అన్వేషించండి

Divya Pahuja: జైలు నుంచి విడుదలైన మోడల్ దారుణ హత్య- షూట్ ఉందని పిలిచి హతమార్చిన దుండగులు

Divya Pahuja Murder: గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌ని ట్రాప్ చేసి పోలీసులతో ఎన్ కౌంటర్ చేయించిన ఓ మాజీ మోడల్‌ను దుండగులు కాల్చి చంపేశారు. 

Model Divya Pahuja Murdered In Gurugram: గురుగ్రామ్‌లో దారుణం జరిగింది. ఏడేళ్ల క్రితం ఓ గ్యాంగ్‌స్టర్‌ని ట్రాప్ చేసి పోలీసులతో ఎన్ కౌంటర్ చేయించిన ఓ మాజీ మోడల్‌ను దుండగులు కాల్చి చంపేశారు. వివరాలు.. మోడల్‌గా పని చేస్తున్న దివ్యా పహుజా (Divya Pahuja)కు 2016లో అండర్ వరల్డ్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. అదే సంవత్సరం గురుగ్రామ్‌ (Gurugram)కు చెందిన గ్యాంగ్ స్టర్ సందీప్ గడోలి (Sandeep Gadoli)తో ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని ఓ హోటల్లో గడిపారు. ఆ సమయంలో సందీప్ గడోలిని పోలీసులు ఎన్‌కౌంటర్ చేశారు. అతనితో పాటు హోటల్ రూమ్‌లోనే ఉన్న మోడల్ దివ్యా అహుజాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏడేళ్లు జైలులో గడిపిన తర్వాత, జూన్ 2023లో దివ్యకు బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.  

కారులో డెడ్ బాడీ
బెయిల్ పై ఏడేళ్ల తర్వాత బయటకు వచ్చిన దివ్యా అహుజాను మంగళవారం ఐదుగురు బలవంతంగా గుర్‌గ్రామ్‌లోని ఓ హోటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ ఆమెను తలపై గన్‌తో కాల్చి చంపేశారు. హత్యకు గల కారణాలు మాత్రం అస్పష్టంగా ఉన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దివ్య డెడ్ బాడీ పారవేసేందుకు ప్రయత్నించిన హోటల్ యజమాని అభిజీత్ సింగ్, అతని ఇద్దరు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై అభిజిత్ సింగ్ స్పందిస్తూ.. దివ్య తనను బెదిరించి డబ్బు వసూలు చేసిందని ఆరోపించాడు. దివ్య కుటుంబ సభ్యులు ఆరోపణలను ఖండించారు.

గడోలీ కుటుంబం ప్లాన్‌
దివ్య సోదరి నైనా తన సోదరి హత్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దివ్యను హత్య చేయడానికి గడోలీ కుటుంబ సభ్యులు సుదేష్ కటారియా, బ్రహ్మ ప్రకాష్ కటారియా అభిజిత్‌కు సుపారి ఇచ్చారని ఆరోపించారు. అంతేకాదు అభిజిత్ తీరుపై కూడా అనుమానం వ్యక్తం చేసింది. దివ్య హత్యకు గురైన హోటల్‌లోని CCTV ఫుటేజీలో అబిజిత్ ఉద్యోగుల సాయంతో ఆమె మృతదేహాన్ని పారవేసేందుకు ప్రయత్నించినట్లు ఆరోపించింది. దివ్యను జనవరి 1న అభిజిత్ కలిశాడు. జనవరి 2న ఉదయం 11:50 గంటలకు దివ్య చివరి సారి కుటుంబ సభ్యులతో మాట్లాడింది. ఆ రోజు తర్వాత ఆమె ఫోన్‌ను సంప్రదించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. 

