NTR District Crime : బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధిస్తున్న వార్డ్ వాలంటీర్ భర్త!
NTR District Crime : ఎన్టీఆర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. బాలిక స్నానం చేస్తుండగా వార్డు వాలంటీర్ భర్త వీడియోలు తీశారు. ఆ వీడియోలు ఇంటర్నెట్ లో పెడతానని బాలికను లైంగికంగా వేధించాడు.
NTR District Crime : ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వార్డు వాలంటీర్ భర్త బాలికను లైంగికంగా వేధిస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసిన వార్డ్ వాలంటీర్ భర్త వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో బాలిక తల్లిదండ్రులు తిరువూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. తనను లైంగికంగా వేధించిన వాలంటీర్ భర్తకు కఠిన శిక్ష విధించాలని బాలిక డిమాండ్ చేస్తుంది. ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఝార్ఖండ్ లో దారుణం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చిన మహిళలు, ఆడపిల్లలపై లైంగిక వేధింపులు ఆగడం లేదు. పసిబిడ్డ నుంచి ముసలివాళ్ల వరకు కామాంధులు కళ్లు మూసుకుపోయి వేధిస్తున్నారు. ఝార్ఖండ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ ఘటన ఖుంటి జిల్లాలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. మైనర్ల వయసు 10 నుంచి 15 ఏళ్ల మధ్య ఉంటుందని స్థానిక పోలీసులు తెలిపారు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Also Read : Tirupati News : తిరుపతిలో విషాదం, మార్కులు తక్కువొచ్చాయని విద్యార్థిని ఆత్మహత్య!
Also Read : Palnadu District: అందరూ చూస్తుండగా పట్టపగలే కిడ్నాప్, మరుసటిరోజు ఉదయం శవమై కనిపించిన ఎగ్జిక్యూటివ్ !
బాలికపై ఆరుగురు మైనర్లు అత్యాచారం
ఈ ఘటనపై మీడియాకు పోలీసులు వివరాలు తెలిపారు. బాలిక పెళ్లికి హాజరయ్యేందుకు పక్క గ్రామానికి వెళ్లిందని, అక్కడ తెలిసిన అబ్బాయిలతో ఒక విషయంలో గొడవ జరిగింది. అర్ధరాత్రి సమయంలో తన స్నేహితులతో ఇంటికి తిరిగి వస్తుండగా వాళ్లు బాలికను వెంబడించారు. బాలికను అడ్డగించి, ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన స్థలం నుంచి తప్పించుకున్న బాలిక ఇద్దరు స్నేహితులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రులు బాలిక కోసం వెతుకుతూ రావడంతో వారిని చూసి మైనర్లు అక్కడి నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు.
Also Read : Palnadu Crime : తమ్ముడి కోసం హత్య, నరసరావుపేట కిడ్నాప్ కేసులో షాకింగ్ విషయాలు