అన్వేషించండి

Aadhaar Forgery: ఇంట్లో ఇల్లాలు, ఫైవ్ స్టార్ హోటల్లో ప్రియురాలు..కానీ ఆధార్ మాత్రం ఇల్లాలిదే - ఆ భర్త అలా దొరికిపోయాడు!

Aadhaar Forgery: ముంబైలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయాలనుకున్న ఒక వ్యక్తి చేసిన అతి తెలివి పని అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. భార్య ఆధార్ కార్డును ఫోర్జరీ చేశాడు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భార్య ఆధార్ కార్డు ఫోర్జరీ చేసి ప్రియురాలితో హోటల్లో వ్యాపారవేత్త.
  • భార్య ఫిర్యాదుతో హోటల్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు.
  • గుర్తింపు కార్డులను ఫోర్జరీ చేయడం తీవ్రమైన నేరం: పోలీసులు.

Man Forges Wife Aadhaar Card For Girlfriend: మొబైల్ ఫోన్లు, ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చాక నేరస్థులు ఎన్ని తెలివితేటలు ప్రదర్శించినా ఏదో ఒక చోట దొరికిపోక తప్పదని ఈ ఘటన నిరూపిస్తోంది. ముంబైలోని ఒక విలాసవంతమైన హోటల్‌లో గర్ల్‌ఫ్రెండ్‌తో ఎంజాయ్ చేయాలనుకున్న ఒక వ్యక్తి చేసిన అతి తెలివి పని అతడిని కటకటాల వెనక్కి నెట్టింది. తన ప్రియురాలిని హోటల్‌లోకి తీసుకెళ్లడం కోసం తన భార్య ఆధార్ కార్డును ఫోర్జరీ చేసిన ఈ వ్యక్తి ఉదంతం ఇప్పుడు  హాట్ టాపిక్‌గా మారింది.

 అసలేం జరిగింది? 

ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త తన భార్యకు తెలియకుండా తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి జుహులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో గడిపేందుకు ప్లాన్ వేశాడు. హోటల్ చెక్-ఇన్ సమయంలో తప్పనిసరిగా గుర్తింపు కార్డు చూపించాల్సి ఉంటుంది. అయితే తన ప్రియురాలి ఒరిజినల్ ఐడెంటిటీ బయటపడకూడదని, ఆ వ్యక్తి తన భార్య ఆధార్ కార్డుపై ఉన్న ఫోటోను మార్చి, తన ప్రియురాలి ఫోటోను అక్కడ అతికించి ఫోర్జరీ చేశాడు. ఆ నకిలీ కార్డుతో హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నాడు.

 దొరికిపోయిందిలా.. 

నిందితుడి భార్యకు తన భర్త ప్రవర్తనపై గత కొంతకాలంగా అనుమానం ఉంది. ఆమె తన భర్త కారుకు ముందే ఒక  జీపీఎస్ ట్రాకర్‌ను అమర్చింది. తన భర్త జుహులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో ఉన్నట్లు జీపీఎస్ ద్వారా తెలుసుకున్న ఆమె, వెంటనే అక్కడికి చేరుకుంది. హోటల్ రిసెప్షనిస్ట్‌ను అడిగి తన భర్త ఏ పేరుతో గది బుక్ చేశాడో ఆరా తీసింది. అక్కడ తన పేరుతోనే కానీ వేరే ఫోటోతో  ఆధార్ కార్డు సమర్పించి ఉండటం చూసి ఆమె షాక్‌కు గురైంది.

 పోలీసుల ఎంట్రీ - అసలు రంగు బయటపడింది 

భర్త మోసాన్ని గమనించిన భార్య వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు హోటల్‌కు చేరుకుని నిందితుడిని, అతడి ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. హోటల్ రికార్డులను తనిఖీ చేయగా, ఆధార్ కార్డులోని వివరాలు భార్యవి కాగా, ఫోటో మాత్రం ప్రియురాలిది అని తేలింది. ప్రభుత్వ గుర్తింపు కార్డును ఫోర్జరీ చేయడం, మోసపూరితంగా వ్యవహరించడం వంటి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.                                     
  
ప్రభుత్వ గుర్తింపు కార్డులను, ముఖ్యంగా ఆధార్ వంటి సెన్సిటివ్ డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేయడం లేదా ఫోర్జరీ చేయడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కేవలం వ్యక్తిగత అవసరాల కోసం లేదా వివాహేతర సంబంధాల కోసం ఇలాంటి పనులు చేస్తే ఐటీ చట్టం మరియు ఐపిసి సెక్షన్ల ప్రకారం కఠినమైన జైలు శిక్ష తప్పదని ఈ ఘటన గుర్తు చేస్తోంది. ప్రస్తుతం నిందితుడు పోలీసుల కస్టడీలో ఉండగా, హోటల్ యాజమాన్యం కూడా ఐడీ కార్డుల వెరిఫికేషన్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. 

