By: ABP Desam | Updated at : 25 Apr 2022 11:52 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Palnadu District: అక్రమ సంబంధం చిచ్చు ఓ ప్రాణాన్ని తీసింది. బాల్య స్నేహితుల మధ్యే గొడవ రేపి ఒకరిని మరొకరు చంపుకొనే వరకూ వెళ్లింది. పల్నాడు జిల్లా (Palnadu District) మాచవరంలో (Machavaram) ఈ ఘటన జరిగింది. ఇద్దరూ ప్రాణ స్నేహితులు, బాల్య మిత్రులు కాగా.. ఒకరి భార్యపై మరో వ్యక్తి వివాహేతర సంబంధం (Extra Marital Affaire) కొనసాగించాడనేది ఆరోపణ. ఈ విషయంలోనే భార్యాభర్తల మధ్య గొడవలు రేగి, చివరికి ప్రాణ స్నేహితులు మధ్య అగ్గి రాజేసింది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమ్మినేని శ్రీరాములు, వంగర అనిల్ బాల్యం నుంచి స్నేహితుల. ఎవరికి ఏ కష్టం వచ్చినా తీర్చుకుంటూ ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఇటీవల వంగర అనిల్ భార్యకు కొమ్మినేని శ్రీరాములుతో అక్రమ సంబంధం ఉందేమో అనే అనుమానం ఏర్పడింది. దీంతో వంగర అనిల్ తన భార్యను హింసిస్తూ ఉండేవాడని స్థానికులు చెబుతున్నారు. అంతేకాకుండా ఇటీవల వంగర అనిల్ భార్య, అనుమానంతో తన భర్త తనను రోజూ హింసిస్తున్నాడని మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టిందని స్థానికులు తెలుపుతున్నారు. ఈ పరిణామంతో తన భార్యతోనే తన పైన కేసు పెట్టిస్తావా అంటూ వంగర అనిల్.. కొమ్మినేని శ్రీ రాములును నిలదీశాడని, దాంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు స్థానికులు చెప్పారు.
Also Read: Hyderabad: మగవారికి మహిళలతో బాడీ మసాజ్! స్పా సెంటర్ పై ఆకస్మిక దాడులు
ఈ నేపథ్యంలోనే ఆదివారం రాత్రి కొమ్మినేని శ్రీరాములు ఒంటరిగా వస్తుండడం గమనించిన వంగర అనిల్ శ్రీరాములుపై కత్తితో దాడి చేసి విచక్షణా రహితంగా పొడిచాడు. కొమ్మినేని శ్రీరాములు రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసిన స్థానికులు అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. శ్రీ రాములు వర్గీయులు వంగర అనిల్ కూడా చంపాలని పెద్ద ఎత్తున గుమికూడటంతో పోలీసులు రాత్రి మాచవరం (Machavaram) గ్రామంలో కర్ఫ్యూ విధించారు.
పిడుగురాళ్ల (Piduguralla) పట్టణ సీఐ మధుసూదన్ రావు సంఘటనా స్థలానికి చేరుకుని కొమ్మినేని శ్రీరాములు హత్య చేసిన వారిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటన గ్రామంలో సంచలనాత్మకంగా మారింది.
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Srikakulam Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురైన కుటుంబం- ఇంటి నుంచి బయలుదేరిన 10 నిమిషాలకే !
Hyderabad Fire Accident: రాయదుర్గంలోని హోటల్లో భారీ అగ్ని ప్రమాదం, భవనంలో చిక్కుకున్న 20 మంది - రంగంలోకి దిగిన రెస్క్యూ టీమ్
LG Rollable TV: ఈ టీవీ రేటుకి ఇల్లే కొనేయచ్చుగా - ఎల్జీ కొత్త టీవీ స్పెషాలిటీ ఏంటంటే?
3 Years of YSR Congress Party Rule : జగన్ మూడేళ్ల పాలనలో టాప్ టెన్ హైలెట్స్ ఇవే !
TSRTC Water Bottle : టీఎస్ఆర్టీసీ వాటర్ బాటిల్స్ కు పేరు, డిజైన్ సూచించండి, ప్రైజ్ మనీ గెలుచుకోండి
Viral Video Impact : సోషల్ మీడియా పవర్, బిహార్ బాలికకు కృత్రిమ కాలు