అన్వేషించండి

Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

Basara Latest news: వసంత పంచమి సందర్భంగా బాసరలో వేడుకలు ఘనంగా నిర్వహించారు తమ బిడ్డలకు అక్షరాభ్యాసం చేయించేందుకు భక్తులు బారులు తీరారు.

Basara Latest news: నిర్మల్ జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర క్షేత్రానికి వసంతపంచమి శోభ సంతరించుకుంది. జ్ఞానసరస్వతి అమ్మవారి ఆలయానికి వేకువజామున నుంచే భక్తులు పోటెత్తారు. గోదావరిలో పుణ్య స్నానాలను ఆచరించి అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి చేరుకుంటున్నారు. అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్‌లలో అధిక సంఖ్యలో భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అమ్మవారి దర్శనం కోసం నాలుగు గంటల సమయం పడుతుంది. 


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

అమ్మవారి పుట్టినరోజు సందర్భంగా వేకువజామున నుంచే అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. సాయంత్రం అమ్మవారికి వంద వీణలతో కచ్చపీ అష్టోత్తర శతవీణానాద నీరాజనాన్ని అందించనున్నారు. వసంతపంచమి రోజు అక్షరాభ్యాసానికి అత్యంత శుభదినం కావడంతో తమ చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. 


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

వేకువ జామున మూడు గంటల నుంచే అక్షరాభ్యాస మండపాలు ప్రారంభమయ్యాయి. భక్తుల రద్దీ దృష్ట్యా మూడు అక్షరాభ్యాస మండపాలను ఏర్పాటు చేశారు అధికారులు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు.  క్యూ లైన్ లలో వేచి ఉన్న భక్తుల కోసం నీరు, పాలు, బిస్కెట్ లు అందిస్తున్నారు.  


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

అమ్మవారిని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. శాస్త్రోత్తరంగా అమ్మవారికి ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు అందించారు. 


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

అనంతరం ఆమె మాట్లాడుతూ, ఎంతో ప్రఖ్యాతి చెందిన బాసర ఆలయానికి దర్శనానికి రావడం సంతోషకరమైన విషయమని అన్నారు. ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తుందని తెలిపారు. వసంత పంచమి పర్వదినానికి సంబంధించి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని వసతులు కల్పించామని పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు పటిష్ట ఏర్పాటు చేస్తామని వివరించారు. 200 కోట్ల రూపాయల నిధులతో, బాసర అభివృద్ధికై మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు వివరించారు. బాసర దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు.


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 
 
ఈ వేడుకల్లో భాగంగా జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి ముందు, కలెక్టర్ తన కుమార్తెకు ఆలయ మండపంలో శాస్త్రోక్తంగా అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు.


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

దర్శనం అనంతరం కలెక్టర్ ఆలయ క్యూలైన్లను పరిశీలించారు. క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులతో నేరుగా మాట్లాడి, దర్శన ఏర్పాట్లపై ఆరా తీశారు. ముఖ్యంగా చిన్న పిల్లలతో వచ్చే భక్తులకు పాలు, తాగునీరు సక్రమంగా అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

కలెక్టర్ మాట్లాడుతూ, వసంత పంచమి పర్వదినం సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేశామని, భక్తులు ప్రశాంత వాతావరణంలో అమ్మవారిని దర్శించుకుని వెళ్లేలా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు.


Basara Latest news: బాసర సరస్వతి ఆలయంలో వసంత పంచమి వేడుకలు- చిన్నారులతో అక్షరాలు దిద్దించేందుకు బారులు 

టాప్ హెడ్ లైన్స్

Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Adilabad Bike Theft Gang: ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్
ఆదిలాబాద్‌లో బైక్ కనిపిస్తే మాయం.. పార్ట్స్ చేసి అమ్మేస్తున్న గ్యాంగ్ అరెస్ట్: ఎస్పీ అఖిల్ మహాజన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget