By: ABP Desam | Updated at : 29 May 2023 01:54 PM (IST)
Edited By: jyothi
కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య ( Image Source : Pixabay )
Kurnool News: పిల్లలిద్దరూ సెటిలయ్యారు. అయినా సరే తల్లిదండ్రుల సంపాదనపై ఆశ. అదే ఆ తల్లి ఎవరూ చేయని పని చేసేలా చేసింది. భర్త చనిపోయిన విషయం ఎవరికీ తెలియకుండా ఇంట్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించేలా ప్రేరేపించింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. విచారణ జరపగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణానికి చెందిన 60 ఏళ్ల పోతుగంటి హరికృష్ణ ప్రసాద్, లలిత భార్యాభర్తలు. వీరిద్దరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు దినేశ్ కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పని చేస్తుండగా.. చిన్న కుమారుడు కెనడాలో స్థిరపడ్డాడు. ఇంటివద్దే ఉంటూ జీవనం సాగిస్తున్న దంపతులు మెడికల్ షాపు నిర్వహిస్తున్నారు. అయితే సోమవారం ఉదంయ హరికృష్ణ ప్రసాద్ ఇంటి నుంచి పొగలు రావడాన్ని గమనించిన కాలనీ వాసులు... స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేశ్వర్లు వెంటనే సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వచ్చారు. ఇంట్లో ఉన్న లలితను విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
లలిత భర్త హరికృష్ణ ప్రసాద్ అనారోగ్ంతో సోమవారం ఉదయం కన్నుమూశారు. అది గమనించిన లలిత ఆ విషయాన్ని ఎవరికీ చెప్పకుండా.. ఇంట్లోనే అంతిమ సంస్కారాలు నిర్వహించాలనుకుంది. వెంటనే పెట్రోల్ పోసి నిప్పంటించేసింది. అయితే తమను కుమారులు సరిగ్గా చూసుకోవడం లేదని.. ఆస్తి కోసం మాత్రం వాళ్లు తమ వద్దకు వస్తున్నారని లలిత చెబుతోంది. భర్త చనిపోయిన విషయం తెలిస్తే ఎక్కడ వచ్చి ఆస్తి పంపించవమంటారోనన్న భయంతోనే ఈ పని చేసినట్లు లలిత వివరించిందని పోలీసులు చెబుతున్నారు.
Woman Fraud: కాబోయే భార్యే కదా అని నమ్మితే ఊహించని ట్విస్ట్! బాధితుడు లబోదిబో
Varalaxmi Tiffin Center Drugs Case: వరలక్ష్మీ టిఫిన్ సెంటర్ యజమానితో అనురాధ ప్రేమాయణం, అతడి కోసమే డ్రగ్స్ దందా
Adilabad: భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య, మరోఘటనలో చెంపపై కొట్టి హత్య!
Nalgonda: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం- బైక్, కారు ఢీకొని ఐదుగురు మృతి
Telangana: అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తి అరెస్ట్ - బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న పోలీసులు
Purandeshwari: వైన్ షాప్‌లోనికి వెళ్లి పురందేశ్వరి ఆకస్మిక తనిఖీలు - కీలక విషయాలు బయటపెట్టి ఆందోళన
Motorola Edge 40 Neo: కిల్లర్ ఫోన్ లాంచ్ చేసిన మోటొరోలా - రూ.20 వేలలో వావ్ అనిపించే ఫీచర్లు!
TTD News: కమనీయం శ్రీవారి బ్రహ్మోత్సవ వైభవం, గరుడ సేవకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
Hyundai Alcazar Facelift: హ్యుందాయ్ అల్కజార్‌ను అప్‌డేట్ చేయనున్న కంపెనీ - ధర ఎంత ఉండవచ్చు? ఏం మారుతుంది?
/body>