Mona Lisa: పది రోజుల్లో పది కోట్లు సంపాదించిన మోసాలిసా - ఆమె ఏమంటున్నారో తెలుసా?
10 Crore In 10 Days: మహాకుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా గురించి రోజూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా ఒకటి పది రోజుల్లో పది కోట్లు సంపాదించారని ప్రచారం చేస్తున్నారు.

Did Mona Lisa The Viral Kumbh Mela Girl Earn Rs 10 Crore In 10 Days: సోషల్ మీడియా పవర్ అలాగే ఉంటుది. ఓవర్‌నైట్ సూపర్ స్టార్ అయిపోతారు. మహాకుంభమేళా పుణ్యమా అని.. పూసల దండలు అమ్ముకునే మోనాలిసా భోస్లే రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయారు. అంతా ఆమె గురించి చర్చించుకోవడమే ఎక్కువ అయిపోయింది. చివరికి సినిమా ఆపర్ కూడా ఇస్తామని బాలీవుడ్ కు చెందిన ఓ దర్శకనిర్మాత ప్రకటించారు.
సోషల్ మీడియా సూపర్ స్టార్ గా మారిన మోనాలిసా
అమె సోషల్ మీడియాకు ఎంత కీలకమైన వ్యక్తిగా మారారంటే... మోసానిసా గురించి ప్రతి విషయాన్ని రిపోర్టు చేస్తున్నారు. ఆమె కనిపిస్తే సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. ఈ క్రమంలో అనేక రూమర్స్ ను కూడా ప్రచారంలోకి తెస్తున్నారు.తాజాగా ఆమె పది రోజుల్ోలనే పది కోట్లు సంపాదించారన్ నప్రచారం ఉద్ధృతంగా చేస్తున్నారు. ఎలా సంపాదించారో మాత్రం చెప్పడం లేదు. ఈ ప్రచారం ఆమె చెవిలో కూడా పడింది. తన జీవితంలో కనీసం లక్ష రూపాయలు కూడా చూడని ఆమె ఈ ప్రచారంపై ఆశ్చర్యపోయారు.
పది రోజుల్లో పది కోట్లు వచ్చాయంటూ ప్రచారం - ఆశ్చర్యపోయిన మోనాలిసా
పది రోజుల్లో పది కోట్లు సంపాదించి ఉంటే తాను పూరింట్లో ఎందుకు ఉంటానని తన ఇంటి ఫోటోను చూపించారు. సోషల్ మీడియాలో వైరల్ అయినంత మాత్రాన రాత్రికి రాత్రికి ఆమెకు డబ్బులు వచ్చి పడే అవకాశాలు ఉండవు. సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించి ఎవరికైనా ప్రమోషన్ వర్క్ ప్రారంభించినా అంత పెద్దమొత్తలో వచ్చే అవకాశాలు లేవు. అయితే మోనాలిసాకు వచ్చిన క్రేజ్ చూసి కొంత మంది అలాంటి ప్రచారం చేస్తున్నారు.
కుంభమేళా నుంచి సొంత ప్రాంతానికి వెళ్లిపోయిన మోనాలిసా
నిరుపేద కుటుంబానికి చెందిన మోనాలిసా.. తన వల్ల కుటుంబ వ్యాపారం అయిన పూసలు అమ్ముకునే బిజినెస్ దెబ్బతిన్నది బాధపడుతున్నారు. కుంభమేళాలో ఆమెకు భద్రత లేకపోవడంతో మధ్యప్రదేశ్ లోని ఇంటికి ఆమె తండ్రి పంపివేశారు. కుంభమేళాలో ఉన్నప్పుడు ఆమెను పలువురు హరాస్ చేసిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Nomadic tribal girl Monalisa is being unnecessarily harassed by people in Kumbh Mela, this is dangerous, the government should provide security to this girl. pic.twitter.com/nEEKDpXaGv
— The Dalit Voice (@ambedkariteIND) January 22, 2025
మోనాలిసా ఇప్పుడు పెద్ద మొత్తంలో సంపాదించి ఉండకపోవచ్చు కానీ.. సోషల్ మీడియాలో తనకు వచ్చిన ఈ క్రేజ్ ను సమర్థంగా వాడుకుంటే.. భవిష్యత్ లో ఇప్పుడు ప్రచారం జరుగుతున్నంత సంపాదించుకునే అవకాశం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు
Also Read: మౌని అమావాస్య రోజున కుంభమేళాకు వెళ్తున్నారా - సంగంలో స్నానం చేసే విధానం, పాటించాల్సిన నియమాలివే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

