Video Calls: వీడియో కాల్‌లో సెక్స్ చాట్ చేస్తున్నారా? అయితే మీ ఖాతాలో డబ్బులు ఖతమ్
మోసం చేసేందుకు సైబర్ నేరాగాళ్లు రకరకాల పద్ధతుల్లో వెళ్తున్నారు. వాళ్లను నమ్మితే.. రెండు నిమిషాల్లో మీ అకౌంట్ మెుత్తం క్లీన్ చేసేస్తారు.
సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దు.. అని ఎన్ని ప్రకటనలు చేసినా.. మోసపోయేవాళ్లు మోసపోతూనే ఉన్నారు. ఒక పద్ధతిపై సరిపడా మోసాలు చేశాక మరో పద్ధతిలోకి వచ్చేస్తున్నారు నేరగాళ్లు. కొత్త కొత్త పద్ధతుల్లో జనాలను మోసం చేస్తున్నారు. ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ రోజుల్లో సెక్స్ చాట్ చేస్తూ.. డబ్బులు లాగడం ఎక్కువైపోయింది. ఇంతకుముందు అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఈ ట్రెండ్ కనిపించగా.. ఇప్పుడు భారత్‌లోని చిన్న చిన్న గ్రామాల నుంచి పట్టణాల్లోనూ ఇదే తీరు కనిపిస్తుంది. మధ్యప్రదేశ్‌లోని నీమచ్ జిల్లాలో ఇలాంటి అనేక కేసులు కూడా తెరపైకి వచ్చాయి, ఇక్కడ చాలా మంది వ్యక్తులు మోసపోయారు. ఈ కేసులో నిందితులను కూడా అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ప్రజలకు అవగాహన కల్పించే పనిలో పడ్డారు.
ఈ రోజుల్లో ఇలాంటి ముఠాలు చాలా ఉన్నాయి. మొదట అమ్మాయిల పేరుతో సోషల్ సైట్లలో మీతో స్నేహం చేసి, ఆపై మిమ్మల్ని వేధించడం ద్వారా డబ్బులు లాగడం ప్రారంభమవుతుంది. ఇలాంటి ఆన్‌లైన్ నేరగాళ్లు.. ఆన్‌లైన్ చాటింగ్, ఆన్‌లైన్ సెక్స్ పేరుతో చాలా మంది యువతను మోసం చేస్తున్నారు. వందల కొద్ది కేసులు బయటకు వస్తున్నాయి. పోలీసులు అవగాహన పెంచుతూ కొంతమందిని కాపాడుతున్నా.. మోసపోయే వాళ్లు మోస పోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని వరకు లక్షల రూపాయలు పొగొట్టుకుంటున్నారు. బీరాన్ జిల్లాలో ఓ వ్యక్తి ఈ ఆన్‌లైన్ మోసంలో డబ్బులు పొగొట్టుకున్నాడు. అయితే అతడిని చాలాసార్లు నేరగాళ్లు డబ్బులు అడిగారు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా అతడిని వదల లేదు.
ఏం చేస్తారంటే..
అమ్మాయి పేరుతో మీకు ఫేస్ బుక్ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. మీరు యాక్సెప్ట్ చేశాక.. అదే అమ్మాయి మీకు హలో అని చెబుతుంది. మీతో ఇక ఫ్రీగా మాట్లాడొచ్చు అని నమ్మకం వచ్చాక.. వెంటనే ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఇక తెల్లవార్లు చాట్ చేస్తుంది. మీకు మాయ మాటలు చెప్పి.. మీ వాట్సాప్ నెంబర్ అడుగుతారు. ఇక అక్కడి నుంచి మెుదలవుతుంది. ఆ తర్వాత మీతో చాట్ చేస్తూ ట్రాప్ చేస్తారు. ఆన్ లైన్ సెక్స్ మీకు ఇంట్రస్ట్ ఉందా అని అడగతారు. మీరు సరే అన్నారనుకో.. వెంటనే వీడియో కాల్ వస్తుంది. మీ దుస్తులు విప్పమని అడుగుతుంది. ఆ టైమ్ లో ఏంచేస్తారంటే.. తెలివిగా మీరు దుస్తులు తీసేశాక.. రికార్డు చేస్తారు.
అయితే మీ ముందు పోర్న్ వీడియోను ప్లే చేస్తారు. అటువైపు ఉన్న వాళ్లు రికార్డు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. స్క్రీన్ రికార్డు చేశాక.. మీ వీడియోను మీకే పంపిస్తారు. ఇక వాళ్లకు కావాల్సిన డబ్బులు డిమాండ్ చేస్తారు. వాళ్లు చెప్పిన ఖాతాకు డబ్బులు పంపాలి. ఒకవేళ మీరు పంపకపోతే.. ఫేస్ బుక్ లోని మీ స్నేహితులకు వీడియో పంపిస్తారు. అప్పటి నుంచి.. మీలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. అందుకే ఫేస్ బుక్ రిక్వెస్ట్.. వచ్చాక యాక్సెప్ట్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు చూసుకోండి. మెసెంజర్ లో కాల్స్, సందేశాలు పంపితే.. దయచేసి రిప్లై ఇవ్వద్దు. ఆ తర్వాత చాలా సమస్యల్లోకి వెళ్లాల్సి వస్తుంది. అలాంటి సంఘటన ఏదైనా జరిగితే, మీరు తప్పనిసరిగా పోలీసులకు తెలియజేయాలి.
- తెలియని వ్యక్తి నుండి రిక్వెస్ట్ వస్తే.. అభ్యర్థనను అంగీకరించొద్దు.
- మీకు ఎవరైనా తెలియని వాళ్లు కాల్స్ చేస్తే.. వీడియో కాల్ ద్వారా వారితో కనెక్ట్ అవ్వకండి.
- బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న వ్యక్తికి ఎప్పుడూ ఎలాంటి చెల్లింపులు చేయవద్దు.
- వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయండి.
Also Read: అడుగడుగునా అత్యాచారం.. 6 నెలల్లో బాలికపై 400 మంది.. నిందితుల్లో పోలీసులు కూడా..!