News
News
X

Nellore Crime: పోలీస్ స్టేషన్ లోనే చెల్లిపై కత్తితో దాడి చేసిన అన్న.... ప్రేమ పెళ్లి చేసుకుందని ఆగ్రహంతో దాడి

ప్రేమ వివాహం చేసుకుందని కోపంతో అన్న.. చెల్లిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఏకంగా పోలీస్ స్టేషన్ లో యువతిపై దాడికి దిగడంతో ఈ ఘటన సంచలనమైంది.

FOLLOW US: 

ఇటీవల కాలంలో ప్రేమ పెళ్లిళ్లు పెరిగాయి. ప్రేమించుకున్న యువతీయువకులు పెద్దల్ని ఒప్పించి  పెళ్లి చేసుకుంటున్నారు. మరికొంత మంది పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమ పెళ్లిళ్లు నచ్చని కుటుంబ సభ్యులు యువతీయువకులను హత్య చేసేందుకు కూడా వెనుకాడడంలేదు. ఇటీవల నెల్లూరులో చెల్లిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లికి సిద్ధమైన ఓ యువకుడిని కాబోయే బావమరుదులే అత్యంత దారుణంగా హత్య చేశారు. ఇలాంటి మరో ఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. 

Also Read:  గుడి ముందు మనిషి తలకాయ, ఈ మిస్టరీ కీలక వివరాలు వెలుగులోకి.. మృతుడు ఎవరంటే..

ప్రేమ పెళ్లి చేసుకుందని చెల్లిపై కత్తితో దాడి 

చెల్లి ప్రేమ పెళ్లి చేసుకుందన్న కోపంతో అన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్‌ స్టేషన్‌ లోనే జరగడం సంచలనమైంది. నెల్లూరు జిల్లాలోని కోవూరు మండలానికి చెందిన యువకుడు, బుచ్చిరెడ్డిపాలెం మండలానికి చెందిన యువతి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ అభిప్రాయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పారు. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకరించక పోయేసరికి సోమవారం స్థానిక దేవాలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత తమకు రక్షణ కల్పించాలని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఎస్సై వెంకటేశ్వరరావు ఇరువురి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని వారిద్దరిని మంగళవారం రమ్మని చెప్పారు. ఇవాళ ఉదయం వాళ్లిద్దరూ స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే స్టేషన్ లో యువతి సోదరుడు కత్తితో ఆమెపై దాడి చేశాడు. యువతిని చికిత్స కోసం కోవూరు ఆసుపత్రికి తరలించారు. యువతి అన్నపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Also Read:  కన్న బిడ్డల్ని బావిలోకి నెట్టేసిన సీఆర్పీఎఫ్ జవాను! వెంటనే పరారీ.. కారణం ఏంటంటే..

విజయవాడలో మరో దారుణం

విజయవాడలో ఓ బాలికపై ప్రేమోన్మాది దాడికి ప్రయత్నించాడు. ప్రేమను నిరాకరించిందని కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో స్వల్ప గాయాలైన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదివారం జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న బాలికను హరీష్ అనే యువకుడు ప్రేమ పేరుతో గత కొంతకాలంగా వేధిస్తున్నాడు. బాలికకు తల్లి లేదు. తండ్రి అనారోగ్యంతో బాధపడడంతో నాయనమ్మ వద్ద ఉంటూ చదువుకుంటుంది. విజయవాడలో ఉంటున్న హైదరాబాద్‌కు చెందిన హరీష్‌ బాధిత బాలికతో కలిసి మూడేళ్ల పాటు చదువుకున్నాడు. ఆ పరిచయంతో ఆమెను తరచూ ఇబ్బందులకు గురిచేసేవాడు. తనను ప్రేమించాలంటూ ఒత్తిడి చేశాడు. తన ప్రేమను తిరస్కరించిందన్న కోపంతో నిందితుడు ఆదివారం మధ్యాహ్నం బాలిక ఇంటికి వెళ్లి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆమె ముఖం, మెడపై గాయాలయ్యాయి. 

Also Read: భర్త వేధింపులు భరించలేక భార్య దారుణం... భర్త మెడకు చున్నీ బిగించి హత్య...!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 11 Jan 2022 07:02 PM (IST) Tags: Love Marriage Nellore Crime News kovur police station brother attacked sister

సంబంధిత కథనాలు

Anantapur Crime News :  బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Anantapur Crime News : బిల్లులు చెల్లించమన్నదుకు విద్యుత్ ఏఈపై చెప్పుతో దాడి - ఉరవకొండలో సర్పంచ్ అరాచకం !

Crime News : బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

Crime News :  బెజవాడలో కాల్‌మనీ కలకలం - టీడీపీ కార్పొరేటర్ కుమారుడు అరెస్ట్ !

రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు

రెచ్చిపోతున్న రౌడీ మూకలు- దాడులు, దౌర్జన్యాలతో సిక్కోలు ప్రజలు బెంబేలు

Baby Kidnap: కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం, 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

Baby Kidnap: కరీంనగర్ లో చిన్నారి కిడ్నాప్ కలకలం, 4 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

Thunderstorm: ఏలూరు జిల్లాలో తీవ్ర విషాదం - పిడుగుపాటుకు నలుగురు దుర్మరణం

టాప్ స్టోరీస్

AP Teachers : "మిలియన్ మార్చ్" నిర్వీర్యం కోసమే టార్గెట్ చేశారా ? ఏపీ టీచర్లు ప్రభుత్వంపై ఎందుకంత ఆగ్రహంగా ఉన్నారు ?

AP Teachers :

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ - ఇందులో నిజమెంతా?

ఆస్కార్ బరిలో ‘శ్యామ్ సింగరాయ్’ -  ఇందులో నిజమెంతా?

GAIL Recruitment: గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?

GAIL Recruitment:  గెయిల్‌లో 282 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, జీతమెంతో తెలుసా?

Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు

Telangana Secretariat: కొత్త సెక్రెటేరియట్ వద్దకు సీఎం కేసీఆర్, భవనం మొత్తం పరిశీలన - కీలక ఆదేశాలు