అన్వేషించండి

కూర కోసం వెళ్లి, మహిళపై సమీప బంధువు అఘాయిత్యం!

Man Molested Woman: నల్లగొండ జిల్లాలో ఓ వివాహితపై సమీప బంధువు లైంగిక దాడి చేశాడు. కూర కోసం వెళ్లి ఒంటరిగా ఉండటంతో అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Man Molested Woman: రోజూ ఏదో ఒక చోట మహిళలు వేధింపులకు గురి అవుతూనే ఉన్నారు. చిన్నా, పెద్దా అనే తేడా చూపించడం లేదు. ఆడవాళ్లు అయితే చాలు వారిపై లైంగిక దాడి చేస్తున్నారు. ఇంటా బయటా ఎక్కడా ఆడవారికి రక్షణ లేకుండా పోతుంది. ఒంటరిగా బయటకు వెళ్లాలన్నా.. ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా.. భయపడాల్సిన దుస్థితి తలెత్తింది. ఏ కామాంధుడు ఏ రూపంలో దాడి చేస్తాడో తెలియని దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఎవరు ఎటు నుంచి వచ్చి లైంగికంగా వేధిస్తారో కనీసం ఊహించడం కూడా కష్టంగా మారింది. 

అదునుచూసి కాటేస్తున్న కామ నాగులు..

మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, అఘాయిత్యాల్లో ఎక్కువగా తెలిసిన వారే చేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. సమీప బంధువులు, మామయ్యలు, బాబాయిలు, మరిది, బావ, వరుస అయ్యే వారు, దూరపు చుట్టాలు, ముసలీ ముతకలు, ఆఖరికి సోదరులు అయ్యే వాళ్లు కూడా అయిన వారిపైనే తమ కామాన్ని తీర్చుకుంటున్నారు. మన వాళ్లే కదా అని ఇంట్లోకి రానివ్వడం.. చుట్టాలే కదా అని నీళ్లు, ఛాయ్ ఇవ్వడమే వారి పాలిట శాపంగా మారుతోంది. ఒంటరిగా ఉన్నప్పుడు అదను చూసి మీద పడుతున్నారు. మహిళలపై మృగాళ్లుగా వ్యవహరిస్తున్నారు. అమాయకులైన మహిళలపై అరాచకం చేస్తున్నారు. 

లైంగికదాడి చేసిన సమీప బంధువు..

ఇలాంటి ఘటనే నల్లగొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ వివాహితపై ఓ కామాంధుడు తన లైంగిక వాంఛ తీర్చుకున్నాడు. ఆమెను తీవ్రంగా కొట్టి తర్వాత అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వేములపల్లి మండల కేంద్రంలోని ఎన్ఎస్పీ కాలనీకి చెందిన ఓ వివాహిత ఈ నెల 13న మధ్యాహ్నం సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలోనే సమీప బంధువు గుండె బోయి సైదులు.. కూర కావాలని అడుగుతూ ఆమె ఇంట్లోకి వెళ్లాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉండటాన్ని చూసి అదే అదనుగా భావించాడు. కామంతో ఆ వివాహిత చేయి పట్టుకోబోయాడు. సమీప బంధువే చేయి పట్టుకుని అలా చేయడంతో ఆమె అతడి చర్యలకు ప్రతిఘటించింది. దీంతో కోపోద్రిక్తుడైన గుండె బోయిన సైదులు ఆమె కడుపులో బలంగా తన్నాడు. వివాహిత కింద పడగానే ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. 

పోలీసుల అదుపులో నిందితుడు!

బాధితురాలు కడుపు నొప్పితో బాధ పడుతూ కేకలు వేయగా.. పక్కింట్లోని మట్టమ్మ బాధితురాలి వద్దకు వెళ్లింది. రక్త స్రావంతో బాధపడుతున్న బాధితురాలిని చూసి ఆమె భర్తకు సమాచారం ఇచ్చింది. అనంతరం బాధితురాలు అయిన వివాహితను ఆటోలో మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో బాధిత మహిల ఆస్పత్రిలో నాలుగు రోజుల నుంచి చికిత్స పొందతూనే ఉంది. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి ఇంకా స్థిమిత పడలేదు. సాధారణ స్థితికి చేరుకోలేదు. శుక్రవారం బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది.

టాప్ హెడ్ లైన్స్

Raptadu Attack Case: రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
రాప్తాడు స్కూళ్లో దాడి కేసులో సంచలన నిజాలు.. పోలీసుల అదుపులో నిందితుడు
Raptadu Crime News: రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
రాప్తాడు జెడ్పీ స్కూల్లో దారుణం- టెన్త్ విద్యార్థినిపై రంపంతో దాడి.. తెగిన చెయ్యి, తీవ్ర గాయాలు
Illegal Surrogacy Network: పైకి ఉమెన్స్ హాస్టల్, లోపల ఐవీఎఫ్ సరోగసీ దందా.. బిహార్, బెంగాల్ గ్యాంగ్ అరెస్ట్!
పైకి ఉమెన్స్ హాస్టల్, లోపల ఐవీఎఫ్ సరోగసీ దందా.. బిహార్, బెంగాల్ గ్యాంగ్ అరెస్ట్!
Hyderabad Farmhouse Party: చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !
చేవెళ్లలో అమ్మాయిలతో విద్యార్థులు ఫామ్‌హౌస్ పార్టీ.. సడన్ ఎంట్రీతో షాకిచ్చిన పోలీసులు !

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
రాప్తాడు ఘటన: విద్యార్థులకు కౌన్సెలింగ్.. మానసిక ధైర్యం నింపేందుకు నారా లోకేష్ చర్యలు
YS Jagan Pulivendula: పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
పులివెందులలో వైఎస్ జగన్ హెలికాప్టర్ ల్యాండింగ్‌ వివాదం.. చివరకు దిగిన మాజీ సీఎం!
Mallanna Sagar Reservoir: మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్ మహేష్ క్లారిటీ
మల్లన్నసాగర్ వద్ద బ్లాస్టింగ్స్, నీటి లీకేజీ అవాస్తవం.. హరీశ్ రావు ఆరోపణలపై HMWS డైరెక్టర్
Telangana MLC Elections: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ కసరత్తు.. రేసులో ఉన్నది వీరే!
Andhra Pradesh Rains: ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
ఏపీలో 3 రోజులు వర్షాలు.. బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం- ఆదివారం తుపానుగా మారే అవకాశం
Samson -Sooryavanshi Swap: ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
ఐదో టీ20కి టీమిండియాలో మార్పులు..!! సంజు శాంసన్ ఔట్.. వైభవ్ సూర్యవంశీ రీఎంట్రీ..!
Iam Game Movie OTT : ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి వచ్చేస్తోన్న దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - అఫీషియల్ స్ట్రీమింగ్ డేట్... ఎందులో చూడొచ్చంటే?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
రామ్ లీలా ర్యాలీ: రాహుల్ జాతకం, గ్రహాలు మోదీకి కష్టాలు తెస్తాయా?
Embed widget