భారతదేశం అమెరికాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా, భారతీయ వస్తువులపై అమెరికా విధించిన సుంకాలను 25% నుండి 18%కి తగ్గించింది. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని 2030 నాటికి 191 బిలియన్ డాలర్ల నుండి 500 బిలియన్ డాలర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది.
India-US Trade Deal: ప్రపంచ ఆర్థిక వేదికపై భారత్ పెను సంచలనం; ఒకే ఏడాదిలో ఐదు మెగా డీల్స్‌తో సరికొత్త చరిత్ర!
India-US Trade Deal: అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించడంతో భారతదేశం సరికొత్త ఆర్థిక చరిత్ర సృష్టించింది. ప్రపంచ GDPలో సగానికిపైగా ఉన్న దేశాలతో డీల్స్ చేసుకొని మరో మైలురాయిని అందుకుంది.

India-US Trade Deal: భారత ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ స్థాయిలో ఒక నూతన శకాన్ని ఆరంభించింది. ప్రపంచవ్యాప్తంగా అగ్రగామి దేశాలతో వరుసగా కుదుర్చుకుంటున్న వాణిజ్య ఒప్పందాలతో భారత్ తన ఆర్థిక వ్యూహాన్ని పూర్తిగా మార్చేస్తోంది. ముఖ్యంగా అమెరికాతో కుదిరిన తాజా చారిత్రక వాణిజ్య ఒప్పందం భారత్ ఆర్థిక చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోనుంది. ప్రపంచ స్థూల దేశీయ ఉత్పత్తిలో సగానికి పైగా వాటా కలిగిన దేశాలతో భారత్ ప్రస్తుతం వాణిజ్య బంధాలను కలిగి ఉండటం ఇక్కడ గుర్తించాల్సిన విషయం. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే రెండు కీలకమైన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు చేయడం ద్వారా దేశం తన వ్యూహాత్మక దౌత్యాన్ని అనుసరిస్తోంది.
అమెరికాతో చారిత్రక స్నేహం- తగ్గిన సుంకాలు
గత కొంతకాలంగా భారత్ అమెరికా మధ్య నెలకున్న వాణిజ్యపరమైన ఉద్రిక్తతలకు బైబై చెప్పి, సోమవారం అర్థరాత్రి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడిన అనంతరం భారతీయ వస్తువులపై విధిస్తున్న టారిఫ్‌లను 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. ఇది భారత ఎగుమతిదారులకు భారీ ఊరటనిచ్చే అంశం.
దీంతోపాటు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిఫలంగా అమెరికా భారత్‌పై విధించిన అదనపు 25 శాతం టారిఫ్‌ను కూడా తొలగిస్తున్నట్టు సమాచారం. అమెరికా ప్రస్తుతం భారత్‌కు అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గత ఆర్థిక సంవత్సరం లెక్కల ప్రకారం, భారత్ చేసే మొత్తం ఎగుమతులలో సుమారు 20 శాతం వాటా ఒక్క అమెరికాదే ఈ ఒప్పందంతో 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రస్తుతం ఉన్న 191 బిలియన్ డాలర్ల నుంచి 500 బిలియన్ డాలర్లకు చేర్చాలని ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.
ఏడాదిలో ఐదు కీలక ఒప్పందాలు
భారత్ వాణిజ్య శాఖ గడిచిన 12 నెలల్లో అత్యంత చురుగ్గా వ్యవహరించింది. అమెరికాతో కుదిరిన తాజా ఒప్పందానికి కొద్ది రోజుల ముందే భారత్, యూరోపియన్ యూనియన్‌తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్‌పై సంతకాలు చేసింది. ఒకే సంవత్సరంలో ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక శక్తులతో కుదుర్చుకోవడం భారత ఆర్థిక చరిత్రలో ఇదే తొలిసారి.
