Huzurabad Car Accident: హుజూరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం, అదుపుతప్పి బోల్తా కొట్టిన కారు, ఇద్దరు మృతి
Huzurabad Car Accident: హుజూరాబాద్ మండలం సింగపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
Huzurabad Car Accident: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగపూర్ గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సింగపూర్ జాతీయ రహదారిపై ఎర్టిగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. అనంతరం కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతులు, గాయపడిన వారు వరంగల్ కు చెందిన వారుగా తెలుస్తోంది. వేములవాడ దర్శనానికి వెళ్లి వస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. ప్రమాదంపై విచారణ చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ట్రాక్టర్ బోల్తా పడి 30 మందికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రమాదం జరిగింది. వేములూరు నుంచి మణుగూరు వెళ్తోన్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మహిళలకు గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో గాయపడిన వారిని మణుగూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మహిళా దినోత్సవం వేడుకలకు వెళ్తోండగా ఈ ప్రమాదం జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రెండు ఆర్టీసీ బస్సులు ఢీ
తెలంగాణలోని నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం(Road Accident) జరిగింది. భైంసా మండలం తిమ్మాపూర్ వద్ద హైవేపై సోమవారం రెండు ఆర్టీసీ బస్సులు(RTC Buses) ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 30 మందికి గాయాలయ్యాయి. ప్రత్యక్షసాక్షులు చెప్పిన వివరాల ప్రకారం... భైంసా నుంచి నిర్మల్ వెళ్తోన్న ఆర్టీసీ బస్సును అదే మార్గంలో గొల్లమడ వెళ్తోన్న మరో ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. మరో 20 మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని భైంసా(Bhainsa) ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంబకంటికి చెందిన చిన్నత్త, గోదావరికి కాళ్లు విరగడంతో వారిని మెరుగైన వైద్యం కోసం నిర్మల్ తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Gaddiannaram Fruit Market: గడ్డి అన్నారం మార్కెట్ వద్ద ఉద్రిక్తత, కూల్చివేతలు ఆపాలని హైకోర్టు ఆదేశం