అన్వేషించండి

Sisters Kill Youth in Jagtial: ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్, పెళ్లి సంబంధం చెడగొట్టిన యువకుడిని చంపిన అక్కాచెల్లెళ్లు

Jagtial Crime News | ఇద్దరు అక్కాచెల్లెళ్లతో ఓ యువకుడు వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ప్రైవేట్ వీడియోలతో యువతి పెళ్లి చెడగొట్టిన యువకుడిని జగిత్యాలలో అక్కాచెల్లెళ్లు హత్య చేశారు.

Murder in Jagtial | జగిత్యాల జిల్లాలో శుక్రవారం అర్ధరాత్రి ఒక యువకుడి హత్య కలకలం రేపింది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చేస్తున్న యువతితో ప్రేమ వ్యవహారం నడిపి, శారీరక సంబంధం పెట్టుకున్న యువకుడు యువతి అక్కతో సైతం లైంగిక సంబంధం కొనసాగించాడు. తన వద్ద యువతి అశ్లీల వీడియోలు ఉన్నాయని బయటపెట్టి, ఇటీవల యువతికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని చెడగొట్టడంతో అక్కాచెల్లెళ్లు తమ ప్రియుడ్ని హత్యచేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఎఫైర్.. ఆపై ఆమె అక్కతోనూ రిలేషన్

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పెద్దపల్లి జిల్లా తుర్కలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్ హైదరాబాద్‌లో మెడికల్ రిప్రజెంటేటివ్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోనే  సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఒక యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి, వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఆమె అక్కతో కూడా పరిచయం పెంచుకుని ఆమెతోనూ లైంగిక సంబంధాన్ని కొనసాగించాడు. అయితే, ఇటీవల ఆ యువతికి వచ్చిన పెళ్లి సంబంధాన్ని మహేందర్ తన వద్ద ఉన్న అశ్లీల వీడియోలను చూపి చెడగొట్టడమే కాకుండా, తనతో గడిపిన ప్రైవేట్ వీడియోలతో వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని హత్యకు ప్లాన్

మహేందర్ వేధింపులతో విసిగిపోయిన అక్కాచెల్లెళ్లు అతడిపై పగ పెంచుకున్నారు. ఎలాగైనా అతడిని వదిలించుకోవాలని పథకం వేశారు. ప్లాన్ ప్రకారం యువతి శుక్రవారం రాత్రి మహేందర్‌కు ఫోన్ చేసి, తన అక్క ఉండే ప్రాంతానికి రమ్మని పిలిచింది. రాత్రి సుమారు 10 గంటల సమయంలో అక్కడికి చేరుకున్న మహేందర్‌తో వారిద్దరూ వాగ్వాదానికి దిగారు. ముందస్తు పథకం ప్రకారం అతడి కళ్లలో కారం చల్లి, కర్రలతో దాడి చేశారు. అక్కాచెల్లెళ్లతో పాటు వారి అక్క కుమారుడు, మరో ఇద్దరు బంధువులు కూడా కర్రలతో విచక్షణారహితంగా మహేందర్‌పై దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావమైంది. 

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

ఈ దాడిలో తలకు బలమైన గాయాలు కావడంతో మహేందర్ రక్తపు మడుగులో పడిపోయాడు. స్థానికులు గమనించి 108 వాహనంలో బాధితుడ్ని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడికి భార్య, తల్లిదండ్రులు ఉన్నారని తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కుటుంబాలను రోడ్డున పడేస్తున్న వివాహేతర సంబంధాలు

వివాహేతర సంబంధాలు ఒక్కరి జీవితానికి సంబంధించినవి కాదు. అవి క్రమంగా ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి. హత్యలకు సైతం వెనుకాడటం లేదు. దాంతో వారి పిల్లలు అనాథలు అవుతున్నారు. మరోవైపు వివాహేతర సంబంధం పెట్టుకున్న వారి కుటుంబసభ్యులు సమాజంలో తలెత్తుకుని జీవించలేక వారు కూడా ఆత్మహత్య చేసుకున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కనుక ఇలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచితులతోనే కాదు, తెలిసిన వారితో సైతం వివాహేతర సంబంధాలు సరికాదని పోలీసులు హెచ్చరిస్తున్నా మార్పు రావడం లేదు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Advertisement

వీడియోలు

Fifa World Cup Free Tickets | లాటరీ తీయాలన్నా 50కోట్ల అప్లికేషన్ల డేటా ఎలా ఎక్కించాలయ్యా | ABP Desam
Harleen Deol 64 Runs vs MI | కోచ్ నోరు మూయించిన హర్లీన్ డియోల్ | ABP Desam
BCB Director Najmul Islam Controversy | ఒక్క మాటతో పదవి పీకించేశారు | ABP Desam
USA U19 vs Ind U19 World Cup 2026 | వరుణుడు విసిగించినా కుర్రాళ్లు కుమ్మేశారు | ABP Desam
Tension Errupt at Puranapul | మైసమ్మ ఆలయంపై ఆగంతుకుడి దాడి, ఉద్రిక్తత | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BMC Election Results 2026: ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
ముంబైలో తొలిసారిగా బీజేపీ మేయర్.. ఠాక్రే సోదరులకు BMCలో ఎదురుగాలి
Jadcharla MLA Anirudh Reddy: మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
మూడు రోజులుగా అన్నం తినలేదు - బావిలోకి దూకమన్నా సిద్ధం- జడ్చర్ల ఎమ్మెల్యే వింత వ్యాఖ్యలు
Dhurandhar 2: ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
ధురంధర్ 2 ట్రైలర్ వర్క్ మొదలు… అక్షయ్ ఖన్నా షూట్ చేసిందేమీ లేదు
BMC Election Results 2026: బీఎంసీలో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
BMC లో విజేత ఎవరు? BJP కూటమి, శివసేన ఎక్కడెక్కడ గెలిచాయి? సీట్ల వారీగా ఫలితాలు
Chanaka Korata Pump House: ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
ఆదిలాబాద్ రైతన్నల కల సాకారం - చనాక, కొరాటా పంప్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం రేవంత్
Radhika Apte: బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
బాలీవుడ్ బడా ఫ్యామిలీ వారసుడితో 'లెజెండ్' హీరోయిన్ ఎఫైర్... రాధికా ఆప్టే రియాక్షన్ ఏమిటంటే?
Sankranthi recording dances: రికార్డింగ్ డాన్సర్లు స్టేజ్ పై స్ట్రిప్ టీజ్ చేయాలని జనసేన నేత ఒత్తిడి - వీడియో వైరల్ - భగ్గుమన్న నెటిజన్లు
రికార్డింగ్ డాన్సర్లు స్టేజ్ పై స్ట్రిప్ టీజ్ చేయాలని జనసేన నేత ఒత్తిడి - వీడియో వైరల్ - భగ్గుమన్న నెటిజన్లు
మొదటి రోజే 93 వేలకు పైగా బుకింగ్స్‌తో అదరగొట్టిన Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S
మొదటి రోజే 93 వేలకు పైగా బుకింగ్స్‌తో అదరగొట్టిన Mahindra XUV 7XO, మహీంద్రా XEV 9S
Embed widget