వీటితోపాటు బ్రిటన్, ఓమన్, న్యూజిలాండ్‌తో కూడా భారత్ వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకుంది. ఈ ఐదు దేశాలు సహా భారత్‌కు చెందిన మొత్తం జీడీపీని లెక్కిస్తే అది ప్రపంచ మొత్తం జీడీపీలో సుమారు 50 నుంచి 55 శాతం వరకు ఉంటుంది. కేవలం భారత్, యూరోపియన్ యూనియన్ వాటానే ప్రపంచ జీడీపీలో 25 శాతంగా ఉంది. గణాంకాలు అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ ఎదుగుతున్న శక్తిని స్పష్టం చేస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ పైచేయి
అమెరికాతో కుదిరిన ఈ ఒప్పందం భారత్‌కు పొరుగు దేశాలైన బంగ్లాదేశ్ వియత్నాం, థాయ్‌లాండ్‌లతో పోలిస్తే గొప్ప పోటీతత్వాన్ని కల్పించనుంది. ప్రస్తుతం అమెరికా విధించిన కొత్త నిబంధనల ప్రకారం... బంగ్లాదేశ్‌పై 20 శాతం, వియత్నాం 20 శాతం, థాయిలాండ్‌పై 19 శాతం టారిఫ్‌లు ఉన్నాయి. కానీ భారత్‌కు ఇది కేవలం 18 శాతానికి తగ్గడం వల్ల అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువుల ధరలు తగ్గి గిరాకీ పెరిగే అవకాశం ఉంది.
ఫ్యూచర్‌లో ఏం జరగనుంది
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, యూరోపియన్ యూనియన్ ద్వితీయ స్థానంలో ఉంది. భారత్ ఇప్పటికే ప్రపంచంలో నాల్గో అతి పెద్ద ఆర్ధికవ్యవస్థగా ఉంది. బ్రిట్ కూడా టాప్ -5 ఆర్థిక వ్యవస్థల జాబితాలో కొనసాగుతోంది. ఈ ప్రభావవంతమైన ఆర్థిక శక్తులన్నీ ఇప్పుడు భారత్‌తో దృఢమైన వాణిజ్య బంధాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచ మొత్తం వాణిజ్యంలో ఈ కూటమి వాటా 38 నుంచి 40 శాతం వరకు ఉన్నట్టు లెక్కలు చూస్తున్నాయి.
ఇవే కాకుండా, భారత్ ఇప్పటికే జపాన్, దక్షిణ కొరియా, ఆసియాన్ దేశాలు, సార్క్ దేశాలు, మారిషస్, యూఏఈ , ఆస్ట్రేలియా వంటి దేశాలతో ప్రాంతీయ, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను కలిగి ఉంది. తాజా ఒప్పందాలతో భారత తయారీ రంగం సేవా రంగానికి అంతర్జాతీయ మార్కెట్లు భారీగా అందుబాటులోకి రానున్నాయి.
భారత్ తన వాణిజ్య విధానాల్లో చూపిస్తున్న ఈ దూకుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. చైనా వంటి దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న పాశ్చాత్య దేశాలకు భారత్ ఇప్పుడు ఒక నమ్మకమైన, బలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. సుంకాల తగ్గింపు వ్యూహాత్మక భాగస్వామ్యాలు, స్థిరమైన ఆర్థిక వృద్ధి భారత్‌ను త్వరలోనే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహం లేదని నిపుణులు అంటున్నారు.
Frequently Asked Questions
భారతదేశం అమెరికాతో వాణిజ్య ఒప్పందం ద్వారా ఏమి సాధించింది?
ఒక సంవత్సరంలో భారత్ ఎన్ని కీలక అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది?
గత 12 నెలల్లో, భారతదేశం అమెరికా మరియు యూరోపియన్ యూనియన్‌తో పాటు బ్రిటన్, ఒమన్, న్యూజిలాండ్‌తో కూడా కీలక వాణిజ్య ఒప్పందాలను పూర్తి చేసుకుంది. ఒకే సంవత్సరంలో ప్రపంచంలోని రెండు అతి పెద్ద ఆర్థిక శక్తులతో ఒప్పందాలు చేసుకోవడం ఇది తొలిసారి.
ఈ కొత్త వాణిజ్య ఒప్పందాలు భారతీయ వస్తువులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి?
అమెరికాతో కుదిరిన ఒప్పందం వల్ల భారతదేశంపై విధించిన సుంకాలు తగ్గడంతో, అమెరికా మార్కెట్‌లో భారతీయ వస్తువుల ధరలు తగ్గుతాయి. దీనివల్ల భారతీయ వస్తువులకు గిరాకీ పెరిగి, వియత్నాం, థాయ్‌లాండ్ వంటి దేశాలతో పోలిస్తే భారతదేశానికి పోటీతత్వం పెరుగుతుంది.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రస్తుతం ఏ స్థానంలో ఉంది?
ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా మొదటి స్థానంలో, యూరోపియన్ యూనియన్ రెండవ స్థానంలో ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది, మరియు బ్రిటన్ కూడా టాప్-5 ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా కొనసాగుతోంది.






















