అన్వేషించండి

Markapuram Road Accident: మార్కాపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం! టిప్పర్‌, ప్రైవేట్ బస్‌ ఢీకొని 13 మంది సజీవదహనం !

Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో గురువారం తెల్లవారుజామును ఘోర ప్రమాదం జరిగింది. 13 మంది సజీవదహనం అయ్యారు. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • మార్కాపురం సమీపంలో టిప్పర్, బస్సు ఢీకొని పది మంది సజీవదహనం.
  • బస్సు డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు వ్యాపించి, బస్సు పూర్తిగా దగ్ధం.
  • హైదరాబాద్ నుంచి కనిగిరి వెళ్తుండగా అతివేగం, అజాగ్రత్తతో ప్రమాదం.
  • స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు, మృతుల సంఖ్య పెరిగే అవకాశం.

Markapuram Road Accident:ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్ బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా ఢీ కొన్న ప్రమాదంలో 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో క్షణాల్లో మంటలు వ్యాపించాయి. బస్ పూర్తిగా కాలిపోయింది. 

మార్కాపురం జిల్లా మార్కాపురం గ్రామీణ మండల పరిధిలోని రాయవరం సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. గురువారం తెల్లవారుజామున ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన బస్‌ ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది.  

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తున్న టైంలో ఈ ప్రమాదం రాయవరం వద్ద జరిగింది. 

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బస్, టిప్పర్ అతివేగంగా ఎదురెదురుగా  ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగలడంతో మంటలు చెలరేగాయి. సెకన్లలో రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. లోపల ఉన్న ప్రయాణికులు సీట్ల నుంచి లేచి బయటకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. బస్ నిమిషాల్లోనే పూర్తిగా కాలిపోయింది. 

చాలా మంది ప్రయాణికులు నిద్రమత్తులో ఉండటంతో అసలు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే మంటలు చుట్టుముట్టాయి. కొందరు సాహసించి బస్ కిటికీలు పగులుగొట్టి ప్రాణాలతో బయటపడగా, లోపల చిక్కుకున్న 13మంది సజీవదహనం అయ్యారు. 

సహాయక చర్యలు

ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే బస్ పూర్తిగా అస్తిపంజరంలా మారిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మరికొందరు ప్రయాణికులను పోలీసులు మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి  తరలించారు. 

ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దీని వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

రాయవరం సమీపంలోనీ ఈ ప్రాంతంలో క్వారీలకు ప్రసిద్ధి. ఇక్కడ భారీగా టిప్పర్ల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా తెల్లవారుజామున అతి వేగం, డ్రైవర్ల అజాగ్రత్త ప్రమాదాలకు కారణమమవుతుంటాయి. ఈ ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులకు అవసరమైన వైద్య సహాం అందించడంతోపాటు మృతుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేశారు. 

మార్కాపురం రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రయాణికుల మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్‌తో మాట్లాడారు. క్షతగాత్రులకు అందుతున్న సాయంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది. అక్కడ ఏం జరిగిందో పూర్తి వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పారు. 

మార్కాపురం ప్రమాద ఘటనపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులు, స్థానిక ఎమ్మెల్యేతో మాట్లాడారు. ప్రమాద వివరాలను మంత్రి గొట్టిపాటికి అధికారులు వివరించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆయన ఆదేశించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 

Frequently Asked Questions

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ ప్రమాదం జరిగింది?

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో పలక క్వారీల వద్ద ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదానికి కారణం ఏమిటి?

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌ , టిప్పర్ ఎదురెదురుగా అతివేగంగా ఢీ కొన్నాయి. టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలిపోవడంతో మంటలు వ్యాపించాయి.

ప్రమాదంలో ఎంతమంది మరణించారు?

దురదృష్టవశాత్తు, ఈ ప్రమాదంలో పది మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు.

ప్రమాదం జరిగినప్పుడు బస్సులో ఎంతమంది ఉన్నారు?

ప్రమాదం జరిగిన సమయంలో బస్‌లో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ బస్సు హైదరాబాద్‌ నుంచి ప్రకాశం జిల్లాలోని కనిగిరి వైపు వెళ్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
Embed widget