YSRCP News: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తైనాల ఇంట్లో చోరీ, కత్తితో ఆయన భార్యను బెదిరించిన దుండగులు
YSRCP News: వైసీపీ నేత తైనాల విజయ్ కుమార్ ఇంట్లో గురువారం చోరీ జరిగింది. ఇద్దరు నిందితులు ఆయన ఇంట్లోకి ప్రవేశించి విజయ్ కుమార్ భార్యను కత్తితో బెదిరించి నగదు, బంగారం చోరీ చేశారు.
Money Theft at YSRCP Leader Thynala Vijaya Kumars home: మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత తైనాల విజయ కుమార్ ఇంట్లో చోరీ జరిగింది. మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ లేని సమయంలో ఆయన ఇంట్లోకి దొంగలు ప్రవేశించారు. ఆ గుర్తుతెలియని వ్యక్తులు విజయ్ కుమార్ భార్య మెడపై కత్తి పెట్టి బెదిరించారు. కత్తితో పొడుస్తామని బెదిరించిన నిందితులు వైసీపీ నేత ఇంట్లో బీరువాలు ఓపెన్ చేసి నగదు ఎత్తుకెళ్లారు. నగదుతో పాటు బంగారు నగల్ని సైతం దోచుకెళ్లినట్లు సమాచారం. విజయకుమార్ ప్రస్తుతం ఎస్ కోటలో వైసీపీ ఎంపీ బొత్స ఝాన్సీ ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్నారు.
ఇద్దరు వ్యక్తులు మాజీ ఎమ్మెల్యే ఇంట్లోకి ప్రవేశించారు. అందులో ఒకడు ఇంటి బయట కాపాలా కాయగా.. మరో నిందితుడు తైనాల భార్య మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఆమె ఒంటిపై ఉన్న నగలు, ఇంట్లో బీరువాలో ఉన్న నగదు, బంగారం చోరీ చేశారు. అరిస్తే కత్తితో పొడిచేస్తామని బెదిరించడంతో ఆమె సైలెంట్ గా ఉన్నారు. దొంగలు పారిపోయిన తరువాత భర్త విజయ్ కుమార్ కు ఫోన్ చేసి జరిగిన చోరీ గురించి ఆమె తెలిపారు. పోలీసులకు సమాచారం అందించగా, అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు.