News
News
వీడియోలు ఆటలు
X

Indore: ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయింది, తిడతారన్న భయంతో కిడ్నాప్ డ్రామా ఆడింది

Indore: మధ్యప్రదేశ్‌లో ఓ బాలిక ఎగ్జామ్‌లో ఫెయిల్ అయినందుకు కిడ్నాప్ డ్రామా ఆడి టెన్షన్ పెట్టింది.

FOLLOW US: 
Share:

Indore Girl Fake Kidnap:

మధ్యప్రదేశ్‌లో ఘటన..

ఎగ్జామ్‌లో ఫెయిల్‌ అయిన ఓ బాలిక...తల్లిదండ్రులు తిడతారేమో అన్న భయంతో సినిమా రేంజ్ డ్రామా ఆడింది. కిడ్నాప్ అయ్యానని చెప్పి ముచ్చెమటలు పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిందీ ఘటన. బీఏ ఫస్టియర్‌ ఎగ్జామ్స్‌లో ఫెయిల్ అయిన వెంటనే ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇండోర్‌కి 50 కిలోమీటర్ల దూరంలోని ఉజ్జెయిన్‌కి వెళ్లింది. ఉన్నట్టుండి కూతురు కనిపించకపోయే సరికి తల్లిదండ్రులు టెన్షన్ పడ్డారు. వెంటనే పోలీస్‌ కంప్లెయింట్ ఇచ్చారు. ఆ బాలిక కోసం అన్ని చోట్లా వెతికిన పోలీసులు చివరకు కిడ్నాప్‌ కథంతా ఫేక్ అని తేల్చి చెప్పారు. ఆ అమ్మాయిని తల్లిదండ్రులకు అప్పగించారు. 

"శుక్రవారం (మే13వతేదీ) రాత్రి బాలిక తండ్రి మా దగ్గరికొచ్చాడు. కూతురు కనిపించడం లేదని కంప్లెయింట్ ఇచ్చాడు. తన కూతురు కిడ్నాప్ అయిందని చెప్పాడు. కాలేజ్ నుంచి ఇంటికి వచ్చే దారిలో ఎవరో ఎత్తుకెళ్లిపోయారని అన్నాడు. ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన కాసేపటికే ఇలా జరిగిందని ఫిర్యాదు చేశాడు. గుర్తు తెలియని నంబర్ నుంచి ఆ అమ్మాయి..తండ్రికి కాల్ చేసింది. ఇండోర్‌లో ఎవరో తనను కిడ్నాప్ చేశారని చెప్పింది"

- పోలీసులు

రెస్టారెంట్‌లో చూసి..

ఫ్యాకల్టీ మెంబర్‌ ఒకరు తనను ఓ టెంపుల్ వద్ద దించాడని, అక్కడే ఓ ఆటో ఎక్కానని చెప్పింది ఆ బాలిక. డ్రైవర్ తనను గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లాడని, ఓ క్లాత్‌ నోటి దగ్గర పెట్టడం వల్ల అపస్మారక స్థితిలో వెళ్లిపోయానని టెన్షన్ పడుతూ అంతా  వివరించింది. ఇదంతా కంప్లెయింట్‌లో ప్రస్తావించాడు ఆ బాలిక తండ్రి. వెంటనే పోలీసులు విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్‌ పరిశీలించారు. కానీ..ఆ అమ్మాయి చెప్పినట్టు అక్కడ ఏమీ జరగలేదు. అప్పటికే చుట్ట పక్కల ప్రాంతాల పోలీసులకూ సమాచారం అందించారు. ఉజ్జెయిన్ పోలీసులకూ ఫోటో పంపారు. అక్కడ ఓ రెస్టారెంట్‌లో ఒంటరిగా అమ్మాయి కూర్చుని ఉండటాన్ని గమనించారు ఉజ్జెయిన్ పోలీసులు. వెంటనే మిస్ అయిన అమ్మాయి ఫోటోతో మ్యాచ్ చేసుకున్నారు. ఇద్దరూ ఒకటే అని కన్‌ఫమ్ చేసుకున్నారు. వెంటనే ఆ అమ్మాయిని అదుపులోకి తీసుకుని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. ఓ మహిళా పోలీస్‌తో కౌన్సిలింగ్ కూడా ఇప్పించారు. ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానని తెలిస్తే ఎక్కడ తిడతారో అన్న భయంతోనే ఇదంతా చేసినట్టు ఆ బాలిక అంగీకరించింది. అలా...ఈ ఫేక్ కిడ్నాప్ కథ సుఖాంతమైంది. 

ప్రభుత్వ ఉద్యోగికి కోట్ల ఆస్తులు..

మధ్యప్రదేశ్‌లో పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్‌లో (Madhya Pradesh Police Housing Corporation) ఇన్‌ఛార్జ్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా పని చేస్తున్న ఓ మహిళా ఉద్యోగి ఆస్తుల చిట్టా చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. యాంటీ కరప్షన్ రెయిడ్స్‌లో భాగంగా హేమ మీనా ఇంట్లో సోదాలు నిర్వహించారు అధికారులు. లెక్క పెడుతున్న కొద్ది ఆ చిట్టా పెరుగుతూనే ఉంది. మొత్తం 20 వాహనాలున్నాయి. వాటిలో 5-7 లగ్జరీ కార్లే. 20 వేల చదరపు అడుగులు స్థలం కూడా ఉంది. గిర్‌ జాతికి చెందిన ఆవులు 24 ఉన్నాయంటే...వాటి విలువ ఎంతో అంచనా వేసుకోవచ్చు. 98 ఇంచుల హైఎండ్ టీవీ కూడా ఈ లిస్ట్‌లో ఉంది. అది ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. ప్రైస్ ట్యాగ్‌ చూసి అధికారులు షాక్ అయ్యారు. రూ.30 లక్షల విలువ చేసే టీవీ అది. రూ.30 వేల నెల జీతం ఉన్న ఉద్యోగికి ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయనేది షాకింగ్‌గా ఉంది. 

Also Read: సిద్దరామయ్యతో ఎలాంటి విభేదాల్లేవు, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశా - డీకే శివకుమార్ క్లారిటీ

Published at : 14 May 2023 03:38 PM (IST) Tags: ujjain Indore Girl Fake Kidnap Fakes Kidnapping Failing Exam

సంబంధిత కథనాలు

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

Tirupati: 13 ఏళ్ళుగా మరదల్ని ప్రేమిస్తున్న యువకుడు, చివరికి ఉరేసుకొని ఆత్మహత్య

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

France stabbing: ప్రీస్కూల్‌లోని చిన్నారులపై కత్తితో దాడి చేసిన సైకో, 9 మందికి తీవ్ర గాయాలు

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

Hyderabad: ఉన్నట్టుండి ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని, ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు!

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

అప్పు పేరుతో తప్పుడు పనులు- హైదరాబాద్‌లో కాల్‌మనీ తరహా ఘటన- షీ టీం ఎంట్రీతో నిందితులు ఎస్కేప్

Maharashtra Crime: క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు

Maharashtra Crime: క్రికెట్‌ ఆడే విషయంలో గొడవ, 12 ఏళ్ల బాలుడిని బ్యాట్‌తో కొట్టి చంపిన మరో బాలుడు

టాప్ స్టోరీస్

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం

Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

Ambati Rayudu :  జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం

Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం