By: ABP Desam | Updated at : 13 Feb 2023 03:26 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
జనగామ కలెక్టరేట్
Jangaon collectorate : ఐదేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా భూసమస్య పరిష్కారం చేయడం లేదంటూ జనగామ కలెక్టరేట్ లో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటన సంచలనంగా మారింది. జనగామ జిల్లా కలెక్టర్ కార్యాలయం పైకి ఎక్కిన దంపతులు నర్సింగరావు, రేవతి డీజిల్ పోసుకొని ఆత్మహత్యకి యత్నించారు. వెంటనే అప్రమత్తమైన కలెక్టరేట్ సిబ్బంది పై నుంచి నీళ్లు పోశారు. అనంతరం దంపతులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో కిందకు దిగివచ్చారు. జనగామ మండలం పసరమడ్ల గ్రామానికి చెందిన నర్సింగరావు తన నాలుగు ఎకరాల భూమిని అధికారులు వేరే వారికి ఎలాంటి పత్రాలు లేకుండా కట్టబెట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఎన్నిసార్లు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదని, కలెక్టర్ హామీ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి న్యాయం జరగక పోవడంతో ఆత్మహత్యకి యత్నించినట్లు బాధితులు తెలిపారు. గతంలో ఇదే భూసమస్య పరిష్కారం కోసం రెండు సార్లు నర్సింగరావు ఆత్మహత్యకు యత్నించడం గమనార్హం.
నిజామాబాద్ కలెక్టరేట్ ముందు సర్పంచ్ దంపతులు ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ కలెక్టరేట్ ఎదుట నందిపేట్ సర్పంచ్ దంపతులు ఇటీవల ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని మంట అంటించుకునేందుకు ప్రయత్నించారు. అక్కడున్న పోలీసులు సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధింస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆరోపిస్తున్నారు. పెండింగ్ బిల్లులు రావడం లేదని మనోవేదనకు గురైన నందిపేట్ సర్పంచ్, ఆమె భర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. నందిపేట్ కు చెందిన సర్పంచ్ సాంబార్ వాణి, భర్త తిరుపతి(వార్డ్ మెంబర్) తమకు న్యాయం చేయాలంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. రెండు కోట్ల వ్యయంతో గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, వాటి బిల్లులు ఇవ్వకుండా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి వేధిస్తున్నారని ఆరోపించారు. ఉప సర్పంచ్ చెక్కులపై సంతకం చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. బీజేపీ నుంచి ఎన్నికైన తాను అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ లో చేరామని, అయినా తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
జీవన్ రెడ్డి వేధింపులు?
ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి తనను వేధిస్తూ.... ఇబ్బంది పాలు చేస్తున్నారని సర్పంచ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగకపోవడంతో ఆత్మహత్యే శరణ్యమని భావించి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులకు సొంత డబ్బు వెచ్చిoచామని తమ పరిస్థితి ధీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు కోట్ల రూపాయలు మిత్తితో కలిపి మూడు కోట్ల వరకు చేరిందని అన్నారు. చేతిలో డబ్బులు లేక, పెండింగ్ బిల్లులు రాక దీనస్థితిలో ఉన్నామని, ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరారు.
అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు
బీసీ కులానికి చెందిన సర్పంచ్ అవడంతో గత నాలుగు సంవత్సరాల నుంచి ఉపసర్పంచ్ మాద రవి అభివృద్ధి పనుల బిల్లులపై సంతకాలు పెట్టకుండా వేధింపులకు గురి చేస్తున్నారని సర్పంచ్ ఆరోపించారు. సుమారు రెండు కోట్ల రూపాయలు నందిపేట్ గ్రామ అభివృద్ధికి వెచ్చించానని తెలిపారు. బిల్లులు మంజూరు చేయడంలో స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా సహకరించడం లేదని సర్పంచ్ సాంబారు వాణి ఆవేదనం చెందారు. వడ్డీలు కలిపి మూడు కోట్లకు పైగా అప్పు అయిందని అప్పుల బాధ భరించలేక కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించమని బాధితులు వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని కలెక్టరేట్ ఎదుట నిరసన చేశారు. సర్పంచ్ భర్త తనతో తెచ్చుకున్న పెట్రోలును తన భార్యతో పాటు తనపై పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. పోలీసులు వెంటనే స్పందించి సర్పంచ్ దంపతులను అడ్డుకుని వారిని అక్కడ నుంచి పంపించేశారు.
Mulugu Crime News: లైంగిక వేధింపులు తాళలేక యువకుడిని చంపిన యువతి
Palnadu News : పల్నాడు జిల్లాలో విషాదం, నదిలో ఈతకు దిగి ఇద్దరు యువకులు మృతి
Data Theft ED Case : సైబరాబాద్ డేటా చోరీ కేసులో ఈడీ ఎంటర్, మనీలాండరింగ్ కింద కేసు నమోదు
Mla Raja Singh : ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబయిలో కేసు నమోదు
Hyderabad Crime News: భర్త ఆత్మహత్యాయత్నం, తనవల్లేనని తనువుచాలించిన ఇల్లాలు - తట్టుకోలేక తల్లి బలవన్మరణం
CM Jagan Party Meet : ఏప్రిల్ 3న పార్టీ నేతలతో సీఎం జగన్ కీలక సమావేశం, కఠిన నిర్ణయాలుంటాయని జోరుగా ప్రచారం
Manchu Vishnu: మనోజ్‌తో గొడవపై మంచు విష్ణు ఊహించని ట్విస్ట్ - తాజా వీడియో చూస్తే తల పట్టుకుంటారు!
IPL 2023: ఐపీఎల్ ట్రోఫీతో కెప్టెన్ల గ్రూప్ ఫొటో! మరి రోహిత్ ఎక్కడా?
తమిళనాడులో ‘పెరుగు’ రచ్చ - తమిళం స్థానంలో హిందీ, సీఎం ఆగ్రహంతో వెనక్కి తగ్గిన ఫుడ్ సేఫ్టీ అథారిటీ