By: ABP Desam | Updated at : 29 May 2023 04:02 PM (IST)
ఐటీ అధికారుల పేరుతో బంగారం దోపిడీ - గ్యాంగ్ ను పట్టుకున్న పోలీసులు !
Gang Arrest : సూర్య, కీర్తి సురేష్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన సినిమా ‘గ్యాంగ్’. ఈ సినిమాలో నకిలీ ఐడీలు సృష్టించి.. తాము ఆదాయపు పన్ను శాఖ అధికారులమంటూ సోదాలు చేపడతారు ఈ దొంగల ముఠా. సేమ్ అదే సీన్ తరహాలో జరిగింది సికింద్రాబాద్‌లో. శనివారం పట్టపగలు తాము ఐటి అధికారులమంటూ చెప్పి ఓ గోల్గ్ షాపులోకి వెళ్లి తనిఖీలు చేపట్టింది ఓ గ్యాంగ్. అనంతరం రెండు కేజీల బంగారు నగలతో ఉడాయించింది. ఆ గ్యాంగ్ ను పోలీసులు ్రెస్ట్ చేశారు. సికింద్రాబాద్ లోని పాట్ మార్కెట్ బంగారు దుకాణంలో జరిగిన దోపిడీ ఘటనలో చోరీకి పాల్పడిన నిందితులు జాకీర్, రహీమ్, ప్రవీణ్, అక్షయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. చోరీ చేసిన అనంతరం నిందితులంతా మహారాష్ట్రకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
కుమారులు అంటే భయం- భర్తకు ఇంట్లోనే దహన సంస్కారాలు నిర్వహించిన భార్య
అక్కడకు వెళ్లి వారిని పట్టుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు కొనసాగుతున్నట్లు తెలిపారు. దోపిడీకి పాల్పడిన ముఠాలో మొత్తం 8 మంది ఉన్నట్లు సమాచారం.నాలుగు నెలల క్రితమే మహారాష్ట్రకు చెందిన రివెన్ మధుకర్ ఈ షాపును పెట్టాడని, మధుకర్ సొంతూరు వెళ్లగా..షాపును బావమరిదికి అప్పగించిన సమయంలో ఈ ఘటన జరిగింది. సోషల్ మీడియా ప్రభావమో, సినిమా ప్రభావమో కానీ.. ఈ దొంగతనాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీరి ఆగడాలు మాత్రం రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మారు వేషాల్లో దర్జాగా వచ్చి దోచుకుంటున్నారు. నకిలీ పోలీస్ ఆఫీసర్లు, అధికారులు, దొంగ బాబా వేషాలు వేసి.. సినిమా రేంజ్‌లో నటించి దోపిడీలకు పాల్పడుతున్నారు.
పేటీఎం ద్వారా డబ్బులు పంపి, మహిళకు చుక్కలు చూపిస్తున్న ఆగంతకులు!
చివరకు వచ్చింది నకిలీ అధికారులు అని తెలుసుకుని.. లబోదిబోమంటున్నారు. ఇవే సినిమాలకు ప్రేరణ అవుతున్నాయో, సినిమాలను చూసి ఇలా తయారయ్యారో తెలియడం లేదు. అచ్చంగా ప్రొఫెషనల్స్ మాదిరిగా వ్యవహరించి దోపిడీలకు పాల్పడుతున్నారు. తాము ఐటి అధికారులమనీ, బంగారం కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారన.. కొంచెం సేపు తనిఖీ చేస్తున్నట్లు నటించి..విలువైన వస్తువులతో ఉడాయిస్తున్నారు. సాధారణంగా ఐటీ అధికారులు నేరుగా సోదాలు చేయరు. ముందుగా నోటీసులు ఇస్తారు. కానీ అలాంటి నోటీసులేమీ రాకపోవడంతో వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. సొమ్ములు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు రావాలని తీసుకెళ్లిపోతున్నారు. బాధితులు స్టేషన్ వద్దకు వెళ్తే కానీ దొంగతనం జరిగిందని గుర్తించలేకపోతున్నారు.
బంగారు దుకాణాలు, ఇతర చోట్ల అత్యధికంగా లెక్కలోకి రాని వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి.దీంతో బంగారం లేదా.. ఇతర నగదు దోచుకుంటే వారు పోలీసులకు ఫిర్యాదు చేయరన్న అభిప్రాయం ఉంది. అందుకే దొంగలు ఇలాంటి వ్యాపారుల్ని టార్గెట్ చేస్తారని అంచనా వేస్తున్నారు.
Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి
Online Betting Scam: ఆన్ లైన్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా అరెస్ట్, యువకులు జాగ్రత్తగా ఉండాలంటున్న పోలీసులు
పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన యువతి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి, సోదరుడు
Cyber Crime: గణేష్ ఉత్సవాల లక్కీ డ్రాలో ఐఫోన్ 15-నమ్మితే అకౌంట్ ఖాళీ అయినట్టే
Hyderabad: హైదరాబాదులో వర్షం, నాలా లో పడి పారిశుద్ధ కార్మికురాలు మృతి
బెలూన్‌లా ఉబ్బిపోతున్న అంగన్‌వాడి పాల ప్యాకెట్లు- సోషల్ మీడియాలో వీడియో వైరల్- జగన్‌పై లోకేష్ తీవ్ర ఆరోపణలు
Telangana Congress : గెలుపు గుర్రాలకే టిక్కెట్లు - సీనియర్లు అయినా బేరాల్లేవ్ ! కాంగ్రెస్ హైకమాండ్ ఒక్కటే మాట
Priyanka Mohan - Nani : నానితో మరోసారి - తమిళమ్మాయికి మరో తెలుగు సినిమా!
Skanda Day 2 Collections: బాక్సాఫీస్ దగ్గర తగ్గిన ‘స్కంద’ జోరు, తొలి రోజుతో పోల్చితే సగానికిపైగా పడిపోయిన కలెక్షన్స్
/body>