అన్వేషించండి

Nellore Car Fire: కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు... అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం

నెల్లూరు జిల్లా కంటేపల్లి రైల్వే గేట్ వద్ద పొలాల్లో అనుమానాస్పద రీతిలో కారు మంటలకు ఆహుతైంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న వ్యక్తి సజీవదహనం అయ్యారు.

నెల్లూరు జిల్లాలో సంచలనం ఘటన జరిగింది. వెంకటాచలం మండలం కంటేపల్లి రైల్వే గేట్ సమీపంలోని పొలాల్లో ఓ కారు తగలబడింది. కారుతోపాటు డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి సజీవ దహనం అయ్యాడు. పొలాల్లో మంటలు రావడంతో అటుగా వెళ్తున్నవారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేలోగా కారు పూర్తిగా దగ్ధమైంది. కారులో ఉన్న వ్యక్తి ఆనవాళ్లు లేకుండా కాలిపోయాడు. Nellore Car Fire: కంటేపల్లి రైల్వే గేట్ వద్ద కారులో మంటలు... అనుమానాస్పదరీతిలో వ్యక్తి సజీవదహనం

Also Read: ఎనీ డెస్క్ యాప్ తో మనీ గల్లంతు... కడప వాసి అకౌంట్ హ్యాక్ చేసి రూ.లక్షలు స్వాహా... బిహార్ లో సైబర్ కేటుగాడు అరెస్టు

అసలేం జరిగింది..?

కంటేపల్లి ప్రాంతం పూర్తిగా నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడకు ఎవరూ బయట వ్యక్తుల రాకపోకల ఉండవు. ఈ క్రమంలో కొత్త ఏడాది అక్కడికి కారు రావడం, అది తగలబడటం చూస్తుంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా అని పోలీసులు అనుమానిస్తున్నారు. కారు నెంబర్ AP28DU5499 ఆధారంగా పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి ఎవరు, కారుని తగలెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఎవరైనా అక్కడికి తీసుకొచ్చి హత్య చేశారా? అనే కోణాల్లో విచారణ చేపట్టారు. సజీవంగా ఉన్న వ్యక్తిని తగలబెట్టారా లేక హత్య చేసి అక్కడికి తీసుకొచ్చి కారుతో సహా దగ్ధం చేశారా అనే విషయం కూడా పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. 

Also Read: జహీరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం... బైకును ఢీకొట్టిన కారు...చిన్నారి సహా నలుగురు మృతి

ఘటనపై ఎస్పీ ఆరా

కారు తగలబడటం ప్రమాదవశాత్తు జరిగిన ఘటన కాదని, కారు టైర్ల ముద్రలను బట్టి చూస్తే, కారుని జాగ్రత్తగా తీసుకొచ్చి రివర్స్ లో పార్కింగ్ చేసినట్టు స్థానికులు అంటున్నారు. స్థానికులు చూసేసరికి స్పందించే సమయానికి కారులో ఓ వ్యక్తి డ్రైవింగ్ సీట్లో మరణించి ఉన్నట్లు చెబుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. కారు తగలబడటం, కారుతోపాటు ఓ వ్యక్తి కూడా చనిపోవడం అది కూడా కొత్త సంవత్సరం తొలిరోజున కావడంతో కలకలం రేగింది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పుడిది సంచలనంగా మారింది. జిల్లా ఎస్పీ ఈ ఘటనపై ఆరా తీశారు. 

Also Read: చిన్నప్పుడు వేరుశనక్కాయలు కొని డబ్బులు ఇవ్వలేదని... ఇప్పుడు రూ.25 వేల ఆర్థిక సాయం

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Rajya Sabha: ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
ఏపీ నుంచి కూటమికి ముగ్గురు రాజ్యసభ సభ్యులు - నాగబాబుతో పాటు ఈ ఇద్దరికీ చాన్స్
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు
Revanth Reddy: తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ మళ్లీ స్టార్ట్ కానుందా? రేవంత్ ఢిల్లీ పర్యటన అందులో భాగమేనా?
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Kollywood: తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
తమిళ తంబీలకు తీరని కల... కోలీవుడ్ నుంచి 1000 కోట్ల సినిమా వచ్చేది ఎప్పుడు?
Weather Updates Today: నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
నేడు తుపానుగా మారుతున్న వాయుగుండం, ఏపీలో 3 రోజులు భారీ వర్షాలు - తెలంగాణలో పెరిగిన చలి
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Asifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Embed widget