Frequently Asked Questions

గర్ల్‌ఫ్రెండ్‌తో హోటల్‌లో ఉండటానికి ఆ వ్యక్తి ఏం చేశాడు?

ఆ వ్యాపారవేత్త తన భార్య ఆధార్ కార్డుపై ఫోటో మార్చి, తన గర్ల్‌ఫ్రెండ్‌ ఫోటోను అతికించి నకిలీ ఆధార్ కార్డును తయారు చేశాడు. దానితో హోటల్‌లో గదిని బుక్ చేసుకున్నాడు.

ఆ వ్యక్తి ఎలా దొరికిపోయాడు?

ఆ వ్యక్తి భార్య తన భర్త కారుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చింది. దాని ద్వారా భర్త హోటల్‌లో ఉన్నాడని తెలుసుకుని, అక్కడకు వెళ్లి నకిలీ ఆధార్ కార్డును చూసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

నకిలీ ఆధార్ కార్డు తయారు చేయడం చట్టరీత్యా నేరమా?

అవును, ప్రభుత్వ గుర్తింపు కార్డులను, ముఖ్యంగా ఆధార్ వంటి సెన్సిటివ్ డాక్యుమెంట్లను ట్యాంపరింగ్ చేయడం లేదా ఫోర్జరీ చేయడం తీవ్రమైన నేరం. దీనికి ఐటీ చట్టం మరియు ఐపిసి సెక్షన్ల ప్రకారం కఠినమైన శిక్షలుంటాయి.

ఈ కేసులో పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు?

పోలీసులు నిందితుడిని, అతని గర్ల్‌ఫ్రెండ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వ గుర్తింపు కార్డును ఫోర్జరీ చేయడం, మోసపూరితంగా వ్యవహరించడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Darshan Case : లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
లోదుస్తుల్లో కారుకు వేలాడదీశారు - ఛాతీపై కాలితో తన్నారు... నటుడు దర్శన్ అభిమాని హత్య కేసులో సంచలనం
Minor Girls Assault Case: గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
గురుకుల విద్యార్థినులపై అత్యాచారం.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
Anantapur Road Accident: ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
ఢీకొని బ్రిడ్జిపై నుంచి పడిన ట్రావెల్స్ బస్సు, ఐషర్.. 20 మందికి గాయాలు
Pruthvishwar Reddy: లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
లైంగిక వేధింపుల కేసు.. TBA జనరల్ సెక్రటరీ పృథ్వీశ్వర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు
Advertisement

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
తెలంగాణ ఓటర్ల జాబితా నుంచి భారీగా ఓట్లు గల్లంతు! టాప్‌లో హైదరాబాద్! పేరు లేకపోతే ఏం చేయాలి?
Prakash Raj: బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
బెంగళూరు ఓటర్ల జాబితా నుంచి ప్రకాష్‌రాజ్ పేరు తొలగింపు! గేమ్‌ ఆన్ అంటూ నటుడి రియాక్షన్ వైరల్!
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
పులిహోర అనే పదం ఎలా వచ్చింది? చరిత్ర, ఆరోగ్యం, ఆధ్యాత్మికత కలసిన దివ్య ప్రసాదం గురించి ఈ విషయాలు తెలుసా?
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
17 కేజీల బరువు తగ్గితే.. రెండేళ్ల తర్వాత మళ్లీ ఛాన్స్
Toxic: టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
టాక్సిక్ ఐమ్యాక్స్ రిలీజ్... కన్నడ హీరోల్లో యశ్ రేర్ రికార్డు
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
వరుస గాయాలపై BCCI ఫైర్ లక్ష్మణ్ సీక్రెట్ మీటింగ్
Kiran Abbavaram: అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
అబ్బవరం ఫ్యామిలీ టూర్... కొడుకు, భార్యతో కిరణ్ ఫోటోలు
Rahul Sipligunj: విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
విశాఖలో రాహుల్ సిప్లిగంజ్‌పై ఎఫ్‌ఐఆర్... బావమరిది కోసం యువతిని బెదిరించాడా?
Embed widget