News
News
వీడియోలు ఆటలు
X

Kurnool Crime News: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య - మద్యం తాగించి, రైలు పట్టాలపై పడుకోబెట్టి!

Kurnool Crime News: ప్రియుడితో కలిసి కట్టుకున్న వాడినే కడతేర్చిందో ఇల్లాలు. ముందుగా ఫుల్లుగా మద్యం తాగించి.. రైలు వచ్చే ముందు రైలు పట్టాలపై పడుకోబెట్టి హత్య చేశారు. 

FOLLOW US: 
Share:

Kurnool Crime News: అసలే అతడికి భార్యపై అనుమానం. ఎలాగూ అనుమాన పడుతున్నాడని..  ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త వేధింపులు మరింత అధికం అయ్యాయి. దీంతో విసిగి వేసారిన భార్య ప్రియుడితో కలిసి భర్త హత్యకు ప్లాన్ చేసింది. పథకం ప్రకారం ఫుల్లుగా మద్యం తాగించి రైలు వచ్చే ముందు రైలు పట్టాలపై పడుకోబెట్టారు. ఈ క్రమంలోనే అతడి తల పూర్తిగా పగిలిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. ఈ తర్వాత ఏమీ తెలియనట్లు భర్త కనిపించడం లేదని పోలీసులకు సమాచారం అందించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. 

అసలేం జరిగిందంటే..?

కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన 35 ఏళ్ల ఉప్పర నారాయణ కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతడికి భార్య వరలక్ష్మి కూడా ఉంది. అయితే కొంతకాలం నుంచి నారాయణ భార్య వరలక్ష్మిని అనుమానిస్తున్నాడు. ఈ క్రమంలోనే రోజూ ఫుల్లుగా మద్యం తాగి వచ్చి భార్యను శారీరకంగా, మానసికంగా హింసించేవాడు. అయితే భర్త వేధింపులు తాళలేని ఆమె.. సి.బెళగల్ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన చిన్న గోవిందుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తరచుగా అతడిని కలిసి తన సమస్యలు చెప్పుకునేది. అయితే భర్త వేధింపులు ఆగాలంటే అతడిని హత్య చేయడం ఒక్కటే దారి అని.. అతడితో కలిసి ప్లాన్ చేసింది. పథకం ప్రకారం చిన్న గోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకెళ్లాడు. ఫుల్లుగా మద్యం తాగించాడు. అనతరం అతడిని తీసుకెళ్లి రైలు పట్టాలపై పడుకో బెట్టాడు. 

ఈ క్రమంలోనే అతడి పైనుంచి రైలు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నారాయణ తల పగిలిపోయింది. తీవ్ర గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. చిన్నగోవిందు ఈ విషయాన్ని వరలక్ష్మికి ఫోన్ చేసి చెప్పాడు. మరుసటి రోజు అంటే గతేడాది జూన్ 30వ తేదీ తన భర్త కనిపించడం లేదని వరలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వరలక్ష్మిపై కాస్త అనుమానం రావడంతో.. ఆమె సెల్ ఫోన్ కాల్స్ వివరాల ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు. భార్య వరలక్ష్మితో పాటు చిన్న గోవిందును గట్టిగా ప్రశ్నించగా.. తామే ఈ హత్య చేసినట్లు వెల్లడించారు. అయితే అనుమానంతో తాగొచ్చి వేధించడం వల్లే తాను భర్తను చంపాల్సి వచ్చినట్లు వరలక్ష్మి తెలిపింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులు ఇద్దర్నీ అరెస్ట్ చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరు పరిచారు. 

ఇటీవల చిత్తూరులో ఇలాంటి ఘటనే..

