Digital Rape Case : డిజిటల్ రేప్ కేసులో 81 ఏళ్ల వ్యక్తి అరెస్ట్ ! అసలేంటి ఈ డిజిటల్ రేప్ ?
విద్యార్థినిపై డిజిటల్ రేప్‌కు పాల్పడిన వృద్ధుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు డిజిటల్ రేప్ అంటే ?
డిజిటల్ రేప్ ల ( Digital Rape ) కేసు కింద 81 ఏళ్ల వృద్ధుడిని నోయిడా ( Noida ) పోలీసులు అరెస్ట్ చేశారు. వృత్తి రిత్యా పెయింటింగ్ ఆర్టిస్ట్, టీచర్ ( Teacher ) మౌరైస్ రైడర్ ఈ దారుణానికి పాలడ్డారు. నిందితుడికి హిమాచల్ ప్రదేశ్ ( Himachal Pradesh ) లో ఓ ఆఫీస్ కూడా ఉంది. అతని దగ్గర పనిచేసే వ్యక్తి ఒకరు చదువు చెబుతాడని తన కుమార్తెను నిందితుడి వద్దకు పంపారు. పాఠాలు చెబుతున్నట్లుగా నటిస్తూ.. తన వికృతాన్ని బయట పెట్టాడు. అమ్మాయిపై డిజిటల్ రేప్ ప్రారంభించాడు.
బెజవాడ డ్రగ్స్ కథ ఎక్కడ తేలబోతోంది ? అరుణాచలం గుట్టు బయట పెట్టేశాడా ?
అప్పట్నుంచి ఆ అమ్మాయిపై నిందితుడు డిజిటల్ రేప్‌కి పాల్పడుతూనే ఉన్నాడు. ఏడేళ్ల పాటు ఇలా ఆ బాలికను వేధించాడు. తొలుత ఆ అమ్మాయి బాగా భయపడి ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత ఆడియో ఫైల్స్ లాంటి అనేక ఆధారాలను కలెక్ట్ చేసి, ఓ మహిళ సాయంతో ఫిర్యాదు చేసింది . బాధితురాలిపై డిజిటల్ రేప్ కు పాల్పడ్డ నిందితుడిని అరెస్ట్ చేశారు.
ఏపీలో మరో పోలీసు సూసైడ్, ఎచ్చెర్లలో ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య!
డిజిటల్ రేప్ అంటే ( What is Digital Rape ) సాంకేతిక పదం కాదు. ఆన్ లైన్ వేధింపు కూడా కాదు. చాలామంది ఆన్‌లైన్ ( Online Crime ) సంబంధిత నేరం అనుకుంటారు. నిర్భయ ఘటన తర్వాత ఈ చట్టానికి అనేక మార్పులు తీసుకొచ్చారు. అప్పుడే డిజిటల్ రేప్ కు కొత్త అర్థం తెచ్చారు. మర్మాంగం కాకుండా ఏదేని వస్తువు, ఆయుధాలను, చేతి వేళ్లను ఉపయోగించి అసహజరీతిలో లైంగిక దాడులకు పాల్పడడాన్ని డిజిటల్ రేప్ అంటారు. ఇంగ్లీష్ డిక్షనరీలో డిజిటల్ అనే పదానికి అర్థంతో ఈ నేరానికి ఆ పేరొచ్చింది.
భోజనం లేదన్నారని హోటల్ పై దాడి, వీడియో షేర్ చేసిన చంద్రబాబు
గతంలో ఇలాంటి నేరాలు అత్యాచారం కిందకు వచ్చేది కాదు. కానీ, 2012 నిర్భయ ( Nirbhaya ) ఘటన తర్వాత డిజిటల్ రేప్‌ను అమలులోకి తీసుకొచ్చారు. డిజిటల్ రేప్ కింద.. ఒక వ్యక్తికి కనీసం ఐదేళ్లు, గరిష్టంగా పదేళ్లు.. ఒక్కోసారి జీవిత ఖైదు విధిస్తారు. ఈ తరహా ఘటనల్లో 70 శాతం దగ్గరి వాళ్ల వల్లనే జరుగుతున్నాయి. కాబట్టే.. చాలా చాలా తక్కువ కేసులు నమోదు అవుతున్నాయి.