అన్వేషించండి

Nizamabad News : మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ బాయ్ ఆత్మహత్య, చివరిగా ఓ మహిళకు మెసేజ్!

Nizamabad News : మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

Nizamabad News : తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆఫీస్‌ బాయ్‌గా పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆఫీస్ బాయ్ దేవేందర్‌ (19) ఆదివారం సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌లోని మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆఫీస్ లోని ఓ గదిలో యువకుడు ఉరివేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని సమీప ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యలోనే చనిపోయాడని వైద్యులు తెలిపారు. ఈ ఘటన సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ ఘటనపై ఆర్మూర్‌ ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ మృతిచెందిన యువకుడు ఓ మహిళతో సన్నిహితంగా ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసిందన్నారు. ఆత్మహత్యకు ముందు తాను చనిపోతున్నట్లు ఆమెకు మెసేజ్ పంపించినట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నామన్నారు.

వారం రోజులుగా రిప్ స్టేటస్ 

మంత్రి ప్రశాంత్ రెడ్డి  ఆఫీస్ బాయ్ దేవేందర్ ఆత్మహత్యపై ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు ఆసక్తికర కామెంట్స్ చేశారు. యువకుడు వ్యక్తిగత కారణాల వల్లే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.  దేవేందర్ సెల్ ఫోన్ పరిశీలిస్తే గత కొద్ది కాలంగా అతడు ఓ మహిళ తో ప్రేమలో ఉన్నాడని తెలుస్తోందన్నారు. ఆ మహిళతో శనివారం రాత్రి 12 గంటల వరకూ వాట్సాప్ ఛాటింగ్ చేశాడన్నారు.  వారం రోజులుగా దేవేందర్ వాట్సాప్ స్టేటస్ రిప్ అని పెట్టుకున్నాడని, శనివారం రాత్రి నేను వెళ్తున్నా ప్రశాంతంగా ఉండూ అని ఆమెతో ఛాట్ చేయడంతో  ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని ప్రాథమిక విచారణలో తేలిందన్నారు.  మృతుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో పని చేస్తున్నాడని తెలిపారు. మరిన్ని వివరాలు విచారణలో తెలుస్తాయని ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు  వెల్లడించారు. 

పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళ ఆత్మహత్యాయత్నం! 

 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాదం జరిగింది. అమలాపురం డివిజన్ రాజోలు మండలం రాజోలు సర్కిల్ పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేశవదాసు పాలేనికి చెందిన యర్రంశెట్టి విజయ లక్ష్మి(36).. పీఎశ్ ఆవరణలోనే పెట్రోలు పోసుకుని నిప్పు అంటించుకుని ఆత్మహత్యాయత్నం చేయడం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 15 నిమిషాల పాటు మంటలతో ఆర్తనాదాలు చేస్తున్న ఆమెను స్థానికులు కాపాడే ప్రయత్నం చేశారు. ఇసుక, దుప్పట్లు వంటి వాటిని ఆమెపైకి విసిరారు.  స్థానికంగా ఉన్న హెల్త్ సిబ్బంది కూడా అక్కడకు చేరుకొని ప్రాథమిక చికిత్స చేసే ప్రయత్నం చేసింది. వెంటనే సమీపంలో ఉన్న ప్రభుత్వాసుపత్రికి చెక్కపై ఉంచి భుజాలపై మోసుకుని తీసుకెళ్లారు. ఆమె శరీరం 80 శాతం పైగా కాలిపోగా మెరుగైన చికిత్స నిమిత్తం కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అయితే ఆమె కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

యూట్యూబ్ ఛానల్ కు పనిచేస్తూ 

విజయలక్ష్మి ఓ యూట్యూబ్ న్యూస్ ఛానల్లో విలేకరిగా పనిచేస్తుంది. ఆమె భర్త ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నారు. ఆమె కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతోంది. అప్పు ఇచ్చినవారు మలికిపురం మండలంలో తన అమ్మ ఇంటి వద్ద ఉన్న భూమిని స్వాధీనం చేసుకోవడంతో పెద్దల సమక్షంలో మంతనాలు జరిగాయి. ఆమె శుక్రవారం రాజోలు సీఐకు ఫిర్యాదు చేయడానికి ఆమె ద్విచక్ర వాహనంపై వచ్చింది. ముందుగానే లీటర్ పెట్రోలు బాటిల్ వెంట తెచ్చుకున్న ఆమె స్థానికంగా కానిస్టేబుల్ ను సీఐని కలవాలని అడిగింది. అయితే సోమవారం వస్తారని చెప్పడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్ ఒంటిపై పోసుకుని నిప్పు పెట్టుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read : Nellore Murders: హోటల్ ఓనర్ దంపతుల దారుణ హత్య, ఇంట్లోనే గొంతుకోసి మరీ - బంగారం అంతా అక్కడే కానీ

Also Read : Car Drowned in Brook: ఆసుపత్రికి వెళ్లి వస్తుండగా విషాదం, వాగులో కారు కొట్టుకుపోయి యువతి మృతి

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సచ్చిపోదామని యాసిడ్ తాగినా!! ఇతని స్టోరీకి కన్నీళ్లు ఆగవు!బై నాన్నా.. వెక్కివెక్కి ఏడ్చిన నారా రోహిత్Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
EVs Registration Fee: తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ - ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు
Andhra News: ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
ఏపీలో తీవ్ర విషాదాలు - సెల్‌ఫోన్‌లో ఆడుతూ సాంబారులో పడి బాలుడు మృతి, రోడ్డు ప్రమాదంలో ముగ్గురు బాలురు మృతి
Devi Sri Prasad: ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
ప్రతి ఫ్రేమ్‌లో వినిపించింది నేనే - ట్రైలర్ లాంచ్ అయ్యాక దేవిశ్రీ ట్వీట్!
Jio New Plan: ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
ఒక్క రీఛార్జ్‌తో 98 రోజుల వ్యాలిడిటీ, 196 జీబీ డేటా - జియో సూపర్ ప్లాన్ ఇదే!
Group 3 Exams: భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
భార్యకు పరీక్ష, భర్తకు బాధ్యత - గ్రూప్ 3 పరీక్షా కేంద్రాల వద్ద వైరల్ 'సిత్రాలు'
Pushpa 2 Trailer: మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
మాసు డోసు పెరిగింది బాసూ - ‘పుష్ప 2’ ట్రైలర్ రిలీజ్ - సినిమా ఈ రేంజ్ అయితే ‘బాహుబలి 2’ అవుట్!
Lagacherla News: వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
వచ్చేది ఫార్మా ఇండస్ట్రీ కాదు, ఇండస్ట్రియల్ అండ్‌ టెక్స్‌టైల్ పార్కు- లగచర్ల వివాదంలో భారీ ట్విస్ట్
Nara Rammurthy Naidu: సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
సోదరుని పాడె మోసిన సీఎం చంద్రబాబు - అధికారిక లాంఛనాలతో రామ్మూర్తినాయుడు అంత్యక్రియలు పూర్తి
Embed widget