చిత్తూరు డీఎస్పీ శ్రీనివాస మూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నగరంలోని కొంగారెడ్డిపల్లె, విద్యానగర్ లోని ఓ అపార్ట్మెంట్లో ఢిల్లీ బాబు(48), అతని భార్య హేమలత(45)లు నివాసం ఉంటున్నారు. అయితే ఢిల్లీబాబు.. నెల్లూరు మండలంలోని గాండ్లపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడుగా పని చేస్తున్నాడు. హేమలత కొంగారెడ్డిలోని ఆర్కే మోడల్ స్కూల్ ప్రైవేట్ స్కూల్ లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలుగా ముగ్గురు కుమారులు ఉన్నారు. అయితే కొడుకులను ఉన్నత చదువులు చదివిస్తూ ఇంత కాలం వీరు హాయిగా జీవించారు. అయితే గత కొంత కాలంగా భార్య హేమలతపై ఢిల్లీ బాబు అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఆమెతో తరచుగా గొడవ పడుతున్నాడు. చిన్న చిన్న కారణాలకే భార్యను నోటికి వచ్చినట్లు దూషిస్తూ.. చిత్రహింసలు పెడుతున్నాడు. ఎవరితో మాట్లాడినా వారితో భార్యకు అక్రమ సంబంధాన్ని అంటగట్టేవాడు ఢిల్లీబాబు.

హేమలత పని చేసే ప్రైవేటు స్కూల్ వద్ద కాపు కాసి మరీ ఆమెను మానసికంగా వేధించేవాడు. ఈ క్రమంలోనే ఇద్దరి‌ మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో భార్యపై కక్ష పెంచుకున్న ఢిల్లిబాబు భార్యను హత్య చేసేందుకు పక్కాగా ప్లాన్ వేశాడు. అనుకున్న ప్లాన్ ప్రకారం శుక్రవారం సాయంత్రం ముగ్గురు కుమారులను బంధువుల ఇంటికి పంపాడు. ఆ తర్వాత భార్యపై కత్తితో దాడి చేసి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టులాడుతున్న భార్య చనిపోయేవరకు చూస్తూ పైశాచిక ఆనందం పొందిన ఢిల్లీ బాబు ఆతర్వాత తన మొబైల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసి పరార్ అయ్యాడు. అయితే శనివారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోయే సరికి అనుమానం వచ్చిన అపార్మెంట్ వాసులు వీరి ఇంట్లోకి వచ్చి చూశారు.

చనిపోయి రక్తపుమడుగులో పడి ఉన్న హేమలతను చూసి భయపడిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం హేమలత మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు ఢిల్లీ బాబు కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ శ్రీనివాస మూర్తి వెల్లడించారు. అయితే తల్లి హత్య వార్త తెలుసుకున్న కుమారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అనవసరంగా అనుమానం పెంచుకున్న తండ్రి.. తమకు అమ్మ లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

Published at : 10 Apr 2023 04:09 PM (IST) Tags: AP News Crime Wife kills husband wife murdered husband Kurnool

సంబంధిత కథనాలు

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: వెల్లివిరిసిన మానవత్వం - రైలుప్రమాద బాధితులకు రక్తమిచ్చేందుకు క్యూ కట్టిన యువకులు !

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Coromandel Express Accident: ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొనడంతో 70 మందికి పైగా మృతి! - ఒక్కో కుటుంబానికి రూ.12 లక్షల పరిహారం

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: పట్టాలు తప్పిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ- రైల్వే మంత్రికి ఫోన్!

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Odisha Train Accident: 50 అంబులెన్సులు కూడా సరిపోలేదు! మమతా బెనర్జీ దిగ్భ్రాంతి- Helpline Numbers ఇవీ

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం

టాప్ స్టోరీస్

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగింది? సమాచార లోపమే ప్రాణాలు తీసిందా?

Coromandel Express Accident: ఒడిశా రైలు ప్రమాదం ఎలా జరిగింది? సమాచార లోపమే ప్రాణాలు తీసిందా?

Coromandel Train Accident : ఒడిశా ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Coromandel Train Accident : ఒడిశా  ప్రమాద మృతుల్లో తెలుగు ప్రయాణికులు- బాధితుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్లు ఏర్పాటు

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Assembly Elections: తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి - కీలక ఆదేశాలు ఇచ్చిన ఈసీ

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు- నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!

Chandra Babu Delhi Tour: ఈ సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు-  నేడు అమిత్‌షాతో రేపు ప్రధానితో సమావేశం!