అన్వేషించండి

అమెరికాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి, పార్క్‌లో డెడ్‌బాడీ

Indian Student Death: అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు.

Indian Student Dead in US: అమెరికాలో భారత సంతతికి చెందిన విద్యార్థి మృతి చెందడం స్థానికలకం కలకలం సృష్టించింది. ఇండియానాలోని Purdue University లో చదువుతున్న 23 ఏళ్ల సమీర్ కామత్ (Sameer Kamath) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. ఇదే యూనివర్సిటీకి చెందిన భారత సంతతికి చెందిన విద్యార్థి ఇలా మృతి చెందడం రెండోసారి. ఈ ఏడాదిలో అమెరికాలో మొత్తం నలుగురు విద్యార్థులు ఇలానే ప్రాణాలు కోల్పోయారు. అనుమానాస్పద స్థితిలో సమీర్‌ మృతదేహాన్ని కనుగొన్నారు. ఓ పార్క్‌లో డెడ్‌బాడీని గుర్తించారు. గతేడాది ఆగస్టులో  Purdue Universityలో మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశాడు సమీర్. ఆ తరవాత అమెరికా పౌరసత్వం కూడా వచ్చింది. ప్రస్తుతం పీహెచ్‌డీ చేస్తున్నాడు. 2025లో PHD పూర్తవ్వాల్సి ఉంది. ఇంతలోనే ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతదేహాన్ని ఫోరెన్సిక్ అటాప్సీకి పంపారు. త్వరలోనే ఈ రిపోర్ట్‌ విడుదల చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఇటీవలే ఇదే యూనివర్సిటీలో చదువుతున్న నీల్ ఆచార్య కూడా ఇదే విధంగా ప్రాణాలు కోల్పోయాడు. క్యాంపస్ గ్రౌండ్‌లో మృతదేహాన్ని గుర్తించారు. తల్లి మిస్సింగ్ కంప్లెయింట్ ఇచ్చాక పోలీసులు గాలింపులు చేపట్టారు. చివరకు క్యాంపస్‌లోనే గ్రౌండ్‌లో డెడ్‌బాడీని కనుగొన్నారు. అంతకు ముందు నీల్ ఆచార్య తల్లి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ఊబర్ డ్రైవర్‌ నీల్‌ని క్యాంపస్‌ దగ్గర డ్రాప్ చేసి వెళ్లాడని, ఆ తరవాత నుంచి కనిపించకుండా పోయాడని తెలిపింది. ఈ పోస్ట్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అంతకు ముందు వారం ఓహియో ప్రాంతంలో భారత సంతతికి చెందిన 19 ఏళ్ల శ్రేయాస్ రెడ్డి ఇదే విధంగా మృతి చెందాడు. 

అమెరికాలోని ఓ జిమ్‌లో గతేడాది భారతీయ యువకుడిపై దాడి జరిగింది. ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. గతేడాది అక్టోబర్ 29న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే ప్రాణాలతో పోరాడుతున్న బాధితుడు చివరకు మృతి చెందాడు. వాల్పరైసో యూనివర్శిటీలో (Valparaiso University) కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వరుణ్ రాజ్‌పై ( Varun Raj Pucha) జార్డన్ (Jordan Andrade) అనే వ్యక్తి  దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. వరుణ్ రాజ్ చనిపోయినట్టు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. వరుణ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. ఈ దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై దాడి చేస్తాడేమో అన్న భయంతోనే అలా చేశానని నిందితుడు పోలీసులకు వివరించాడు. కానీ సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగిందన్నది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే జిమ్‌ నిర్వాహకులు మాత్రం వరుణ్ రాజ్‌ చాలా సైలెంట్‌గా ఉంటాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని చెబుతున్నారు. 

"వరుణ్ రాజ్ చనిపోయాడని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం. మా యూనివర్సిటీ మంచి విద్యార్థిని కోల్పోయింది. వరుణ్ కుటుంబానికి, మిత్రులందరికీ ప్రగాఢ సంతాపం"

- వాల్పరైసో యూనివర్సిటీ

Also Read: చికాగోలో భారతీయ విద్యార్థిపై దాడి, సాయం కోసం పరుగులు పెట్టిన బాధితుడు - వీడియో వైరల్

 

టాప్ హెడ్ లైన్స్

Hanamkonda Crime News: కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
కారు డిక్కీలో మహిళ డెడ్‌బాడీ కేసును ఛేదించిన కాజీపేట పోలీసులు.. పరువు కోసం దారుణం!
Investment Fraud: తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
తిరుపతి డీఎస్పీ పేరుతో కోట్లలో వసూళ్లు చేసిన గ్యాంగ్.. నిందితుడి అరెస్ట్
AE Nookaraju Family Suicide Case: సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
సౌజన్య, సాధిక్ రిలేషన్‌లో ఉన్నారు.. మతం మారాలని ఒత్తిడి చేశాడు: కాకినాడ ఎస్పీ
Chennai Suitcase Murder Case: చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!
చెన్నైలో ఒడిశా మహిళ హత్య! శరీర భాగాలు బిర్యానీ పాత్రలో ఉడికించిన నేరస్తులు!

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Vijayasai Reddy Hindutva Politics: విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Prabhas Spirit Update : వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!
యూత్‌కు మెచ్చే మార్పులతో Bajaj Pulsar 125 లాంచ్‌ - కేవలం రూ.11,000 డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం!
Raksha Bandhan 2026: రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Embed widget