By: ABP Desam | Updated at : 25 Apr 2022 10:00 AM (IST)
విజయవాడలో కుటుంబం ఆత్మహత్యాయత్నం
A Family Suicide Attempt at Lodge Near Vijayawada Busstand: ఇటీవల తెలంగాణలోని కామారెడ్డిలో లాడ్జీలో ఓ తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఏపీలోనూ కొన్ని రోజుల కిందట ఓ కుటుంబం విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చి, అనంతరం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. తాజాగా ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో ఓ కుటుంబం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వీరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం..
పోలీసుల కథనం ప్రకారం.. జూపూడి వెంకటేశ్వరరావు స్వస్థలం మచిలీపట్నం. ఆయనకు అతని భార్య రాధారాణి, కుమార్తెలు భావన, శ్రావణి ఉన్నారు. ఈ కుటుంబం ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలలో చిక్కుకుంది. అప్పులు తీర్చాలని బాకీ ఇచ్చిన వారు పదే పదే అడుగుతున్నారు. ఏం చేయాలో తోచక గతనెల ఎనిమిదో తేదీన వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు విజయవాడకు వచ్చారు. ఆర్టీసీ బస్టాండు అవుట్‌గేట్ సమీపంలోని బాలాజీ లాడ్జీలో ఉంటున్నారు. ఈ క్రమంలో వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులు మొత్తం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం (Family Suicide Attempt) చేశారు.
సకాలంలో స్పందించిన కృష్ణలంక పోలీసులు..
ఆత్మహత్యాయత్నానికి ముందు తమ కుటుంబ సభ్యుల్లో ఒకరికి మెస్సేజ్ చేశారు. తాము సూసైడ్ చేసుకుని చనిపోతున్నామని చెప్పగా.. వారు వెంటనే కృష్ణలంక పోలీసులకు (Krishna Lanka Police) సమాచారం అందించారు. హుటాహుటీన లాడ్జీకి చేరుకున్న పోలీసులు వెంకటేశ్వరరావు కుటుంబసభ్యులతో ఉప్పునీరు తాగించి విషాన్ని బయటకు కక్కించే ప్రయత్నం చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Hyderabad: మగవారికి మహిళలతో బాడీ మసాజ్! స్పా సెంటర్ పై ఆకస్మిక దాడులు
Also Read: NTR District Crime : బాలిక స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధిస్తున్న వార్డ్ వాలంటీర్ భర్త!
Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం
Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు
Nalgonda Accident : నల్గొండ జిల్లాలో ఘోర ప్రమాదం, రథానికి విద్యుత్ వైర్లు తగిలి ముగ్గురు మృతి
Tamilnadu News : అప్పుల భారంతో భార్య, బిడ్డలను హత్య చేసిన వ్యాపారి, ఆ పై ఆత్మహత్య!
Rgv Complaint : నా సంతకం ఫోర్జరీ చేశారు, నట్టి ఎంటర్టైన్మెంట్ పై ఆర్జీవీ పోలీస్ కేసు
Mahanadu Chandrababu : నేను వస్తా.. దోచినదంతా కక్కిస్తా - మహానాడులో చంద్రబాబు హెచ్చరిక !
Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?
Boy Smoking: KGF 2 రాకీ భాయ్లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్
Vizag Yarada Beach: మూడు రంగుల్లో ఎంతో ఆహ్లాదకరంగా యారాడ బీచ్ - వీడియో ట్వీట్ చేసిన ఎంపీ పరిమళ్ నత్వానీ