అన్వేషించండి

Travel Bus Accident: రాజమండ్రి శివార్లలో అర్ధరాత్రి ప్రైవేట్ బస్సు బోల్తా - విశాఖ యువతి మృతి, 20 మందికి గాయాలు

Andhra News: రాజమండ్రి శివారులో బుధవారం ఆర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో విశాఖ యువతి మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది.

Private Travel Bus Overturns In Rajahmundry: రాజమండ్రిలో (Rajahmundry) బుధవారం అర్ధరాత్రి ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ఘటనలో ఓ యువతి మృతి చెందగా.. 20 మందికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కావేరీ ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయాణికులతో బుధవారం విశాఖ (Visakha) నుంచి హైదరాబాద్ బయల్దేరింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత రాజమండ్రి శివార్లలో గామన్ వంతెన రహదారిపై కాతేరు - కొంతమూరు వద్ద బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విశాఖకు చెందిన మోహన కల్యాణి అనే యువతి ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలు కాగా.. వీరిని 6 అంబులెన్సుల్లో ఆస్పత్రులకు తరలించారు. వీరు విశాఖ, అన్నవరం ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది. క్షతగాత్రుల్లో 15 మందికి స్వల్పంగా గాయాలు కావడంతో ప్రథమ చికిత్స అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లిపోయినట్లు పోలీసులు తెలిపారు. మరో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్రేన్ సాయంతో రాత్రి ఒంటి గంట సమయంలో బోల్తా పడిన బస్సును తొలగించి కింద ఉన్న మరికొంతమందిని రక్షించినట్లు చెప్పారు. ఎస్పీ నరసింహ కిషోర్ ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు. మృతి చెందిన యువతి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం కోసం పరీక్ష రాసేందుకు వెళ్తున్నట్లు గుర్తించారు. డ్రైవర్ అలసత్వమే ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ప్రమాదం తర్వాత డ్రైవర్, క్లీనర్ పరారయ్యారని పేర్కొన్నారు. దీనిపై రాజమండ్రి త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Crime News: రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ - కూతురి పెళ్లి కోసం దాచిన రూ.3.50 కోట్ల నగలు దోచేశారు, అనంతపురంలో ఘటన

 

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Principal Roopa Reddy Murder Case: ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
ఆ ఒక్క పదమే ప్రిన్సిపాల్ హంతకుల్ని పట్టించింది- రూపారెడ్డి హత్య కేసులో షాకింగ్ విషయాలు
Nidhhi Agerwal Betting App Case: ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ విచారణకు హాజరైన నటి నిధి అగర్వాల్
Vizag Airport Workers: న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటాం: విశాఖ ఎయిర్‌పోర్టు మహిళా కార్మికుల ఆవేదన
Konda Politics: పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
పరకాలలో పోటీ చేసేది నేనే.. నాకు కౌంటర్ ఇస్తే రేవంత్ రెడ్డి భాగోతాలు బయటపెడతా: కొండా సుస్మిత
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
రూ.50 వేల డౌన్ పేమెంట్‌పై Maruti Suzuki Baleno కొంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి ?
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
Rajinikanth Vs Ram Pothineni: రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
రజనీకాంత్ అల్లుడిగా రామ్ పోతినేని... 'ధర్మన్'లో విలన్‌గా
Embed widget