అన్వేషించండి

అడుగడుగునా అత్యాచారం.. 6 నెలల్లో బాలికపై 400 మంది.. నిందితుల్లో పోలీసులు కూడా..!

ఓ బాలికపై 400 మంది మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులపైనా దర్యాప్తు జరుగుతుంది. ఇప్పటి వరకూ 9 మంది నిందితులను గుర్తించగా.. నలుగురుని అరెస్టు చేశారు. 

మహారాష్ట్రలోని బీడ్ జిల్లాల్లో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికపై 400 మంది అత్యాచారానికి పాల్పడ్డారు. సొంకాళ్లపై నిలబడేందుకు.. సాయం కోసం ఎదురుచూసిన ఆమెకు అడుగడుగునా.. మృగాళ్లే కనిపించారు. అవసరాన్ని ఆసరాగా తీసుకుని.. పరిచయమైన ప్రతివాడు.. అత్యాచారం చేశారు. మరో విషయం ఏంటంటే.. పోలీసులు సైతం ఆమెను లాడ్జిలోకి తీసుకెళ్లి రేప్ చేసినట్టు తెలుస్తోంది. ఇవన్నీ.. బాలిక చేస్తున్న ఆరోపణలు. అయితే.. ప్రస్తుతం గర్భం దాల్చిన ఆమె.. శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించింది. అక్కడ ఉన్న అధికారులు.. ఆమెకు సాయం చేయడంతో.. అత్యాచార కేసు నమోదైంది. ఇప్పుడు ఈ రేప్ కేసు.. సంచలనం రేపుతోంది. 

మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన బాలిక తల్లిదండ్రులు రోజుకూలీలు. కుమార్తెను కొంతవరకు చదివించారు. రెండేళ్ల క్రితం బాలిక తల్లి మృతి చెందింది. ఈ క్రమంలో కుమార్తె బాలికే అయినా.. ఆమె తండ్రి ఆమెకు వివాహం చేసేశాడు. అప్పటి నుంచి ఆ బాలికకు కష్టాలు మెుదలయ్యాయి. చాలా తక్కువ వయసులోనే అత్తింట్లోకి ఆమె అడుగు పెట్టింది. పుట్టింటిలా ఉంటుందనుకున్న ఆమెకు నరకం చూపించారు. మామ నుంచి.. వేధింపులు.. అడిగితే.. భర్త సైతం.. తండ్రికే మద్దతిచ్చేవాడు. ఏడాదిన్నరపాటు అత్తవారింటిలో కష్టాలు పడుతూనే ఉంది. ఇక బాధలు భరించలేక నాన్న దగ్గరకు వచ్చింది. అయితే నాన్నకు భారం కాకూడదనే.. ఏదో ఒక పని చేయాలనుకుంది. ఈ క్రమంలో.. ఆరు నెలల కిందట అంబేజోగై పట్టణానికి వచ్చింది. 

పని కోసం తిరుగుతున్న ఆమెకి కోచింగ్ సెంటర్ లో పనిచేసే ఇద్దరు వ్యక్తులు పరిచయమయ్యారు. పని ఇప్పిస్తామని చెప్పి.. మాటలు చెప్పి.. బాలికపై అత్యాచారం చేశారు. అంతేగాకుండా.. వాళ్ల స్నేహితులకు ఈ విషయం చెప్పారు. వారి స్నేహితులు కూడా ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి.. రేప్ చేశారు.  అలా ఆరు నెలల కాలంలో 400 మంది అత్యాచారం చేశారని బాలిక చెబుతోంది. గర్భం దాల్చిన ఆమె.. అంబేజోగై పోలీసులను ఆశ్రయించింది. 

తనకు జరిగిన అన్యాయాన్ని.. పోలీసులకు చెప్పింది. అయితే ఆమె కథ విన్న తర్వాత కూడా కొంతమంది సిబ్బంది ఆమెపై కన్నేశారు. బాలికకు న్యాయం చేస్తామని మాయమాటలు చెప్పారు. నిజమేననుకుని నమ్మింది. వారిలో ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. కడుపులో బిడ్డ ఉన్నా.. ఇలాంటి ఘటనలు చూసి.. చూసి.. ఏం చేయాలో తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. తనను ఆదుకోవాలని శిశు సంక్షేమ శాఖను ఆశ్రయించింది. అక్కడి అధికారులు ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. 

కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేయాలని ఎస్పీ ఆదేశించారు. అంబోజోగై స్టేషన్ కు చెందిన కానిస్టేబుళ్లపైనా విచారణకు ఆదేశించారు. బాలిక చెప్పిన ఆనవాళ్లను బట్టి ఈ కేసులో ఇప్పటి దాకా తొమ్మిది మందిని నిందితులను గుర్తించారు. అందులో నలుగురిని అరెస్టు చేశారు. బాలిక ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఆమెకు అబార్షన్ చేయించేందుకు శిశు సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది.

Also Read: Vizag Crime: హోటల్ రూంలో TS యువకుడు, ఆంధ్రా యువతి.. కాసేపటికి మంటల్లో ఇద్దరూ.. షాకైన సిబ్బంది

Also Read: Panjagutta Girl Death: బాలిక హత్య కేసులో వీడిన మిస్టరీ.. త్రీస్టార్ నుంచి బిచ్చగాళ్లుగా.. లాడ్జిల్లో ఎంజాయ్‌మెంట్, చివరికి..

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Politics: జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
జగన్ ఇనాక్టివ్ - షర్మిల హైపర్ యాక్టివ్ - కాంగ్రెస్ మెల్లగా ప్రజాప్రతిపక్షంగా మారుతోందా ?
Telangana News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ మాతో టచ్‌లో ఉన్నారు - బాంబు పేల్చిన భట్టి విక్రమార్క
RRR Custodial Torture Case: రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
రఘురామను లాకప్‌లో చంపడానికి కుట్ర - రిమాండ్ రిపోర్టులో బయటకొస్తున్న నిజాలు
Vikatakavi Web Series Review - వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
వికటకవి రివ్యూ: Zee5లో కొత్త వెబ్ సిరీస్ - తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో డిటెక్టివ్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
Latest Weather Report: తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
తుపానుగా మారిన ఫెంగల్‌- ఏపీకి వర్ష సూచన - తెలంగాణలో చలి బాబోయ్‌ చలి
Dhanush Aishwarya Divorce: ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
ధనుష్ - ఐశ్వర్యకు విడాకులు మంజూరు... 18 ఏళ్ల వైవాహిక జీవితానికి చట్టబద్ధంగానూ ముగింపు
Kakinada Collector: సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
సూర్య సింగం సీన్ తరహాలో ఛేజింగ్, సముద్రంలో కాకినాడ కలెక్టర్ సాహసంతో కంటైనర్లు సీజ్
BSNL Best Plan: 200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
200 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందిస్తున్న బీఎస్ఎన్ఎల్ - ధర అంత తక్కువా?
Embed widget