Karnataka Murder: చంపడమే కాదు ముక్కలు చేసి దారిలో విసిరేస్తూ పోయాడు - క్రైమ్ ధ్రిల్లర్‌లను మించిన మర్డర్ !
Woman Murder: కర్ణాటకలో తుమకూరు వద్ద పదికిలోమీటర్ల పరిధిలో ఓ మహిళ శరీరభాగాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. అత్యంత ఘోరంగా చంపి హంతకుడు ఇలా పడేసిపోయాడు.

Woman Body Parts found in 10 locations: తెల్లతెల్లవారు జాము ఆ రోడ్ వెంట వెళ్తున్న వారికి.. ఏదో తేడా అనిపించింది. ఎప్పుడూ లేని కొత్త దుర్వాసన వస్తోంది. ఎంత దూరం వెళ్లినా ఆ వాసన వస్తూనే ఉంది. కానీ అదేమిటో వారికి తెలియలేదు. కానీ...ఓ చోట ఓ కుక్క.. ఓ పెద్ద మాంస ముక్కలాంటిదేదో పట్టుకుని రోడ్ మీదకు వస్తూంటే.. ఆ దుర్వాసన పెరిగింది. ఆ కుక్కను రోడ్ మీద వెళ్తున్న వారు తరిమే ప్రయత్నం చేశారు. కానీ ఆ కుక్క నోటిలో ఉన్నదేమిటో చూసి షాక్‌కు గురయ్యారు. అది మనిషి చేయి. మనిషి చేయి కట్ చేసి పడేస్తే ఆ కుక్క తీసుకు వస్తోంది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులుతో పాటు వైద్య సిబ్బంది కూడా వచ్చి ఆ కుక్క చేయిని స్వాధీనం చేసుకున్నారు. అయితే అది ఎవరి చేయి.. మిగతా బాడీ ఎక్కడ ఉందన్నది మాత్రం వారికి అర్థం కాలేదు. కానీ అక్కడి నుంచి కిలోమీటర్ దూరంలో మరో బాడీ పార్ట్ ఉందన్న సమాచారం రావడంతో అక్కడికి వెళ్లి చూశారు. అక్కడ ఓ కాలు దొరికింది. అలా.. ఆ రోడ్‌లో వెళ్తూ వెళ్తూ ఉంటే.. పదిహేను కిలోమీటర్ల లోపల పది బాడీ పార్టులు దొరికాయి. అంటే ఓ మహిళను అత్యంత కిరాతకంగా నరికి చంపేసి.. పది ముక్కలు చేసి.. ఆ ముక్కుల్ని ట్రక్కులోనో.. కారులోనే వేసుకుని.. ఒక్కొక్కటి విసిరేసుకుంటూ వెళ్లారన్నమాట.
పోలీసులు ముందుగాఈ మహిళ శరీరం ఎవరిదో తెలుసుకుంటే సగం కేసు పరిష్కారమవుతుందని.. బాడీ పార్టులన్నీ కలిపి ఆనవాళ్ల కోసం ఆరా తీశారు. అతి కష్టం మీద హతురాలు కోరటగెరె తాలూకాలో నివసించే లక్ష్మీదేవమ్మ (42) అనే మహిళదిగా గుర్తించారు. లక్ష్మీదేవమ్మను ఆమె చేతులపై ఉన్న పచ్చబొట్లు మరియు ముఖ లక్షణాల ద్వారా గుర్తించారు. ఆమె ఆగస్టు 4 నుండి కనిపించకుండా పోయినట్లు కుమార్తె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆగస్టు 3న తన కూతురిని కలవడానికి ఉర్దిగెరె వెళ్లిన ఆమె ఆ రాత్రి ఇంటికి తిరిగి రాలేదు. ఆమె భర్త బసవరాజు బెళ్లవి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
అయితే ఆమెను నాలుగో తేదీన హ త్య చేయలేదని.. ఏడో తేదీన చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాడీ పార్టులను బట్టి చూస్తే.. అంతకు ముందు రోజే హత్యకు గురయ్యారని నిపుణులు తేల్చారు. ఆమె కుమార్తె ఇంటికి కూడా వెళ్లలేదని చెబుతున్నారు. అంటే కుమార్తె ఇంటికి అని చెప్పి బయలుదేరిన ఆమెను ఇతరులు కిడ్నాప్ చేయడమో..లేకపోతే ఆమె వారి వద్దకు వెళ్లడమే జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ కేసు స్థానికుల్లో భయాందోళనలను రేకెత్తించింది. 2022లో జరిగిన శ్రద్ధా వాల్కర్ హత్య కేసుతో పోలికలను తెచ్చింది. హంతకుడు ఎవరు.. హత్య వెనుక ఉద్దేశం ఇంకా పోలీసులు గుర్తించలేదు. కోరటగెరె, కొలాల పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ దర్యాప్తు కొనసాగుతోంది.





















