Medical Crime: పూజలు చేస్తే డబ్బు రెట్టింపు అవుతాయట - వాళ్లు చెప్పారు సరే .. నమ్మినోళ్లకు బుద్ది ఉండొద్దా?
Baba Gang: పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని మోసం చేస్తున్నముఠాను మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు పూజలో పెట్టించి.. వాటిని చాకచక్యంగా కొట్టేస్తున్నారు.

Medchal police arrest Cheating gang: డబ్బులు చెట్లకు కాయవు. అలాగే పిల్లలు కూడా పెట్టవు. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ కొంత మందికి మాత్రం అత్యాశ ఉంటుంది. పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని స్వామీజీలు వచ్చి చెబితే నిజమేనని నమ్మేస్తారు. ఎలా రెట్టింపు అవుతాయన్నది ఒక్క నిమిషం కూడా ఆలోచించరు. అత్యాశకు పోయి ఉన్నదంతా పోగొట్టుకుంటారు.
మేడ్చల్లో .. బారిష్ పూజ చేస్తామని కొంత మంది దొంగ స్వామీజులు బయలుదేరారు. బాగా డబ్బులున్న అత్యాశపరుల్ని చూసుకుని..తాము బారిష్ పూజలు చేయడంలో నిపుణులం అని.. తాము పూజలు చేస్తే డబ్బులు రెట్టింపు అవుతాయని నమ్మబలుకుతారు. నిజమని నిరూపించేందుకు పలు కథలు చెబుతారు. చివరికి ఆ డబ్బున్న అత్యాశపరుడు ఆశ పడితే.. అతడి దగ్గర ఉన్న డబ్బు దస్కం అంతా తీసుకొచ్చి పూజలో పెట్టిస్తారు . పూజ చేయించి.. ప్రసాదాలు ఇస్తారు. ఆ ప్రసాదాల్లో మత్తు మందు కలుపుతారు. తర్వాత మిగతా అంతా మూట గట్టుకునిపోతారు. ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న నలుగురు పాత నేరస్తులు సభ్యుల ముఠాను అరెస్టు దుండిగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుండి ఒక ఎయిర్ గన్ ,ఒక కత్తి తో పాటు 8లక్షల 50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల 18 న దుండిగల్ లోని ఓ ఇంట్లో బారిష్ పూజ పేరుతో నమ్మబలికి, ప్రసాదం లో మత్తు మందు కలిపి డబ్బు దోచుకెళ్లారు నిందితులు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించామని…మరో ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు,దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి. బారిష్ పూజ చేస్తే డబ్బు చాలా రెట్లు పెరుగుతుందని నమ్మిస్తారు. బారిష్ పూజ తర్వాత నిందితులు స్వీట్లు మరియు బాదం పాలను మత్తులో కలిపి ప్రసాదంగా ఇస్తారు, ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి అపస్మారక స్థితిలో పడిపోతారు. ఆ సమయంలో నిందితులు నగదు మొత్తాన్ని తీసుకొని అక్కడి నుండి పారిపోతారు.
కేసు ఈ నెల 18 వతేదీన మహావీర్ కాంప్లెక్స్‌లోని గండిమైసమ్మ ఎక్స్ రోడ్‌లో జరిగింది.. బాధితులు 21వతేదీన పోలీసులకు పిర్యాదు చేశారు. నిందితులను పట్టుకునేందుకు వెంటనే క్రైమ్ టీం మరియు మేడ్చల్‌లోని సిసిఎస్‌లను నియమించారు. మహామ్మద్ ఇర్పాన్ 44,
గుగోలోత్ రవీందర్ , కవిత సాయిబాబా , ఠాగూర్ మనోహర్ ను దితులను అరెస్టు చేశారు. మరొక నిందితుడు అబ్దుల్ కయ్యూమ్ పరారీలో ఉన్నాడు.. ప్రదాన నిందితుడు ఇర్ఫాన్ నుండి 8,50,000/- నగదు, ఎయిర్ గన్, కత్తి, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అయినా డబ్బులు రెట్టింపు చేసే పూజల శక్తి తమకు ఉంటే.. వారు తమ డబ్బుల్నే రెట్టింపు చేసుకుంటారు కానీ.. ఇతరులకు ఎందుకు చేస్తారుa?. ఈ చిన్న లాజిక్ అర్థం చేసుకోకుండా.. డబ్బులు వస్తాయంటే పూజలు చేయిచుకునేవారి అత్యాశే తప్పు. ఇలాంటి వారి ఆశనే మోసగాళ్లు వాడేసుకుంటున్నారు.





