అసభ్యకర ఫోటోలు డిలీట్ చేయలేదు
అయితే అభిజిత్ వాదన వేరేలా ఉంది. జనవరి 2న తాను దివ్య పహుజాతో కలిసి హోటల్ సిటీ పాయింట్‌కి వచ్చానని, ఆమె ఫోన్‌లో ఉన్న తన అసభ్యకరమైన ఫోటోలను డిలీట్ చేయాలనుకున్నానని, అయితే దివ్య పహుజా తన ఫోన్ పాస్‌వర్డ్ చెప్పలేదని అభిజిత్ తెలిపాడు. పోలీస్ అధికారి సుభాష్ బోకేన్ స్పందిస్తూ.. హోటల్‌ క్లీనింగ్, రిసెప్షన్ ఉద్యోగులతో కలిసి అభిజిత్ మోడల్  దివ్య పహుజాను హత్య చేసి మృతదేహాన్ని తన బీఎండబ్ల్యూ కారులో ఉంచినట్లు చెప్పారు. అనంతరం మృతదేహాన్ని పారవేయడానికి తన కారును వారికి ఇచ్చినట్లు వెల్లడించారు. గురుగ్రామ్ ఎస్పీ ముఖేష్ కుమార్ దివ్య హత్య కేసు గురించి మాట్లాడుతూ.. ఈ కేసులో మరింత లోతైన విచారణ జరగాలని ఇప్పటికైతే హోటల్ ఓనర్ అభిజిత్ సహా మరో ఇద్దరిని అరెస్ట్ చేశామని తెలిపారు. మృతదేహాన్ని వెలికితీసేందుకు పోలీస్ బృందాలు గాలిస్తున్నట్లు చెప్పారు.

Alsa Read: 16 ఏళ్ల బాలికపై వర్చువల్ గ్యాంగ్ రేప్, ప్రపంచంలోనే ఇది తొలి కేసు!

Also Read: జూనియర్‌ రెజ్లర్ల ఆందోళన, శుభవార్త చెప్పిన అడ్‌హక్‌ కమిటీ


    ఢిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద జూనియర్‌ రెజ్లర్ల ఆందోళన స్పందించిన అడ్‌హక్‌ కమిటీ ఆరు వారాల్లో అండర్‌ -15, అండర్‌ – 20 నేషనల్‌ ఛాంపియన్‌షిప్స్‌.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...

వీడియోలు

Indian Team Announced for Nz ODI Series | న్యూజిలాండ్ వన్డే సిరీస్ కు భారత జట్టు ప్రకటన | ABP Desam
పక్కటెముక విరగ్గొట్టుకున్నాడు.. షాక్‌లో గుజరాత్ ఫ్యాన్స్
ముస్తాఫిజుర్‌ ఐపీఎల్ ఆడితే మ్యాచ్‌లు జరగనివ్వం: షారూఖ్‌కు హిందూ సంఘాల వర్నింగ్
2026లో భారత్, పాకిస్తాన్ ఎన్నిసార్లు తలపడతాయంటే..
టీ20 వరల్డ్ కప్ ఎవ్వరూ చూడరు: మాజీ ప్లేయర్ అశ్విన్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP MLA son arrested in drug case: హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
హైదరాబాద్‌లో సంచలనం - డ్రగ్స్ కేసులో ఏపీ ఎమ్మెల్యే తనయుడు సుధీర్ రెడ్డి అరెస్ట్
India News: ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
ఈ పరిస్థితుల్లో వెనిజులాకు వెళ్లవద్దు.. పౌరులకు భారత ప్రభుత్వం అడ్వైజరీ
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆదివారమే తొలి విమానం ల్యాండింగ్ - సాకారమవుతున్న ఉత్తరాంధ్ర ప్రజల కల
Constable Kanakam Season 2 : వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
వేర్ ఈజ్ చంద్రిక?... క్యాష్ ప్రైజ్ షేర్ ఇస్తే హెల్ప్ చేస్తా! - నాగ్ అశ్విన్, రాజీవ్ కనకాల ఫన్... ఓడియమ్మా బంటీ అంటూ...
CM Revanth Reddy: జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీల నీటిని మళ్లించి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం
Priyanka Gandhi Son Engagement: గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
గాంధీ కుటుంబంలో పెళ్లి వేడుక.. వధువు ధరించే చీరకు ఉన్న ఈ ప్రత్యేకత తెలుసా !
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Tata Sierra వర్సెస్ Kia Seltos.. మిడ్ సైజ్ లో ఏ SUV బెటర్, కొనేముందు ఇవి తెలుసుకోండి
Telangana Assembly: శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
శ్రీధర్ బాబు సీఎం సీట్లో కూర్చోవాలి - మండలిలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు పొగడ్తల వర్షం
Embed widget