అన్వేషించండి

Job Fraud: క్యాంపస్‌లో కన్నింగ్ స్టూడెంట్.. స్టార్టప్ జాబ్స్ పేరుతో 1.5 కోట్లు కొట్టేసిన బీటెక్ విద్యార్థి

Job Scam in Guntur | గుంటూరు జిల్లాలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బిటెక్ విద్యార్థి, స్టార్టప్‌లో ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌ల ఆశ చూపి తోటి 40 మంది విద్యార్థుల నుంచి రూ.1.50 కోట్లు వసూలు చేసి ముంచేశాడు.

Job Fraud | గుంటూరు జిల్లాలోని ఒక ప్రముఖ ప్రైవేట్‌ యూనివర్సిటీలో ఘరానా మోసం వెలుగుచూసింది. తోటి విద్యార్థులు, సీనియర్లను మోసం చేస్తూ ఓ బిటెక్ విద్యార్థి, ఏకంగా కోటిన్నర రూపాయలు వసూలు చేసి వారికి టోకరా వేశాడు. తమకు ఉద్యోగాలు ఇప్పించడం లేదు, ఇంటర్న్ షిప్ ఇవ్వడం లేదని బాధితులు ఫిర్యాదు చేయడంతో మంగళగిరి గ్రామీణ (రూరల్) పోలీసుస్టేషన్‌లో శనివారం కేసు నమోదైంది. యూనివర్సిటీలో చదువుతున్న తోటి విద్యార్థులనే లక్ష్యంగా చేసుకుని ఇంత పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మంగళగిరి రూరల్ పోలీసుల వివరాల ప్రకారం.. కడప జిల్లాకు చెందిన విజయ్‌ నరసింహ ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్నాడు. తాను ఒక 'స్టార్టప్‌ కంపెనీ'ని రన్ చేస్తున్నానని, అందులో చేరితే మంచి ఇంటర్న్‌షిప్‌తో పాటు భవిష్యత్తులో గ్యారెంటీగా సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తానని తోటి విద్యార్థులను నమ్మించాడు. అతని మాటలు నిజమేనని నమ్మిన 40 మందికి పైగా విద్యార్థులు.. ఒక్కొక్కరు రూ. 5 లక్షల నుండి రూ. 20 లక్షల వరకు విజయ్ నరసింహకు ఇచ్చారు. ఈ విధంగా కాలేజీ క్యాంపస్ లోనే దాదాపు రూ. 1.50 కోట్ల వరకు అతను కాజేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. 

Also Read: Bandi Bhageerath POCSO Case: నేరాన్ని అంగీకరించిన బండి భగీరథ్! ఇంతకీ లొంగిపోయాడా ! పోలీసులే పట్టుకున్నారా..?

తప్పించుకు తిరుగుతున్న విద్యార్థి..

అయితే, డబ్బులు తీసుకుని నెలలు గడుస్తున్నా అటు ఇంటర్న్‌షిప్ కానీ, ఇటు ఉద్యోగాల ఊసు కానీ లేకపోవడంతో బాధితుల్లో అనుమానం మొదలైంది. దీనిపై విజయ్ నరసింహను గట్టిగా నిలదీయగా.. అతను సరైన సమాధానం చెప్పకుండా తప్పించుకు తిరగడం ప్రారంభించాడు. దీంతో తాము దారుణంగా మోసపోయామని గ్రహించిన బాధిత విద్యార్థులు, వారి తల్లిదండ్రులు శనివారం మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి నిందితుడిపై ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన మంగళగిరి సీఐ బ్రహ్మం, ఎస్సై వెంకట్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ భారీ క్యాంపస్ వసూళ్ల వెనుక విజయ్‌ నరసింహ ఒక్కడే ఉన్నాడా? లేక కాలేజీకి చెందిన మరెవరైనా ఇందులో ఉన్నారా? అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు. టాలెంట్ నమ్ముకోవాలి అని, ఇలా డబ్బులకు జాబ్స్, అవకాశాలు ఇప్పిస్తాం అనే వారిని గుడ్డిగా నమ్మకూడదని పోలీసులు యువతకు సూచించారు. ఎవరైనా ఇలా వసూళ్లకు పాల్పడితే ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

Frequently Asked Questions

గుంటూరు జిల్లాలోని ప్రైవేట్ యూనివర్సిటీలో జరిగిన మోసం వివరాలు ఏమిటి?

ఒక బీటెక్ విద్యార్థి, తోటి విద్యార్థులను ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి, కోటిన్నర రూపాయలు వసూలు చేసి మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదైంది.

ఈ మోసంలో ఎంతమంది విద్యార్థులు బాధితులుగా ఉన్నారు?

40 మందికి పైగా విద్యార్థులు ఈ మోసంలో బాధితులుగా ఉన్నారు. ఒక్కొక్కరు 5 లక్షల నుండి 20 లక్షల వరకు డబ్బులు చెల్లించారు.

మోసానికి పాల్పడిన విద్యార్థి పేరు ఏమిటి?

మోసానికి పాల్పడిన విద్యార్థి పేరు విజయ్ నరసింహ. ఇతను కడప జిల్లాకు చెందినవాడు మరియు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

పోలీసులు ఈ కేసులో ఎలాంటి దర్యాప్తు చేస్తున్నారు?

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ వసూళ్ల వెనుక విజయ్ నరసింహ ఒక్కడే ఉన్నాడా లేక కాలేజీకి చెందిన వారైనా ఉన్నారా అని విచారిస్తున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
Embed widget