Khammam: భర్తకు కుక్కల మందు పెట్టి చంపిన భార్య, కారణం తెలిసి అవాక్కైన పోలీసులు
Khammam Extramarital affair: ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఓ మహిళ ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించుకునేందుకు కుక్కల మందును వాడి అతడ్ని హతమార్చింది.
Khammam News: వివాహేతర సంబందాలు నిండు ప్రాణాల్ని బలి తీసుకుంటున్నాయి. ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను అడ్డుతొలగించుకునేందుకు అనేక అడ్డదారులు తొక్కుతున్నారు.. ఒక్కొక్కరు ఒక్కో తరహాలో తప్పులు చేసి చివరకు కటకటాల పాలవుతున్నారు.. ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలానికి చెందిన ఓ మహిళ ప్రియుడి కోసం భర్త అడ్డు తొలగించుకునేందుకు కుక్కల మందును వాడి అతని అడ్డు (Khammam Wife Murders Husband) తొలగించుకుంది. ఇందుకు సంబందించి తిరుమలాయపాలెం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం (Tirumalayapalem) సుబ్లేడు గ్రామానికి చెందిన దావా కనకరాజు (37)కు భార్య విజయ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన పంచాయతీ వాటర్‌మెన్ ఓర పాపయ్యతో ఆమెకు అక్రమ సంబందం ఏర్పడింది. ఈ విషయం కనకరాజుకు తెలియడంతో వారిద్దమరి మద్య గొడవ చోటు చేసుకుంది. ఇద్దరి మద్య ఘర్షణ తలెత్తడంతో విజయ పుట్టింటికి వెళ్లిపోయింది.
మద్యంలో కుక్కల మందు కలిపి..
పుట్టింటికి వెళ్లిన విజయ పాపయ్యతో మాత్రం తరుచూ మాట్లాడేది. అయితే తమ అక్రమ సంబంధానికి (Khammam Extramarital affair) అడ్డుగా ఉన్న కనకరాజును ఎలాగైనా తొలగించుకోవాలని బావించారు. ఇద్దరు కలిసి ఓ పన్నాగం పన్నారు. ఇందులో భాగంగా సూర్యాపేట జిల్లా మోతే మండలం తుమ్మగూడెంకు చెందిన కృష్ణ అనే వ్యక్తి దగ్గర కుక్కలను చంపేందుకు వినియోగించే మందును కొనుగోలు చేశారు. మద్యం అలవాటు ఉన్న కనకరాజును దానిని అందించేందుకు పక్కా ప్లాన్ చేశారు. కనకరాజుకు తెలిసిన షేక్ మస్తాన్ అనే వ్యక్తి ద్వారా కుక్కల మందు కలిపిన మద్యంను ఇప్పించారు.
విషం కలిపిన మద్యం సేవించిన కనకరాజు ఇంటికి వెళ్లి కాళ్లు, చేతులు లాగుతున్నాయని చెప్పడంతో వెంటనే బందువులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కనకరాజు మృతి చెందాడు. అయితే తన కుమారుడు సాదారణంగా మరణించలేదని, మద్యంలో విషం కలిపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ నిర్వహించారు. ప్రియుడి కోసం విజయ తన భర్త అడ్డు తొలగించుకునేందుకు ఇలా మద్యంలో కుక్కల మందు కలిపి చంపిందని పోలీసుల విచారణలో తేలడంతో విజయ, ఓర పాపయ్యలను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
Also Read: BTech Student: ఉద్యోగం రావడం లేదని బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, 2 వారాలపాటు ఆసుపత్రిలోనే, కానీ !