అన్వేషించండి

Basara Temple Theft Case: బాసర ఆలయంలో చోరీ చేసిన దొంగ పట్టివేత - వెండి కిరిటం రికవరీ - పోలీస్ ఆపరేషన్ సాగింది ఇలా !

Basara Temple Theft : బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగిన సంచలన దొంగతనం కేసును నిర్మల్ జిల్లా పోలీసులు కేవలం 10 రోజుల్లోనే ఛేదించారు. నిందితులను అరెస్ట్ చేసి వెండి కిరీటం స్వాధీనం చేసుకున్నారు.

Basara Gnana Saraswati Temple Silver Crown Recovered:  తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిర్మల్ జిల్లా బాసర  జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో జరిగిన సంచలన దొంగతనం కేసును జిల్లా పోలీసులు అత్యంత చాకచక్యంగా, వేగవంతంగా ఛేదించారు. కేవలం 10 రోజుల్లోనే ఈ కేసును క్లోజ్ చేసి, భక్తులలో ఉన్న ఆందోళనను దూరం చేశారు. ఈ కేసులో ఇద్దరు మోస్ట్ వాంటెడ్ అంతర్‌జిల్లా దొంగలతో పాటు, దొంగిలించిన సొత్తును దాచిపెట్టిన మరో రిసీవర్‌ను పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. వారి నుంచి దొంగిలించిన అమ్మవారి వెండి కిరీటంతో పాటు సుమారు 1.48 కిలోల వెండి సొత్తును రికవరీ చేసినట్లు నిర్మల్ జిల్లా పోలీస్ యంత్రాంగం అధికారిక పత్రికా ప్రకటనలో వెల్లడించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల జూన్ 22వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణలు ఆలయ గోడదూకి లోపలికి చొరబడ్డారు. గర్భాలయ గేటు తాళాలు పగులగొట్టి అమ్మవారి వెండి కిరీటం, హుండీని దొంగిలించారు. అనంతరం హుండీలోని సుమారు రూ.16,000 నగదును తీసుకుని, వెండి కిరీటాన్ని రెండు భాగాలుగా విడదీశారు. ఎవరికీ అనుమానం రాకుండా ఆలయం వెనుక వైపు ఉన్న వ్యాస గుహ గుట్టల పైనుంచి పరారై, మరుసటి రోజు ఉదయం సామాన్య భక్తుల వలె రైల్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడ నుంచి పారిపోయారు.
 
దొంగిలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నిజామాబాద్‌కు చెందిన కోడామ ఆనంద్ అనే వ్యక్తి సహాయంతో మహారాష్ట్రలోని నాందేడ్‌కు తరలిస్తుండగా పోలీసులు పక్కా స్కెచ్ వేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు కాచిగూడ–నాగర్సోల్ రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురు నిందితులను బాసర రైల్వే స్టేషన్ వద్ద సీసీఎస్, లోకల్ పోలీసులు ఉమ్మడిగా దాడి చేసి గురువారం అదుపులోకి తీసుకున్నారు.
  
ఈ నిందితుల హిస్టరీని పరిశీలిస్తే వీరు వృత్తిపరమైన ప్రమాదకర దొంగలుగా తేలింది. రైల్వే రవాణా సౌకర్యం సులభంగా ఉన్న ప్రాంతాల్లోని దేవాలయాలనే వీరు టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎ1 నిందితుడు పల్లపు ఏడుకొండలుపై గతంలో వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 25 దొంగతనం కేసులు ఉండగా, ఎ2 నిందితుడు గైని కిరణ్‌పై 20 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దొంగిలించిన వెండిని కొనుగోలు చేసేందుకు అంగీకరించి, సహాయం చేసినందుకు మహారాష్ట్ర సోలాపూర్‌కు చెందిన కోడామ ఆనంద్‌ను కూడా పోలీసులు మూడో నిందితుడిగా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 1 కిలో 220 గ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టీతో పాటు ఒక స్మార్ట్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

నేరం జరిగిన వెంటనే అలర్ట్ అయిన నిర్మల్ జిల్లా పోలీసులు.. దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఆరు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు.   ఆలయాల భద్రత విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేస్తూ, ప్రతిభ కనబరిచిన అధికారులకు, కానిస్టేబుళ్లకు ఎస్పీ రివార్డులను ప్రకటించారు. 


 

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Hyderabad Crime: 'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!
'దిశ' ఘటన ప్రదేశంలో మరో దారుణం.. మహిళపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం!
Crime News: ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
ఇబ్రహీంపట్నంలో వీడిన మహిళ దారుణ హత్య మిస్టరీ.. వివాహితను హత్య చేసింది ప్రియుడే!
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Hyderabad ORR Accident: ఔటర్ పై రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి.. టైర్ పేలడంతో పల్టీలు కొట్టిన ఆటో
Advertisement

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Essar Group US Investment : అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
అమెరికాలో ఎస్సార్ గ్రూప్ భారీ పెట్టుబడి.. అయోవాలో రూ.1.4 లక్షల కోట్ల ఉక్కు కర్మాగారం
Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
Neeru Dhanda Clinches Shooting Gold: వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
వానలోనూ గురి తప్పని షాట్ తో నీరు ధాండా ఖాతాలో  పసిడి, వ్య‌క్తిగ‌త విభాగంలో ఇండియాకు మొట్ట‌మొద‌టి స్వర్ణం అందించి రికార్డు.. బాక్సింగ్‌లో పంచ్ పవర్ తో జోరు
Hepatitis B vs C : హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
హెపటైటిస్ బి vs హెపటైటిస్ సి.. రెండింటి మధ్య తేడాలేంటి? లక్షణాలు, వ్యాప్తి, చికిత్సలు ఇవే
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
కుర్రాళ్ల బైక్‌ Triumph Tracker 400ను కేవలం రూ.30,000 డౌన్‌పేమెంట్‌తోనే సొంతం చేసుకోండి!
యూత్‌ఫుల్‌ బైక్‌ Triumph Tracker 400ను కొనడానికి లోన్‌ ఇస్తున్నారు.. డౌన్‌పేమెంట్‌, EMI డిటైల్స్‌
Embed widget