అన్వేషించండి

RoboCop: విశాఖ స్టేషన్‌లో ఏఐ అర్జునుడి గురి - నిముషాల్లో దొరికిపోయిన హార్డ్‌కోర్ నేరగాళ్లు!

RoboCop SC Arjun: విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో నేరగాళ్ల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది ఏఐ రోబో కాప్ ASC అర్జున్. ఇద్దరు మోస్ట్ వాంటెడ్ స్టేషన్ లో ఉన్నారని తెలుసుకుని మరీ పట్టిచ్చేసింది.

AI Powered Rail RoboCop SC Arjun:  టెక్నాలజీ తోడైతే నేరగాళ్లకు తప్పించుకోవడం అసాధ్యమని విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో ఏఐ పవర్డ్ రోబో కాప్ ASC అర్జున్ నిరూపించింది. సోమవారం రాత్రి ఎనిమిది గంటల సమయం.. స్టేషన్ ఎప్పటిలాగే ప్రయాణికులతో కిక్కిరిసి ఉంది. సరిగ్గా అదే సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న అర్జున్ రోబో, అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని స్కాన్ చేసింది. కేవలం సెకన్ల వ్యవధిలోనే తన డేటాబేస్‌లో ఉన్న పాత నేరస్థుల ఫోటోలతో సరిపోల్చి, అతను  హార్డ్‌కోర్ క్రిమినల్  అని గుర్తిస్తూ ఆర్‌పీఎఫ్  కంట్రోల్ రూమ్‌కు అలర్ట్ పంపింది.

సెకన్ల వ్యవధిలో అలర్ట్.. మెరుపు వేగంతో వేట 

రోబో నుంచి సిగ్నల్ రాగానే  డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్ నారాయణ లైవ్ సీసీటీవీ ఫీడ్‌ను విశ్లేషించారు. వెంటనే సబ్ ఇన్‌స్పెక్టర్ కీర్తి రెడ్డి నేతృత్వంలోని క్రైమ్ ప్రివెన్షన్ టీమ్‌ను అప్రమత్తం చేశారు. రోబో ఇచ్చిన స్పష్టమైన సమాచారంతో పోలీసులు స్టేషన్ ఎంట్రీ పాయింట్ వద్దే నిందితుడు హడప శివ, అతని అనుచరుడు జి. బంగారును చుట్టుముట్టారు. ఎలాంటి ప్రయాణ టిక్కెట్లు లేకుండా, దొంగతనానికి పథకం వేసి స్టేషన్‌లో అడుగుపెట్టిన ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

నేర చరిత్ర చూసి పోలీసులే షాక్

పట్టుబడిన వారిని విచారించగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వీరిద్దరూ సామాన్యమైన దొంగలు కాదు.. రాయగడ పోలీస్ స్టేషన్ పరిధిలో హత్యలు, దోపిడీలు, డెకాయిటీలు , ఆయుధాల అక్రమ రవాణా వంటి అనేక తీవ్రమైన కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు తేలింది. రైలు ప్రయాణికులే లక్ష్యంగా స్టేషన్లోకి ప్రవేశించిన ఈ  ముఠా’ పనిని ఏఐ రోబో ఆరంభంలోనే పసిగట్టి కటకటాల వెనుకకు పంపింది. 

 ప్రయాణికుల భద్రతకు ఏఐ శ్రీరామరక్ష

ఈ ఘనతపై వాల్తేరు డివిజన్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా హర్షం వ్యక్తం చేశారు. కిక్కిరిసిన బహిరంగ ప్రదేశాల్లో కూడా నేరగాళ్లను క్షణాల్లో గుర్తించడంలో ఏఐ టెక్నాలజీ ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ సంఘటన నిరూపించిందన్నారు. రోబో అర్జున్ ఇప్పుడు ప్రయాణికులకు ఒక భరోసాలా మారిందని, భవిష్యత్తులో రైల్వే భద్రతలో ఇలాంటి అత్యాధునిక సాంకేతికతను మరింతగా ఉపయోగించనున్నట్లు ఆయన తెలిపారు. 

టాప్ హెడ్ లైన్స్

Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Adilabad Fake Aadhaar Certificate Gang Arreste: ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
ఆదిలాబాద్‌లో ఘరానా నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు - ఐదుగురు కేటుగాళ్లు అరెస్ట్!
Adilabad Bangladesh Illegal Burglar Gang Arrest: దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
దేశంలోకి అక్రమంగా చొరబడటమే కాకుండా దోపిడీలు కూడా చేస్తున్నారు - బంగ్లా గ్యాంగ్ ను అరెస్టు చేసిన ఆదిలాబాద్ పోలీసులు
Krishna Crime: కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం
కృష్ణాజిల్లా ఎక్సైజ్ కానిస్టేబుల్ వేధింపులు- ఉయ్యూరులో దంపతుల ఆత్మహత్యాయత్నం

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget