అన్వేషించండి

Maha Kumbh Mela 2025: కుంభమేళాకు వెళ్లే రైలుపై రాళ్ల దాడి - డోర్లు ఓపెన్ చేయలేదని దారుణం, వైరల్ వీడియో

Kumbh Mela 2025: మధ్యప్రదేశ్‌లోని చతర్‌పుర్ రైల్వే స్టేషన్లో ఆగిన కుంభమేళా రైలుపై ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు రాళ్ల దాడికి దిగారు. లోపల ఉన్న వారు డోర్లు ఓపెన్ చేయడం లేదనే అసహనంతో రాళ్లు రువ్వారు.

Attack On Mahakumbh Mela Train: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాకు (Maha Kumbhmela) వెళ్లే రైలుపై మంగళవారం దాడి జరిగింది. మధ్యప్రదేశ్‌లోని చతర్‌పుర్ రైల్వే స్టేషన్‌లో ఆగిన ట్రైన్‌పై ప్రయాణికులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. రైలు రావడం ఆలస్యమైందని.. అయినా లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయడం లేదని స్టేషన్లోని ప్రయాణికులు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్లాట్ ఫాంపై ఉన్న వ్యక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ రైలుపై రాళ్లు విసిరారు. చతర్‌పుర్, హర్పల్‌పుర్ రైల్వే స్టేషన్లలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, రైళ్లపై దాడి జరిగిన ఘటన గురించి తమకు సమాచారం అందినట్లు జాన్సీ రైల్వే డివిజన్ పీఆర్వో మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. రైలు లోపల ఉన్న ప్రయాణికులు డోర్లు తీయకపోవడంతో ప్లాట్ ఫాంపై ఉన్న ప్రయాణికులు తీవ్ర అసహనంతో రాళ్ల దాడి చేసినట్లు చెప్పారు. అప్పటికే రైలు కిక్కిరిసిపోవడంతో చాలామంది రైలు ఎక్కలేకపోయినట్లు పేర్కొన్నారు.

ప్రత్యేక రైళ్లు..

మరోవైపు, ప్రయాగరాజ్‌లో కుంభమేళా ఘనంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు 8 కోట్ల మంది భక్తులు పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించారు. ఫిబ్రవరి 26 వరకూ కుంభమేళా జరగనుండగా.. ఈ వేడుక ముగింపు నాటికి 40 కోట్లకు పైగా భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అటు, బుధవారం మౌనీ అమావాస్య సందర్భంగా ఒక్కరోజే సుమారు 10 కోట్ల మంది వస్తారని అధికారులు భావిస్తున్నారు. అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికల్ జోన్‌గా ప్రకటించారు. సంగంకు వెళ్లే స్థానికులు ఫోర్ వీలర్లు కాకుండా.. టూ వీలర్లు వాడాలని ప్రభుత్వం సూచించింది. అటు, పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. ఏఐ ఆధారిత సీసీ కెమెరాలతో నిఘా తీవ్రం చేశారు. మౌనీ అమావాస్య ప్రత్యేకత దృష్ట్యా ఈ నెల 28, 29, 30 తేదీల్లోప్రయాగ్‌రాజ్‌లో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.

అటు, ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారీగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గంటగంటకూ రైళ్లు నడుపుతోంది. మహా కుంభమేళాకు విచ్చేసే భక్తుల కోసం రైల్వే వివిధ మార్గాల్లో రైళ్లను నడుపుతుండగా, ప్రయాగ్ రాజ్ చుట్టుపక్కల స్టేషన్లలోనూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీతో కూడిన స్టేషన్లలో ఒకటైన పండిట్ దీన్ దయాళ్ ఉపాద్యాయ్ జంక్షన్ వద్ద పరిస్థితిని నియంత్రించేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ప్యాసింజర్ హాలుతో పాటు స్టేషన్ ఆవరణలో భక్తులకు విశ్రాంతి కోసం హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. స్నానానికి వెళ్లే భక్తులందరినీ వీలైనంత త్వరగా స్నానానికి తీసుకెళ్లి.. అంతే త్వరగా తిరిగి రప్పించేలా గంట గంటకూ సర్వీసులు నడుపుతున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది. 

Also Read: Mona Lisa: పది రోజుల్లో పది కోట్లు సంపాదించిన మోసాలిసా - ఆమె ఏమంటున్నారో తెలుసా?

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Gachibowli Building Collapse: గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
గచ్చిబౌలి బిల్డింగ్ ప్రమాదం.. టౌన్‌ప్లానింగ్‌ అధికారిపై వేటు- బిల్డర్‌పై నాన్‌బెయిలబుల్ కేసులు
Adilabad Crime News: మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌లోకి అక్రమంగా మద్యం.. ప్రధాన నిందితుడి అరెస్ట్, 1300 బాటిళ్లు సీజ్
Hyderabad Building Collapse: గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
గచ్చిబౌలిలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల బిల్డింగ్.. ఇద్దరు మృతి!
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
GHMC తప్పులకు మా ప్రాణాలు పోతున్నాయి..! మాదాపూర్ బిల్డింగ్ కూలిన ఘటనలో సంచలన విషయాలు
NITI Aayog Report: 8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
8.7 కోట్ల మంది యువత చదువులో, ఉద్యోగంలోనూ లేరు! నీతి ఆయోగ్ సంచలన నివేదిక
CM Revanth Reddy: కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
కొన్ని గంటల్లో లండన్ నుంచి హైదరాబాద్‌కు.. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతా: రేవంత్ రెడ్డి
Kesineni Nani: విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
విజయవాడకు మెట్రో రైలు అక్కర్లేదు.. రూ.12 వేల కోట్లు వద్దు, 500 కోట్లు చాలు: కేశినేని నాని
IND VS SL Gill Historic Milestone: గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
గిల్ అరుదైన రికార్డు.. డబ్ల్యూటీసీలో ఆ ఘన‌త సాధించిన భార‌త కెప్టెన్ గా రికార్డు!
Viral Video: మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్‌ అరెస్ట్ ! నెక్ట్స్ ఏంటీ?
Zombie Reddy 2 : జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
జాంబీరెడ్డి సీక్వెల్ వచ్చేస్తోంది - ఈసారి వైరస్ నెక్స్ట్ లెవల్ అంతే...
IND VS SL Padikkal Hundred: పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
పడిక్కల్ సూపర్ సెంచరీ.. భారీ స్కోరు దిశ‌గా టీమిండియా.. రాణించిన గిల్, జ‌డేజా, జైస్వాల్, పంత్ ఇంజ్యూరీ సస్పెన్స్, లంక‌తో రెండో టెస్టు!
Embed widget