Nizamabad: భార్యను వదిలించునేందుకు భర్త అరాచకం.. రోజూ ఆమెపై అదే పని, ఏం చేశాడో తెలిస్తే షాక్!
స్కిన్ ఎలర్జీ కోసం అందుకు ట్రీట్ మెంట్ పేరుతో భార్య నరాలకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్‌ను ఇచ్చాడు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యాభర్తల కాపురంతో మనస్పర్థలు రావడంతో కట్టుకున్న భార్యను వదిలించుకోవడానికి ఆ భర్త నిజానికి పాల్పడ్డాడు. భార్య నరాల్లోకి స్టెరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఆమెను అడ్డు తొలగించుకొనేందుకు యత్నించాడు. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు, స్థానికులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో తాను కట్టుకున్న భార్యను వదిలించుకోవడానికి ఓ భర్త అరాచకానికి పాల్పడ్డాడు. ఏకంగా స్కిన్ ఎలర్జీ కోసం అందుకు ట్రీట్ మెంట్ పేరుతో భార్య నరాలకు స్టెరాయిడ్స్ ఇంజెక్షన్‌ను ఇచ్చాడు. భార్యపై భర్త గంగాసాగర్ ఈ పైశాచికత్వానికి పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన భార్య ఆసుపత్రిలో చూపించుకోగా చంపడానికి ఆ ఇంజక్షన్ ఇస్తున్నట్లుగా తేలింది. ఈ విషయాన్ని ఆస్పత్రిలోని డాక్టర్లే భార్యకు చెప్పారు. దీంతో ఆమె కంగుతిన్నది.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో స్రవంతి, గంగా సాగర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరిద్దరికీ 2017వ సంవత్సరంలో పెళ్లి జరిగింది. అనంతరం వీరికి బాబు పుట్టగా.. అతనికి ప్రస్తుతం నాలుగు సంవత్సరాలు. గంగా సాగర్ ఆర్మూర్‌లోనే ఒక ప్రైవేటు ఆసుపత్రిలో కాంపౌండర్ గా పని చేస్తున్నాడు. అక్కడ ఆ పని చేస్తూనే నకిలీ ఆర్ఎంపీగా మరో చోట క్లినిక్ పెట్టుకుని నడుపుతున్నాడు.
Also Read: Nellore: లేడీ కానిస్టేబుల్స్‌కి యూనిఫాం కొలతలు పురుషులతో..! వివాదాస్పదంగా పోలీసుల తీరు
ఇదిలా ఉండగా.. ఇటీవల 25 ఏళ్ల వయసులోనే గంగా సాగర్ భార్య స్రవంతి నరాల బలహీనతకు గురైంది. ఒంట్లో బాగా లేకపోవడంతో ఆమె ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేసింది. రక్త పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు చేసిన వైద్యులకు రిపోర్టులో దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. ఆమె రక్తంలో స్టెరాయిడ్స్ కి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించారు. దీంతో విషయం స్రవంతికి చెప్పగా.. ఆమెకు తన భర్తపై అనుమానం వచ్చింది. తన భర్తే ఇంజెక్షన్ల రూపంలో తనకు ఓ మెడిసిన్ ఇస్తున్నాడని చెప్పింది. ఆ మందుకు సంబంధించిన వివరాలను డాక్టర్లకు తెలియజేసింది. దీంతో అసలు విషయం బయటికి వచ్చింది.
వెంటనే ఈ విషయం గురించి బాధితురాలు స్రవంతి ఆర్మూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అయినా పోలీసులు తన గోడు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌కు వచ్చింది. ఈ విషయంలో తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ బాధితులు కలెక్టరేట్ కు విన్నవించుకుంది.