Kadapa Crime : కడపలో ఏటీఎం క్యాష్ వ్యాన్ చోరీ, ఒక్క రోజులో ఛేదించిన పోలీసులు!
Kadapa Crime : క్యాష్ తో ఉన్న ఏటీఎమ్ వాహనం చోరీ కేసును కడప జిల్లా పోలీసులు గంటల వ్యవధిలో ఛేదించారు. రూ. 54 లక్షలు రికవరీ చేశారు.
Kadapa Crime : కడప జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన ఏటీఎమ్ వాహనంలో చోరీ కేసును గంటల వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. ఈ చోరీలో కీలక పాత్ర పోషించిన ఖాజీపేటకు చెందిన మహబూబ్ భాషను అరెస్టు చేశారు. పరారైన డ్రైవర్ ఫరూక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
అసలేం జరిగింది?
కడప సెవెన్ రోడ్స్ సర్కిల్ లో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్ పరిధిలోని ఏటీఎమ్ లకు నగదు డిపాజిట్ చేసే వాహనంలో సుమారు రూ.56 లక్షల నగదు చోరికి గురైంది. ఎస్బీఐ బ్యాంక్ నుంచి రూ.71 లక్షల నగదుతో బయలుదేరిన సీఎంఎస్ ఏజెన్సీ వాహనం మూడు ఏటీఎమ్ లలో క్యాష్ డిపాజిట్ చేశారు. లోహిత్ నగర్ లోని ఏటీఎమ్ లో క్యాష్ డిపాజిట్ చేస్తుండగా ఏటీఎమ్ వాహనం డ్రైవర్ ఫరూక్ వాహనంతో సహా పరారయ్యాడు. కడప నగర శివార్లలో అప్పటికే ఖాజీపేటకు చెందిన మహమూబ్ బాషా ఇతియోస్ కారు ఏర్పాటుచేయడంతో ఏటీఎమ్ వాహనంలోని రూ.56 లక్షల నగదు బాక్సును కారులోకి ఎక్కించి బెంగళూరు వైపు పరారయ్యారు.
పక్కా ప్లాన్ తో
ఏటీఎమ్ లలో డబ్బును అమర్చే కంపెనీల్లో సీఎంఎస్ ఒకటి. శుక్రవారం కడప పరిధిలోని పలు ఏటీఎం కేంద్రాల్లో డబ్బును నింపాల్సి ఉంది. అయితే తమ వ్యాన్ డ్రైవర్ లీవ్ పెట్టడంతో కాగితాల పెంటకు చెందిన ఫరూఖ్‌ని తాత్కాలిక డ్రైవర్‌గా సీఎంఎస్ నియమించుకుంది. శుక్రవారం మధ్యాహ్నం రెండు ఏటీఎం కేంద్రాల్లో రూ.15 లక్షల చొప్పున డబ్బును పెట్టారు. అనంతరం ఐటీఎం సర్కిల్ వద్ద ఉన్న స్టేట్ బ్యాంక్ఓ ఏటీఎంలో రూ.15 లక్షలు పెట్టేందుకు సిబ్బంది ఏటీఎం లోపలికి వెళ్లారు. ఆ సమయంలో వాహనం వద్ద సెక్యూరిటీ లేకపోవడంతో అదే అదనుగా భావించిన డ్రైవర్ ఫరూఖ్ వాహనంతో ఉడాయించాడు. క్యాష్ వ్యాన్‌లో దాదాపు రూ.56 లక్షల నగదు ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వినాయకనగర్ జంక్షన్ వద్ద డ్రైవర్ క్యాష్ వ్యాన్‌ను వదిలేసి డబ్బుల బాక్స్‌తో కారులో పారిపోయాడు.
కర్ణాటక సరిహద్దులో పట్టివేత
ఎస్బీఐ అధికారుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. కడప డీఎస్పీ నేతృత్వంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు. చోరీ జరిగిన శుక్రవారం రాత్రే అనంతపురం, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని బాగేపల్లి చెక్ పోస్టు వద్ద డబ్బుతో ఉడాయించిన కారును చెక్ పోస్ట్ సిబ్బంది ఆడుకున్నారు. ఇంతలో కారును వెంబడించిన పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసుల రాకను గమనించిన డ్రైవర్ ఫరూక్ చెక్ పోస్టు సిబ్బందిని తోసి అక్కడ నుంచి పరారయ్యాడు. వదిలి వెళ్లిన కారు నుంచి రూ.53 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కేకే అన్బురాజన్ తెలిపారు. . అప్పుల్లో కూరుకుపోయిన మహబూబ్ బాష, ఏటీఎమ్ వాహనం డ్రైవర్ గా రెండు రోజుల కిందట చేరిన ఫరూక్ సాయంతో ఈ చోరీ చేసినట్లు ఎస్పీ తెలిపారు. పరారైన డ్రైవర్ ఫరూక్ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు.
Also Read : Mobiles Recovery : మీ మొబైల్ మిస్సైందా? అయితే ఇలా చేయండి-కర్నూలు పోలీసుల కొత్త కాన్సెప్ట్
Also Read : Konaseema News : దైవసేవకుడిగా వచ్చి ప్రేమపాఠాలు, చర్చి ఫాదర్ పై మహిళలు ఫిర్యాదు!