News
News
X

Konaseema Crime : బాలికపై లైంగిక దాడి, న్యూడ్ ఫొటోలు, వీడియోలు తీసి బెదిరింపులు

Konaseema Crime : బాలిక అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లైంగిక దాడులకు పాల్పడ్డాడో వ్యక్తి. వీడియోలు, ఫొటోలు తీసి తాను చెప్పినట్లు చేయకపోతే సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు.

FOLLOW US: 

Konaseema Crime : బాలికలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. బాలికల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలతో లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. వయసులో వ్యత్యాసం ఉన్నా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి తన కోర్కెలు తీర్చుకుంటున్నారు. తన వద్దకు రాకుంటే న్యూడ్ ఫొటోలు వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు పాల్పడుతున్న ఓ ప్రబుద్ధుడిపై కేసు నమోదు చేసి కటకటాల వెనక్కి పంపారు పోలీసులు.  

అసలేం జరిగింది? 

బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఐ. పోలవరం మండల కొమరగిరి గ్రామంలో ఈ ఉదంతం బయటపడగా బాలిక తండ్రి ఫిర్యాదుతో నయవంచన చేసిన వ్యక్తిపై పోక్సో సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కి పంపారు పోలీసులు. ఎస్సై అబ్దుల్ నబీ కథనం ప్రకారం కొమరగిరి గ్రామానికి చెందిన సానబోయిన మురళి అదే గ్రామానికి చెందిన ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసగించాడు. గత సంవత్సరం అక్టోబర్ నెలలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక రోజు కాకినాడ లాడ్జికి కూడా తీసుకువెళ్లాడు. బాలికకు సంబంధించిన అశ్లీల దృశ్యాలు, ఫొటోలు తీసి, ఎవరికైనా విషయం చెబితే ఆ ఫొటోలను అందరికీ చూపిస్తానని బెదిరించాడు. దీంతో భయపడి పోయిన బాలిక ఆ వ్యక్తి చెప్పినట్లే చేస్తూ వచ్చింది. రోజు రోజుకీ బాలికపై అజమాయిషీ చెలాంచడమే కాకుండా తాను చెప్పినట్లు వినకపోతే బాలిక అంతు చూస్తానని, న్యూడ్ వీడియోలన్నీ సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. చివరకు విసుగెత్తిపోయిన బాలిక తాను మోసపోయిన విషయం కుటుంబీకులకు తెలిపింది. బాలిక తండ్రి  ఫిర్యాదు పోలీసులను ఆశ్రయించడంతో నిందితుడు మురళిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

బాలికపై ఇద్దరు అత్యాచారం

ఇద్దరు కామాంధులు 14 ఏళ్ల బాలికపై వరుస అత్యాచారాలకు పాల్పడి గర్భవతిని చేసిన ఘటన తిరుపతిలో ఆలస్యంగా వెలుగు చూసింది.

పథకం ప్రకారమే మాట కలిపిన మధుసూదన రావు..!

తిరుపతి పడమర డీఎస్పీ నరసప్ప తెలిపిన వివరాల‌ మేరకు... వెంకట గిరికి చెందిన మధుసూదన రావు(26) ఆర్థిక ఇబ్బందులు కారణంగా గత కొద్ది రోజుల క్రితం తిరుపతిలోని తన అక్క ఇంటికి వచ్చాడు. అయితే  బతుకుదెరువు కోసం మధుసూదన్ రావు పెయింటింగ్ పనులు చేస్తూ ఇక్కడే జీవించే వాడు. ఈ క్రమంలో సమీప బంధువైన 14 ఏళ్ల బాలికపై మధుసూదన్ రావు కన్ను పడింది. ఎలాగైనా ఆ 14 ఏళ్ళ బాలికను లోబరుచుకోవాలని పన్నాగం పన్నాడు. పెయింటింగ్ పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చే సమయంలో బాలికను పలకరిస్తూ, బాలికకు దగ్గర అయ్యే ప్రయత్నం చేసేవాడు.

చిరుతిళ్లు తెచ్చిస్తూ బాలికతో స్నేహం..

