News
News
X

Man Murdered His Wife: అనుమానమే పెనుభూతమై, కట్టుకున్న దాన్నే కడతేర్చాడు!

Man Murdered His Wife: కడదాకా తోడుంటానని మాట ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పట్టుమని పదేళ్లు కూడా కాకముందే భార్యపై అనుమానం పెచుకొని ఆమెను హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. 

FOLLOW US: 

Man Murdered His Wife: హైదారాబాద్ లోని కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. పచ్చగా ఉన్న కాపురంలో అనమానమనే మంట పడి చిచ్చు రేగింది. చివరకు కట్టుకున్న భార్యనే కడతేర్చాడు ఆ భర్త. ఆపేందుకు వచ్చిన ఓ మహిళపై కూడా కత్తి దూశాడు. చేసిన నేరానికి గాను అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పాతికేళ్లు కూడా నిండని తమ కూతుర్ని తమకు దూరం చేశాడంటూ ఆమె తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

అసలేమైందంటే...?

కులుసుం పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని సంజయ్ నగర్ జియాగూడలో సంతోష్, సరిత దంపతులు నివాసం ఉంటున్నారు. సంతోష్ టిఫిన్ సెంటర్ లో పని చేస్తూ.. జీవనం సాగిస్తున్నాడు. అయితే సంతోష్, సరితలకు పెళ్లి జరిగి పట్టుమని పదేళ్లు కూడా కావట్లేదు. ఇన్నాళ్లూ బాగానే ఉన్న సంతోష్.. గత కొంత కాలంగా భార్య సరితను అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఆమెతో గొడవ పడుతున్నాడు. నానా రకాలుగా ఇబ్బందులు పెడుతూనే ఉన్నాడు.

ప్రైవేట్ పార్ట్ లో కత్తితో పొడిచాడు..

అయితే ప్రతీ రోజూ వెళ్లినట్లుగానే ఈరోజు కూడా పని నిమిత్తం టిఫిన్ సెంటర్ కు వెళ్లాడు. భర్త వెళ్లిపోయిన తర్వాత సరిత ఇంట్లోనే ఉండి పనులు చేసుకుంటోంది. భర్త సంతోషన్ సడెన్ గా ఇంటికి వచ్చాడు. భార్యతో గొడవకు దిగాడు. ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. కొట్టుకునే స్థాయి వరకూ వెళ్లింది. ఆ సమయంలో సరిత బంధువు కూడా ఇంట్లోనే ఉంది.  భార్యాభర్తల మధ్య గొడవ ముదిరే సరికి గొడవ పడొద్దంటూ చెప్పింది. అంతలోనే సంతోష్ తన వద్ద ఉన్న కత్తి తీసి భార్య ప్రైవేట్ పార్ట్ లో పొడిచాడు. ఆపేందుకు సరిత బంధువు వెళ్తే... ఆమెపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో సరితకు తీవ్ర రక్త స్రావమై అక్కడికక్కడే చనిపోయింది.  

గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలింపు..

వీరందరి శబ్దాలు విని చుట్టు పక్కల వాళ్లు ఇంట్లోకి చేరారు. అప్పటికే సరిత రక్తపు మడుగలో పడి ఉండగా.. ఆమె బంధువు ఓ పక్కగా ఏడుస్తూ కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడు సంతోషన్ అరెస్ట్ చేశారు. సరిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అలాగే తీవ్రంగా గాయపడ్డ ఆమె బంధువును కూడా అదే ఆసుపత్రిలో చేర్చారు. అయితే భార్యపై అనుమానంతోనే సంతోష్ ఆమెను హత్య చేసినట్లు సరిత తల్లిదండ్రులు చెబుతున్నారు.

మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. దర్యాప్తు జరుపుతున్నామని కులుసుంపుర పోలీసులు చెబుతున్నారు. ప్రాథమిక విచారణలో సంతోష్ తన భార్యపై అనుమానంతోనే ఆమెను పొడిచి చంపినట్లు తేలిందని వివరించారు.

Published at : 15 Jul 2022 03:50 PM (IST) Tags: Murder case Hyderabad Latest Crime News Man Murdered His Wife Man Brutally Murdered His Wife Latest Murder in Hyderabad

సంబంధిత కథనాలు

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Annamayya District News : ఓ నిర్ణయం తీసుకుని ఇంటికి తిరిగి వస్తానని, ఇద్దరు పిల్లలతో వివాహిత సూసైడ్!

Mancherial News : ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

Mancherial News :  ప్రేమించిన యువతి కోసం యువకుడి పోరాటం, లవర్ ఇంటి ముందు నిరసన

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

జగిత్యాలలో మరో చిన్నారి కిడ్నాప్, అసలేమైందంటే?

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Mlc Anantababu : ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ఎట్టకేలకు ఛార్జ్ షీట్, 88 రోజుల తర్వాత

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

Crime News : బెదిరించడం కోసమే పెట్రోల్ కానీ తేడా కొట్టేసింది ! అంబర్ పేట కాలేజీలో జరిగింది ఇదే

టాప్ స్టోరీస్

TS Inter Board : హైదరాబాద్ లో విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

TS Inter Board : హైదరాబాద్ లో  విద్యార్థి ఆత్మహత్యాయత్నం, ఇంటర్ బోర్డు కీలక ఆదేశాలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

High Court Judges : హైకోర్టు జడ్జీలు ప్రభుత్వంపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారు, వెంకట్రామిరెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Namitha: కవల పిల్లలకు జన్మనిచ్చిన నటి నమిత, ఇదిగో వీడియో

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్'లో మెగాస్టార్ - సస్పెన్స్ అంటోన్న మణిరత్నం