Nalgonda Accident: హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా, 20 మంది ప్రయాణికులకు గాయాలు
Private Travels bus overturned: వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడిన ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై ప్రమాదం జరిగింది.
Private Travels bus overturned In Nalgonda District: నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది.
ట్రావెల్స్ బస్సు హైదారాబాద్ నుండి కందుకూరు వెళ్తుండగా ఘటన జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 32 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. డ్రైవర్ అతివేగంగా, నిర్లక్ష్యంగా నడపడమే ప్రమాదానికి ముఖ్య కారణమని బాధితులు చెబుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
నల్లగొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వేములపల్లి మండల కేంద్రములో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. #TavelsBus #Nalgonda #Telangana pic.twitter.com/VwgiPUsxk1
— ABP Desam (@ABPDesam) May 31, 2022