News
News
X

Palnadu News: పదహారేళ్ల కుమారుడితో కలిసి వ్యక్తిని చంపిన తండ్రి - 16 ముక్కలు చేసి ఆపై కాల్చేసి!

Palnadu Crime News: పాత పగల మనసులో పెట్టుకొని పదహారేళ్ల కుమారుడితో వెళ్లిన ఓ తండ్రి.. ఓ వ్యక్తిని హత్య చేశారు. ఆపై మృతదేహాన్ని 16 ముక్కలు చేసి కాల్చేశారు. ఏమీ తెలియనట్లుగా ఇంటికి వెళ్లిపోయారు. 

FOLLOW US: 
Share:

Palnadu Crime News: పాత పగలు మనసులో పెట్టుకున్న ఓ తండ్రి, తన పదహారేళ్ల కుమారుడి సాయంతో ఓ వ్యక్తిని హత్య చేశారు. ముందుగా రాడ్డుతో తలపై కొట్టి చంపేశారు. ఆపై మృతదేహాన్ని సంచిలో తీసుకొని తమ పంట పొంల వద్దకు వెళ్లారు. అక్కడే మృతదేహాన్ని 16 ముక్కలుగా నరికారు. ఆపై కట్టెలన్నీ ఓ చోట చేర్చి... ఆ ముక్కలను అందులో వేసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. హత్య చేసినప్పుడు వాళ్లు వేసుకున్న బట్టలను విడిచి ఇవ్వగా భార్యగా కాల్చి వేసే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలోపే అక్కడకు పోలీసులు వచ్చారు. నిందితులను అరెస్ట్ చేశారు. 

అసలేం జరిగిందంటే..?

పల్నాడు జిల్లా గురజాయ నియోజకవర్గం దాచేపల్లికి చెందిన 45 ఏళ్ల కోటేశ్వర రావు, బొంబోతుల సైదులు నగర పంచాయతీలో పొరుగు సేవల కింద ప్లంబర్లుగా పిన చేస్తున్నారు. విధుల్లో భాగంగా శుక్రవారం రాత్రి 8 గంటలకు విద్యుత్తు మోటారను ఆపడానికి బైపాస్ ప్రాంతంలోని వాటర్ ట్యాంక్ వద్దకు కోటేశ్వర రావు వెళ్లారు. అప్పటికే అక్కడ కాపుకాచిన సైదులు, అతడి 16 ఏళ్ల కుమారుడు కలిసి ఇనుప రాడ్లతో కోటేశ్వర రావు తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మరణించారు.  అనంతరం మృతదేహాన్ని సంచిలో వేసుకొని తమ పంట పొలం వద్దకు తీసుకు వెళ్లారు. మిర్చి పంటలో మృతదేహాన్ని ఉంచి గొడ్డలితో పైశాచికంగా నరికారు. మృతదేహాన్ని 16 ముక్కలు చేసి.. వాటిపై కర్రలు పేర్చారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంట బాగా అంటుకున్నాక ఇంటికి వెళ్లిపోయారు. 

అయితే రాత్రి పది దాటినా కోటేశ్వర రావు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, బంధువులు ఆరా తీశారు. తలోదారి వెళ్లి వెతకడం ప్రారంభించారు. అదే క్రమంలో ఎదురైన తండ్రీకుమారులను అడగ్గా.. తమకు తెలియదంటూ ఆతృతగా వారు వెళ్లిపోయారు. బంధువులు అనుమానంతో ఆ ప్రాంతమంతా కలియదిరిగారు. పొలాల్లో మంటలను చూసి అక్కడకు వెళ్లి క్షణ్ణంగా పరిశీలించారు. అయితే కాలిపోతున్న ఓ కాలు పాదాన్ని గుర్తించి.. వెంటనే పోలీసలకు సమాచారం అందించారు. మంటలను ఆర్పేసి ఆపై వెంటనే నిందితుల ఇంటికి బయలుదేరారు. నిందితులు ఇద్దరూ వస్త్రాలు మార్చుకని బయటకు వెళ్లడానికి సిద్ధం అయ్యారు. కోటేశ్వరరావు ఏమయ్యారని నిలదీయగా.. సమాధానం దాట వేశారు. హత్య చేసి ఇంటికి వచ్చిన తండ్రీకుమారుల వస్త్రాలను సైదులు భార్య కోటమ్మ కాలుస్తూ కనిపించింది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. 

తర్వాత పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. శనివారం ఉదయం గురజాల ప్రభుత్వాసుపత్రి నుంచి వైద్యులను రప్పించి ఘటనా స్థలంలోనే పంచనామా చేయించారు. ఈ ఘటనపై మధ్యాహ్నం బాధిత కుటుంబీకులు, బంధువులు ధర్నాలు చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సీఐ నచ్చజెప్పి భరోసా ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఘటన జరిగిన తీరును బట్టి చూస్తే పథకం ప్రకారమే కోటేశ్వర రావును హతమార్చారని పోలీసులు భావిస్తున్నారు. ప్రధాన నిందితుడు సైదులుపై గతంలోనూ పలు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్యకు పాత కక్షలు కారణం అని వారు భావిస్తున్నారు. వివాహేతర సంబంధం కోణంలోనూ పరిశీలిస్తు్ననారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ముగ్గురు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ షేక్ బిలాలుద్దీన్ చెప్పారు. 

Published at : 26 Feb 2023 11:39 AM (IST) Tags: AP Crime news AP Latest Murder case Palnadu Crime News Man Murdered Colleague Father And Son Kills Man

సంబంధిత కథనాలు

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Gun Fire in US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం - ఆరుగురి హత్య, నిందితుడూ మృతి

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్‌ బోల్తా పడి 20 మంది దుర్మరణం 

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం, బస్‌ బోల్తా పడి 20 మంది దుర్మరణం 

Hyderabad Crime News: హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Hyderabad Crime News:  హైదరాబాద్‌లో గుప్తనిధుల కలకలం, తొమ్మిది మంది అరెస్ట్

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

Hyderabad News : పెళ్లైన రెండేళ్లకే దారుణం- కుటుంబ కలహాలతో ట్రాన్స్ జెండర్, యువకుడు ఆత్మహత్య!

Adivasi Mahasabha: గిరిజన యువకులు, విద్యార్థుల డెత్‌ మిస్టరీ- సమగ్ర విచారణకు ఆదివాసీల డిమాండ్

Adivasi Mahasabha: గిరిజన యువకులు, విద్యార్థుల డెత్‌ మిస్టరీ- సమగ్ర విచారణకు ఆదివాసీల డిమాండ్

టాప్ స్టోరీస్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

Hyderabad Metro: హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రోకు భూసార పరీక్షలు ప్రారంభం - ఎలా చేస్తారంటే!

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన

పార్టీ మార్పుపై వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి క్లారిటీ -  అనుమానంగా ఫోన్లు పెట్టేశారని ఆవేదన