అన్వేషించండి

Aqua industry: ఆక్వా రంగానికి మేలు - అమెరికా టారిఫ్‌ల తగ్గింపుపై ఏపీ ప్రభుత్వం హర్షం

India-US trade deal: అమెరికాతో ట్రేడ్ డీల్ కురదడం ఏపీ అక్వా పరిశ్రమకు ఎంతో మేలు చేస్తోంది. గతంలో టారిఫ్‌లు పెరగడం వల్ల ..ఎగుమతులు తగ్గిపోయాయి.

Aqua industry to get relief from India-US trade deal: అమెరికా , భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదరడంతో  భారతీయ సముద్ర ఆహార ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు కూడా తగ్గుతాయని  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు.   టారిఫ్‌ను 25 శాతం నుంచి 18 శాతానికి  తగ్గడం వల్ల రైతులకు మేలు జరుగుతుందన్నారు.  భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని ఆక్వా రంగానికి, ఎగుమతిదారులకు పెద్ద ఊరటనిస్తుందని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గతంలో పెరిగిన సుంకాల కారణంగా అమెరికాకు జరిగే ఎగుమతులు సుమారు 15 శాతం తగ్గిపోయాయని, తాజా తగ్గింపుతో నిలిచిపోయిన ఆర్డర్లు తిరిగి ప్రారంభమై ఎగుమతులు పుంజుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ముఖ్యంగా అమెరికాకు ఎగుమతి అయ్యే ఫ్రోజెన్ ష్రింప్ ఎగుమతులు రాబోయే నెలల్లో 10 నుంచి 15 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని మంత్రి వివరించారు. టారిఫ్ భారం తగ్గడం వల్ల సముద్ర ఆహార ప్రాసెసింగ్ రంగంలో లాభాల మార్జిన్ 5 శాతం నుంచి తిరిగి 8 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. దీనికి తోడు కేంద్ర బడ్జెట్-2026లో ఆక్వా రంగానికి అవసరమైన ఇన్‌పుట్స్‌పై కల్పించిన డ్యూటీ రాయితీలు ఈ రంగానికి అదనపు బలాన్ని ఇస్తాయని ఆయన వెల్లడించారు.                                     

కేవలం అమెరికాపైనే కాకుండా.. యూరోపియన్ యూనియన్, చైనా, వియత్నాం, రష్యా వంటి ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు కూడా భారతీయ ఎగుమతులు స్థిరంగా కొనసాగుతున్నాయని అచ్చెన్నాయుడు తెలిపారు. 2025-26 తొలి నాళ్లలో ష్రింప్ ఎగుమతుల్లో అమెరికేతర మార్కెట్ల వాటా 57 శాతానికి చేరడం గమనార్హమన్నారు. మార్కెట్ విభిన్నీకరణ ద్వారా భారతీయ ఆక్వా ఉత్పత్తుల పోటీ తత్వం అంతర్జాతీయ స్థాయిలో మెరుగుపడుతోందని ఆయన విశ్లేషించారు.                                               

దేశంలోనే సముద్ర ఆహార ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఈ పరిణామాలు వరంగా మారుతాయని మంత్రి స్పష్టం చేశారు. ఎగుమతులు పునరుద్ధరించబడటం వల్ల రాష్ట్రంలోని వేలాది మంది ఆక్వా రైతులు, మత్స్యకారుల ఆదాయం స్థిరపడుతుందని, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా సముద్ర ఆహార ఎగుమతులు 15 లక్షల మెట్రిక్ టన్నుల మార్కును చేరుకోవచ్చని ఎంపీఈడీఏ (MPEDA) అంచనా వేస్తోందని ఆయన వివరించారు.          

టాప్ హెడ్ లైన్స్

Breaking News: నేడు మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ రైతు సదస్సు
నేడు మంచిర్యాల జిల్లాలో కేటీఆర్ పర్యటన.. లక్షెట్టిపేటలో బీఆర్ఎస్ రైతు సదస్సు
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Trainee IPS Uday Krishna Reddy: ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్
ట్రైనీ ఐపీఎస్‌ లైంగిక వేధింపుల కేసు.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నంలో మరో ట్విస్ట్, అంతా డ్రామానే!
Warangal Airport: వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
వరంగల్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. రూ.496.86 కోట్లతో అభివృద్ధికి ఏఏఐ ఆమోదం
CM Vijay WhatsApp Bribe Buster: సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
సినిమాల్ని తలపించే వాట్సాప్ గుడ్ గవర్నెన్స్ - తమిళనాడులో సీఎం విజయ్ యాంటీ కరప్షన్ వ్యూహం నిలబడుతుందా?
Assembly Seats Increase: డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
డీలిమిటేషన్ పార్లమెంట్‌కేనా.. అసెంబ్లీలకూ పెరుగుతాయా? తెలుగు రాష్ట్రాల్లో సీట్ల పెంపు గ్యారంటీ ఎంత?
Rains In AP and Telangana: తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
తెలంగాణలో పలు జిల్లాలకు వర్ష సూచన.. ఏపీలో ఈ జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం
రూ.6 లక్షల లోపే మంచి ఫ్యామిలీ SUV - మన దేశంలో 8 లక్షల మంది ఎంపిక చేసుకున్న కారు
8 లక్షల మంది కొన్న ఫ్యామిలీ SUV, యూత్‌కీ ఇష్టమే - రేటు కూడా రూ.5.70 లక్షలే!
Hyderabad CURE Housing Scheme: హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
హైదరాబాద్ పేదలకు బిగ్ ఆఫర్ - CURE పరిధిలో పేదలకు లక్షణ ఇళ్లు - ఇవిగో అర్హతలు
Embed widget