Konaseema Cricket Betting: కోనసీమ జిల్లాలో క్రికెట్ బెట్టింగ్, కీలక బుకీల అరెస్ట్ - రాజకీయ నేతల ఒత్తిళ్లు !
ఏపీలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి క్రికెట్ బెట్టింగ్ దందా సాగిస్తున్నారు. గతంలో బుకీలుగా వ్యవహరించి పలు కేసుల్లో ఉన్నవారే ఈ ముఠా వెనుక కథ నడిపిస్తున్నారని సమాచారం.
బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టౌన్ కేంద్రంగా గతకొన్ని రోజులుగా క్రికెట్ బెట్టింగ్ ముఠా తమ కార్యకలాపాలను సాగిస్తోంది. ప్రస్తుతం జరుగుతోన్న టీ20 వరల్డ్ కప్ తో పాటు ఇతర క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి భారీ బెట్టింగ్ లు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మండపేటలో మంగళవారం ఉదయం క్రికెట్ బెట్టింగ్ ముఠా కు చెందిన కీలక బుకీలు పోలీసులకు పట్టుబడ్డారు. అత్యాధునిక టెక్నాలజీని వినియోగించి ఈ దందా సాగిస్తున్నారు. గతంలో బుకీలుగా వ్యవహరించి పలు కేసుల్లో ఉన్నవారే ఈ ముఠా వెనుక కధ నడిపిస్తున్నారని సమాచారం.
వేరే కేసుకు సంబంధించి నిందితుడు మండపేట-ఆలమూరు రోడ్డులోని ఓ వైఎస్ఆర్సీపీ నేతకు చెందిన హోటల్లో ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు సోదాలు జరుపుతుండగా టౌన్ ఎస్ఐ మద్దాల అశోక్ కు ఇద్దరు వ్యక్తుల కదలికపై అనుమానం వచ్చింది. దీంతో మరింత లోతుగా ఆయన విచారణ చేపట్టారు. ఓ గదిలో కంప్యూటర్ ను అమర్చి ల్యాప్ ట్యాప్, సెల్ ఫోన్ ఇతర ఆధునిక పరికరాలు అమర్చి ఉండటాన్ని గమనించారు. దీంతో కూపీ లాగితే డొంక కదిలింది.
కీలక బుకీల అరెస్ట్.. రాజకీయ రాజకీయ ఒత్తిళ్ళు..?
బుధవారం జరిగే మ్యాచ్లకు సంబంధించి బెట్టింగ్ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు ఈ ముఠా. అనపర్తి మండలం రాయవరానికి చెందిన తేతాడ కృష్ణ, కర్రి రమాకాంత్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడినుండి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్టణం, పశ్చిమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, కర్నూలు లలో బెట్టింగ్ లు నిర్వహిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలిసింది.. జిల్లాలవారి బుకీలు ఏజెంట్లు బెట్టింగ్ కు పాల్పడే వారి నెంబర్లతో సహా కీలక ఆధారాలు పోలీసుల చేతిలో ఉన్నట్లు నిఘావర్గాలు చెబుతున్నాయి. గతంలో కొన్ని నేరాలకు సంబంధించి ఈ బుకీల ముఠాకు సంబంధాలున్నట్లు తెలిసింది. ఈ ముఠా వెనుక రాజకీయ నేతలు ఉండడంతో కేసు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
T2O WC, IND vs BANG: టీ20 ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ తో కీలక పోరుకు సిద్ధమైంది టీమిండియా. పాకిస్థాన్, నెదర్లాండ్స్ పై వరుస మ్యాచుల్లో గెలిచిన భారత్ గత మ్యాచులో దక్షిణాఫ్రికా చేతిలో ఓడింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న టీమిండియా సెమీస్ వైపు ముందడుగు వేయాలంటే బంగ్లాను భారీ తేడాతో ఓడించాల్సిందే. మరోవైపు పసికూనలు నెదర్లాండ్స్, జింబాబ్వేలపై గెలిచిన షకిబ్ అల్ హసన్ సేన భారత్ ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచుకు వర్షం ముప్పు ఉంది. దీంతో మ్యాచ్ ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. గత మ్యాచులో వెన్ను నొప్పితో మైదానాన్ని వీడిన దినేశ్ కార్తీక్ స్థానంలో పంత్ ఆడే అవకాశముంది. ఒకవేళ కార్తీక్ ఆడినా దీపక్ హుడా స్థానంలో అయినా పంత్ ను జట్టులో తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. లెఫ్ట్ హ్యాండర్ అయిన పంత్ జట్టులో ఉంటే బ్యాటింగ్ లో వైవిధ్యం వస్తుంది.
టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్ నుంచి మన ఫాస్ట్ బౌలర్లు షమీ, భువనేశ్వర్, అర్షదీప్ సింగ్ నిలకడగా రాణిస్తున్నారు. అర్హ్ దీప్ ఆరంభంలోనే వికెట్లు పడగొడుతూ మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. భువీ ఎక్కువ వికెట్లు తీయకపోయినా చాలా పొదుపుగా బౌలింగ్ చేస్తున్నాడు. షమీ కూడా మధ్య, చివరి ఓవర్లలో ఆకట్టుకుంటున్నాడు. అయితే అశ్విన్ మాత్రం ఇప్పటివరకు తన మెరుపులను చూపించలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచులో సాధారణ బౌలింగ్ తో తన 4 ఓవర్ల కోటాలో 40 కి పైగా పరుగులు సమర్పించుకున్నాడు. ఈ మ్యాచులో అతనికి బదులు చాహల్ ను ఆడిస్తారేమో చూడాలి.