Palnadu Crime : పల్నాడులో భగ్గుమన్న పాత కక్షలు, ప్రత్యర్థుల దాడిలో వ్యక్తి మృతి
Palnadu Crime : పల్నాడు జిల్లాలో పాత కక్షలు భగ్గుమన్నాయి. దుర్గి మండలం మించాలపాడు వద్ద జల్లయ్య అనే వ్యక్తిపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాల పాలైన జల్లయ్య మృతి చెందాడు.
Palnadu Crime : పల్నాడు జిల్లా మాచర్ల పాత కక్షలు భగ్గుమన్నాయి. ఓ వర్గం వారిపై ప్రత్యర్థులు దారికాచి గొడ్డలితో దాడి చేసి హత్య చేశారు. దుర్గి మండలం మించాలపాడు వద్ద ఓ పార్టీ కార్యకర్తలపై మరో పార్టీ కార్యకర్తలు దాడి చేశారు. ఐదు లక్షల రూపాయల అపహరించినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ముగ్గురికి గాయలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. దుర్గి మండలం జంగమహేశ్వరపాడులో గతంలో గొడవల కారణంగా గ్రామాన్ని వదిలి పెట్టి మాడుగులలో ఉంటున్నారు బాధితులు. వివాహం నిమిత్తం బంధువులను పిలిచేందుకు జంగమహేశ్వరపాడు వచ్చి వెళ్తున్నప్పు ప్రత్యర్థులు కాపు కాచి దాడి చేశారు నిందితులు.
ఈ దాడిలో జాలయ్య అనే వ్యక్తి మృతి చెందారు.
గ్రామంలో పోలీస్ బందోబస్తు
పల్నాడు జిల్లా దుర్గి మండలం మించాలపాడులో ఓ పార్టీ కార్యకర్త కంచర్ల జల్లయ్యను ప్రత్యర్థులు హత్య చేశారు. విభేదాలతో ఇటీవల జల్లయ్య కుటుంబం గ్రామం విడిచి వెళ్లిపోయింది. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన ఆయనపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. దారి కాచి కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో జల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. జల్లయ్యను తొలుత మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉండడంతో గుంటూరుకు తరలించారు. గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జల్లయ్య మృతి చెందారు. పాత కక్షలే దాడికి కారణమని పోలీసులు నిర్థారించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఘర్షణలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇద్దరు మహిళలు దారుణ హత్య
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలు గురువారం హత్యకు గురయ్యారు. రెండు వేర్వేరు ఘటలు. ఓ మహిళ ను అంతమొందించించి కట్టుకున్న భర్తే అయితే మరో మహిళను ఎవరు చంపారో పోలీసులకూ అర్థం కావడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.గుంటూరు పట్టణంలో ఓ ప్రేమోన్మాది యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ రెండు హత్యలు జరిగాయి.
నడికుడిలో కట్టుకున్న భార్యను చంపేసిన భర్త !
పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడిలో నాగమణి అనే యువతిని అత్యంత దారుణంగాహత్య చేశాడు భర్త రమేష్. వేట కత్తితో ఇంట్లోనే విచక్షణా రహితంగా దాడి చేశాడు. దాంతో ఇల్లు అంతా రక్తంతో తడిచిపోయింది. కట్టుకున్న భార్యను ఇంత దారుణంగా ఎందుకు చంపాల్సి వచ్చిందో కానీ.. రమేష్ మాత్రం... వివాహేతర బంధాలను పెట్టుకుందని ఎన్ని సార్లు చెప్పినా మారడం లేదని అందుకే చంపేశానని పోలీసులకు చెబుతున్నాయి. రమేష్‌కు నాగమణితో ఇటీవలే వివాహం అయింది. బతుకుదెరువు కోసం ఇద్దరూ నడికుడిలోనే నివాసం ఉంటున్నారు. ఇద్దరూ పెద్దగా గొడవ పడినట్లుగా ఉండరు. కానీ హఠాత్తుగా తెల్లవారు జామున పెద్ద ఎత్తున అరుపులు వినిపించడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. వచ్చి చూసేసరి వేటకత్తితో రమేష్ కనిపించారు. దీంతో జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూసే సరికి నాగమణి రక్తపుమడుగులో ఉంది.
ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇద్దరు మహిళలు హత్యకు గురయ్యారు. రెండు వేర్వేరు ఘటలు. ఓ మహిళ ను అంతమొందించించి కట్టుకున్న భర్తే అయితే మరో మహిళను ఎవరు చంపారో పోలీసులకూ అర్థం కావడం లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో మహిళలపై దాడులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.గుంటూరు పట్టణంలో ఓ ప్రేమోన్మాది యువతిపై హత్యాయత్నం చేసిన ఘటన జరిగి ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఈ రెండు హత్యలు జరిగాయి.