అంతే కాకుండా బాలికకు చిరుతిండ్లు వంటివి తీసుకుని వస్తూ, బాగా మచ్చిక చేసుకున్నాడు. ఎవరూ లేని సమయంలో బాలికపై అత్యచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాలిక భయపడి మధుసూదన్ రావు వద్ద నుంచి తప్పించుకుని వెళ్ళేందుకు ప్రయత్నించింది. అయితే బాలికను పట్టుకుని భయపెట్టిన మధుసూదన్ రావు, పలుమార్లు బాలికపై అత్యచారంకు పాల్పడ్డాడు. అయితే ఇటీవల బాలిక గర్భం దాల్చిందని అనుమానం వచ్చిన‌ మధుసూదన్ రావు తిరుపతి నుంచి వెళ్ళి పోయాడు. ఆ సమయంలోనే బతుకు తెరువు కోసం ఇతర దేశాలకు వెళ్ళిన 14 ఏళ్ళ బాలిక తల్లి తిరిగి వచ్చింది. బాలిక శరీరంలో మార్పులు గమనించిన బాలిక తల్లి స్ధానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్య పరీక్షలు చేయించింది. 

కేసు నమోదు చేసి ఇద్దరినీ రిమాండ్‌కు తరలింపు!

అయితే వైద్య పరీక్షలు చేసిన వైద్యులు బాలిక ఏడు నెలలు గర్భవతి అని నిర్ధారించడంతో ఆమె తల్లి ఒక్కసారిగా షాక్ కి గురైంది. బాలిక తల్లి, గర్భానికి కారణమైన వారి పేరు చెప్పాలని బాలికను గదమాయించడంతో బాలిక జరిగిన విషయం తల్లికి వెల్లడించింది. దీంతో బాలిక తల్లి ముత్యాల రెడ్డి పల్లె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందుతుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను డీఎస్పీ నరసప్ప విచారించారు. విచారణ సమయంలో తనపై అదే ప్రాంతానికి చెందిన మరోక వ్యక్తి వెంకటేశ్ (48) అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక పేర్కొనగా పోలీసులు విచారణ జరిపి ఆయనపై కేసు నమోదు చేశారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు నిందుతులపై ఫోక్సో చట్టం క్రింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు.

Also Read : పిల్లలతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన- చితక్కొట్టిన ప్రజలు

Published at : 23 Aug 2022 09:57 PM (IST) Tags: AP News Crime News minor girl sexually abused Konaseema news Threatened with Photos

సంబంధిత కథనాలు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసిందంటే, రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది- చంద్రబాబు

Chandrababu Tweet : స్కూల్ పిల్లల వరకూ గంజాయి వచ్చేసిందంటే, రాష్ట్రంలో పరిస్థితి ప్రమాదకరంగా ఉంది- చంద్రబాబు

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ? విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Vizag Crime News : 70 ఏళ్లు దాటిన వృద్ధుడ్ని ఇలా కూడా చంపేస్తారా ?  విశాఖలో ఇక రోడ్డెక్కితే గ్యారంటీ ఉండదు !

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Palnadu District News: పల్నాడులో కిడ్నాప్ అయిన బాలుడు క్షేమం, కారులోనే వదిలి నిందితులు పరార్

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Hyderabad News: హైదరాబాద్ లో ఉగ్రకుట్న భగ్నం, ముగ్గుర్ని అరెస్ట్ చేసిన సిట్ పోలీసులు

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

Cyber Crime : సైబర్ కేటుగాళ్లు డబ్బు కొట్టేశారా? అయితే ఇలా చేస్తే మీ సొమ్ము తిరిగొస్తుంది!

టాప్ స్టోరీస్

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే. - అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

KCR Plan : కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టేది తెలంగాణలో మూడో సారి గెలవడానికే.  -  అంచనాలకు అందని కేసీఆర్ వ్యూహం ఇదే !

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Kishan Reddy: కొత్త పార్టీ ఏర్పాటు అందుకే, ప్రధాని అయినట్లు పగటి కలలు - కిషన్ రెడ్డి ఎద్దేవా

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

Chinta Mohan: శశిథరూర్ దళిత వ్యతిరేకి, మల్లిఖార్జున ఖర్గేనే విజయం సాధిస్తారు: కాంగ్రెస్ మాజీ ఎంపీ

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి