్మెంట్ పై రూమర్స్.. లంక సిరీస్ తర్వాత గుడ్ బై చెప్తాడా, స్టార్ ఆల్‌రౌండర్ ఫ్యూచర్ పై ఇంట్రెస్టింగ్ చ‌ర్చ‌!
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
వందేమాతరం బిల్లుకు రాష్ట్రపతి ముర్ము ఆమోదం - JPC కి పంపనున్న FCRA బిల్లు, కేంద్రం కీలక నిర్ణయం
Embed widget