Khammam: ఆరేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల వృద్ధుడి నీచపు పని.. ఇంట్లోకి తీసుకెళ్లి దారుణం
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. ఓ 60 ఏళ్ల వృద్ధుడి కామదాహానికి ఆరేళ్ల చిన్నారి బలి అయింది.
ఆడవారిపై మానవ మృగాలు ఇంకా పేట్రేగిపోతూనే ఉన్నాయి. కామాంధులు తమ వికృతమైన పైశాచికమైన త్రుప్తికి చిన్నపిల్లలని కూడా చూడకుండా బలి చేస్తున్నారు. నిర్భయ, దిశ వంటి ఘటనలతో కఠిన చట్టాలు అందుబాటులోకి వచ్చినా నేరగాళ్ల మనసుల్లో మాత్రం ఏ మార్పు రావడం లేదు. పైగా రోజురోజుకూ అలాంటి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఖమ్మం జిల్లాలోనూ ఇలాంటిదే ఓ ఘటన జరిగింది. ఓ 60 ఏళ్ల వృద్ధుడి కామదాహానికి ఆరేళ్ల చిన్నారి బలి అయింది.
ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మోటాపురంలో ఈ ఘాతుకం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలంలోని మోటాపురానికి చెందిన భార్యాభర్తలకు ఓ కుమార్తె ఉంది. వారు కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తుంటారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే బుధవారం కూడా వారు తమ ఆరేళ్ల కుమార్తెను ఇంట్లోనే వదిలిపెట్టి కూలీ పని కోసం పొలం వెళ్లారు. ప్రతి రోజు ఇలాగే వారు వెళ్తుండగా ఆ పాప చుట్టుపక్కల పిల్లలతో ఆడుకుంటుండేది. ఈ విషయాన్ని ఎప్పటినుంచో గమనిస్తున్న ఎదురింటి పెద్దాయన ఆ బాలికపై కన్నేశాడు. పాప తల్లిదండ్రులు ఇంట్లో లేకపోవడం ఆసరాగా చేసుకుని వారి ఎదురు ఇంట్లో ఉండే దీప్లానాయక్ అనే 60 ఏళ్ల వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. పాపను ఆ వృద్ధుడు తన ఇంట్లోకే రమ్మని ఘాతుకానికి పాల్పడ్డాడు.
Also Read: డ్రగ్స్ కేసులో టాలీవుడ్ సినీ ప్రముఖులకు ఈడీ సమన్లు.. ఎవరెవరు లిస్టులో ఉన్నారంటే..!
కూలీ పనులకు వెళ్లొచ్చాక ఆమె తల్లిదండ్రులకు చిన్నారి కనిపించకపోవటంతో గ్రామం అంతా వెతికారు. అయినా దొరకపోవడంతో ఏడుస్తూ ఎదురిల్లు అయిన దీప్లా నాయక్ ఇంట్లోనూ పరిశీలించారు. అక్కడ చిన్నారి వివస్త్రగా పడి ఉంది. దీంతో విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు స్థానికులకు విషయం చెప్పారు. వారు సీడీపీఓ బాలా త్రిపుర సుందరికి సమాచారం ఇవ్వగా.. ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. నేలకొండపల్లి పోలీసులు నిందితుడైన దీప్లా నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాలికకు వైద్యం అందించేందుకు ఖమ్మంలోని పెద్దాస్పత్రికి తరలించారు.
Also Read: Ahmedabad: కండోమ్ మర్చిపోయి.. ఆ పదార్థంతో లైంగిక చర్య, వెంటనే చనిపోయాడు!