By: ABP Desam | Updated at : 25 Apr 2022 09:41 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న నిర్వాహకుడితో పాటు ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురంలోని పనామా చౌరస్తా వద్ద ఈ స్పా సెంటర్ తప్పుడు పనులు వెలుగులోకి వచ్చాయి. వనస్థలిపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పనామా చౌరస్తా దగ్గర ఉన్న ఓ కాంప్లెక్స్‌లో గ్లోయునిక్స్ సెలూన్ అని ఉంది. అందులో క్రాస్ మసాజ్, స్పా మసాజ్ చేస్తూ గుట్టు చప్పుడు కాకుండా వ్యబిచారం నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారం పోలీసులకు అందింది.
ఆ కాంప్లెక్స్‌లోని ఓ పోర్షన్‌లో రెండు వేర్వేరు గదులలో సాయి కల్యాణ్, ఎడ్ల సుధాకర్ అనే వ్యక్తులను పోలీసులు గుర్తించారు. ఇద్దరు యువతులతో పాటు, నిర్వాహకుడు ఏరుకొండ రవీందర్ అనే వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి రూ.1,500 నగదు, నాలుగు సెల్ ఫోన్‌లు, రెండు బైకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని రిమాండ్‌కు తరలించినట్లుగా పోలీసులు వెల్లడించారు.
కొద్ది రోజుల క్రితమే హైటెక్ వ్యభిచారం
కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్ నగరంలో సెక్స్ రాకెట్‌ను పోలీసులు భగ్నం చేశారు. నార్సింగిలోని ఓ ఫ్లాట్‌లో హైటెక్ పద్ధతిలో ఈ సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీని నిర్వహకులు ఉగాండా దేశస్తులు అని పోలీసులు నిర్ధరించారు. వారిని అరెస్టు చేశారు. వ్యభిచారం నిర్వహించడం కోసం ఈ ఉగాండా దేశీయులు ప్రత్యేక యాప్‌ను రూపొందించినట్లుగా పోలీసులు తెలుసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్నవారందరూ వీఐపీలేనని గుర్తించారు. ఈ వ్యభిచార యాప్‌ను బ్యాంకు యాప్ మాదిరిగా ప్రత్యేక సెక్యురిటీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లాట్‌కు వచ్చే విటులు తప్పనిసరిగా ముందుగా బుక్ చేసుకున్న ప్రకారం ప్రత్యేక కోడ్ లేదా ఓటీపీ వాడితేనే లోనికి రానిచ్చే విధంగా సాఫ్ట్ వేర్ తయారు చేసుకున్నారు. ఆ సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేస్తేనే విటులకు అనుమతిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు.
విటుడు డబ్బు చెల్లించడానికి ఒప్పుకున్న తర్వాత ఆ ఇంటిలోకి, మహిళ వద్దకు వెళ్లేందుకు ఆ కోడ్ తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించారు. ఆ వెంటనే నిర్వహకులు కస్టమర్ ఫోన్ నుంచి సంప్రదించిన వివరాలు, ఇతర సమాచారం తొలగిస్తారు. అలా చేయడం ద్వారా వినియోగదారుడు ఆ డేటాను దుర్వినియోగం చేయకుండా వీలు ఉంటుందని పోలీసులు వివరించారు. హైటెక్ పద్ధతిలో ఇలాంటి సెక్స్ రాకెట్‌ను ఇప్పటి వరకు చూడలేదని పోలీసులు విస్మయం వ్యక్తం చేశారు.
జీడిమెట్లలోనూ..
జీడిమెట్లలోనూ మరో వ్యభిచార రాకెట్ గుట్టు రట్టయింది. రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు అనే 33 ఏళ్ల వ్యక్తి జీడిమెట్ల టీఎస్‌ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఆ ఇంటిపై దాడి చేసి నిర్వహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించారు. నిర్వహకుడు వీరరాజు సహా విటుడిపై కేసు నమోదు చేశారు.
ఓ మహిళను వ్యభిచార కూపంలోకి దింపాలని యత్నించిన ఓ వ్యక్తికి మేడ్చల్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే, రూ.వెయ్యి జరిమానా విధించింది. 2021లో విశాఖపట్నంకు చెందిన ఓ మహిళ హైదరాబాద్ వచ్చేందుకు కర్నూల్ బస్టాండ్‌లో బస్సుల కోసం వేచి ఉంది. ఇది గమనించిన అదే ప్రాంతానికి చెందిన బుగ్గన మధుమోహన్ రెడ్డి ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమెతో మాటలు కలిపి.. తనవెంటనే హైదరాబాద్ కు తీసుకువచ్చాడు. ఈ క్రమంలోనే మాయమాటలు చెబుతూ.. వ్యభిచార కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. ముందుగానే అప్రమత్తమైన సదరు మహిళ.. అతని నుంచి తప్పించుకుని.. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad: వంట మాస్టర్‌తో మహిళ సహజీవనం, ఇంతలో గది నుంచి కంపు వాసన - తెరిచి చూసి స్థానికులు షాక్
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం - బస్సు, లారీ ఢీకొనడంతో 7 మంది మృతి
Hyderabad: ఏడాదిగా సహజీవనం, రెండ్రోజుల్లోనే పెళ్లి - ఇంతలో వరుడు మృతి! వధువు ఏం చేసిందంటే
Tirupati: పీకలదాకా తాగి పోలీసులు వీరంగం, భయపడి 100కి కాల్ చేసిన స్థానికుడు - తరువాత ఏం జరిగిందంటే !
Bus Accident: బెంగళూరు-హైదరాబాద్ హైవేపై ప్రమాదం, ప్రైవేటు బస్సు - లారీ ఢీ
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!
Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !
Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్ న్యూస్ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరపై..!