News
News
X

Nizamabad Bank Robbery : బ్యాంకులో జులాయి సినిమా సీన్ రిపీట్, రూ.3 కోట్ల సొమ్ము చోరీ!

Nizamabad Bank Robbery : నిజామాబాద్ జిల్లా బుస్సాపూర్ లో భారీ చోరీ జరిగింది. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ లాకర్ ను గ్యాస్ కట్టర్ తో కట్ చేసి నగదు, బంగారం ఎత్తుకెళ్లారు దొంగలు.

FOLLOW US: 

Nizamabad Bank Robbery : నిజామాబాద్ జిల్లాలో బ్యాంకును దోచేశారు దుండగులు. సినీ ఫక్కీలో చోరీ చేశారు. ఆ చోరీ జరిగిన విధానం చూస్తే సినిమాల్లో చూపించిన విధంగానే ఉందంటున్నారు. జిల్లాలోని మెండోర మండలం బుస్సాపూర్ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు షట్టర్లను రాడ్లతో లేపి లోపలికి ప్రవేశించారు. బ్యాంకులో ఉన్న స్ట్రాంగ్ రూమును గ్యాస్ కట్టర్లతో కోసి లోపలికి ప్రవేశించారు. లాకర్లలో ఉన్న రూ.7.30 లక్షల నగదు, 3 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు. 

అలారం సెన్సార్ ధ్వంసం చేసి

సోమవారం ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి బ్యాంక్ షట్టర్లు తెరిచి ఉన్నట్టు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో వేలిముద్రలు సేకరించారు. ఈ దొంగతనం శనివారం రాత్రి జరిగిందా లేక ఆదివారం రాత్రి జరిగిందా అన్న  కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగలు ముఠానే ఈ దొంగతనానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. బ్యాంకులోని అలారం సెన్సార్ ను ధ్వంసం చేసి చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. దొంగతనం చేసిన అనంతరం సీసీ కెమెరాకు సంబంధించిన డిజిటల్ వీడియో రికార్డు(డీవీఆర్)ను సైతం దొంగలు ఎత్తుకెళ్లారు. 

ఇటీవల కాలంలో భారీ చోరీ

ఘటనా స్థలాన్ని నిజామబాద్ పోలీస్ కమిషనర్ కె.ఆర్. నాగరాజు, ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్, ఇతర అధికారులు, సిబ్బంది పరిశీలించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇటీవల కాలంలో బ్యాంకులలో ఇంత పెద్దచోరీ జరగడం ఇదే మొదటిసారి. బ్యాంకులో చోరీకి పాల్పడిన ముఠా కోసం పోలీస్ శాఖ ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసి గాలింపు చర్యలను చేపట్టింది. మరోవైపు బ్యాంకులో డబ్బులు ఉన్న ఒక లాకర్ ను మాత్రమే పగులగొట్టారు. మరో లాకర్ లో రైతు బంధుకు చెందిన డబ్బులు ఉన్నట్లు తెలుస్తోంది. 

స్కూల్ లో చోరీ 

బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ సినిమా 'ధూమ్' చూశారా? ఇదేం ప్రశ్న.. అనుకుంటున్నారా? అయితే ఆ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ఉంటాయో కొత్తగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా దొంగతనం చేసి తప్పించుకునే సన్నివేశాలు ఎన్ని సార్లు చూసినా మాంచి కిక్కిస్తాయి. అయితే ఆ సినిమా చూసి ఇన్‌స్పైర్‌ అయిన కొందరు దొంగలు తాజాగా ఓ షాకిచ్చారు. ఒడిశాలోని నవరంగ్‌పుర్‌లో కొంతమంది దొంగలు ఓ స్కూల్‌లో చొరబడి కంప్యూటర్లు, ప్రింటర్లు ఎత్తుకుపోయారు. అయితే అంతటితో ఆగని దొంగలు చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్‌ విసిరారు. కొన్ని ఫోన్‌ నంబర్లు కూడా బోర్డుపై రాసివెళ్లారు.

ధూమ్ 4 వస్తుందని రాసిన దొంగలు

ప్రధానోపాధ్యాయుడి గదిలో ఉన్న కంప్యూటర్లు, జెరాక్స్‌ మెషిన్లు, ప్రింటర్లు ఇలా కొన్ని వస్తువులు ఎత్తుకుపోయిన దొంగలు 'ధూమ్‌ 4' తొందర్లో వస్తుందని రాసివెళ్లారు. పూరీ జగన్నాథుని రథయాత్ర సందర్భంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ఇచ్చింది. శనివారం ఉదయం స్కూల్‌కి వచ్చిన ప్యూన్‌.. హెడ్‌మాస్టర్‌ రూమ్‌ డోర్‌ తెరిచి ఉండటాన్ని గమనించాడు. అందులో వస్తువులు మాయమైపోవడాన్ని గుర్తించి యాజమాన్యానికి తెలిపాడు. దీంతో స్కూల్‌ హెచ్‌ఎం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

కేసు నమోదు చేసుకున్న ఖతీగూడ పోలీసులు సైంటిఫిక్ టీమ్, డాగ్​ స్క్వాడ్​ సహాయంతో దర్యాప్తు చేపడుతున్నారు. గతంలో నందహండి బ్లాక్‌లోని దహన్‌ స్కూల్‌ ఆఫీసు రూమ్​లో ఉన్న కంప్యూటర్లను దొంగలు దోచుకెళ్లారు. ఆ తర్వాత బ్లాక్‌బోర్డ్‌పై కొన్ని మొబైల్ నంబర్లు కూడా రాశారు. వాటిలో ఆ పాఠశాలలోనే విధులు నిర్వర్తిస్తున్న ఉపాధ్యాయుడి ఫోన్​ నెంబర్​ కూడా ఉంది. సినీఫక్కీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Published at : 04 Jul 2022 07:18 PM (IST) Tags: Crime News Nizamabad news Bank robbery telangana grameen bank three crore theft

సంబంధిత కథనాలు

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Mancherial News :  ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?

Ranveer Deepika's New House : కొత్తింట్లో అడుగుపెట్టిన ర‌ణ్‌వీర్ - దీపిక దంపతులు, ఎంత పద్దతిగా పూజలు చేశారో చూశారా?